Bhatti Vikramarka Mallu: తెలంగాణలో ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్ కు అత్యంత అనుకూలంగా ఫలితాలు వస్తు్న్న వేళ కాంగ్రెస్ కీలక నేత, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. తనకు సీఎం పదవి ఇస్తే బాధ్యతగా భావించి, అన్ని హామీలు నెరవేస్తానని అన్నారు. తెలంగాణలో దొరల పాలన అంతం అయిపోయిందని అన్నారు. ఇకపై ప్రజల తెలంగాణ వచ్చిందని భట్టి విక్రమార్క అన్నారు. ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులందరికీ అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ తరఫున ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తామని అన్నారు.
Bhatti Vikramarka: సీఎం పదవి వస్తే బాధ్యతగా చేస్తా - భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
ABP Desam | 03 Dec 2023 03:05 PM (IST)
తెలంగాణలో దొరల పాలన అంతం అయిపోయిందని అన్నారు. ఇకపై ప్రజల తెలంగాణ వచ్చిందని భట్టి విక్రమార్క అన్నారు.
భట్టి విక్రమార్క