EC Fires on DGP Anjani kumar For meeting Revanth Reddy: హైదరాబాద్: ఎలక్షన్ కమిషన్ (ఈసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఎన్నికల ఫలితాలు వెలువెడుతున్న సమయంలోనే డీజీపీ అంజనీకుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుండగానే టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డిని డీజీపీ కలుసుకుని చర్చ జరపడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని పీటీఐ న్యూజ్ ఏజెన్సీ తెలిపింది. ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరపాలని డీజీపీ అంజనీకుమార్ తో రేవంత్ రెడ్డి నేటి మధ్యహ్నం కలిసి చర్చించారని తెలిసిందే. అయితే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సమయంలో రేవంత్ రెడ్డిని కలిసి ప్రమాణ స్వీకారంపై చర్చించడంతో డీజీపీపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రేవంత్ రెడ్డిని కలవడంపై అంజనీ కుమార్ ను ఈసీ వివరణ కోరింది.