EC has taken action against the IPS who are accused of favoring YCP :  ఏపీలో ఐదుగురు ఎస్పీలు, ఓ ఐజీ, ముగ్గురు కలెక్టర్లపై బదిలీ వేటు వేసింది ఈసీ. గుంటూరు రేంజ్ IG  పాలరాజును  బదిలీ చే్శారు.  ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి , పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువా, అనంతపురం ఎస్పీ అంబురాజన్ , నెల్లూరు ఎస్పీ కె.తరములేశ్వర్ రెడ్డిపై  బదిలీ వేటు వేసారు.   బదిలీ అయిన అధికారులు తమ కింది వారికి తక్షణం బాధ్యతలు అప్పగించి తప్పుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేిసంది.  బదిలీ అయిన అధికారులు ఎన్నికలు పూర్తయ్యే వరకూ విధుల్లో ఉండకూడదని స్పష్టం చేశారు.  సాయంత్రం 5 గంటల్లోపు బదిలీ అయిన వారి స్థానంలో కొత్తవారి భర్తీకి ముగ్గురు ఆఫీసర్లతో ప్యానల్ పంపాలని సూచించింది. 


 ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత చిలూకలూరిపేటలో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్న బహిరంగసభలో గందరగోళం ఏర్పడింది. ఈ సందర్భంగా విధుల్లో ఉండాల్సిన ఎస్పీలు నిర్లక్ష్యంగా వ్యవహరించారని సభను విఫలం చేయడానికి ప్రయత్నించారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీఈవో నివేదికను.. కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. చివరికి చర్యలు తీసుకున్నారు. 




పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డిపై టీడీపీ నేతలు చాలా కాలంగా ఆరోపణలు చేస్తున్నారు. ఆయన వైసీపీ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారని పలుమార్లు ఫిర్యాదులు చేశారు. పల్నాడులో శాంతిభద్రతలు దిగజారుతున్నా వైసీపీ నేతలకే మద్దతుగా ఉంటున్నారని అంటున్నారు. నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి  పైనా ఇదే విధమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత  రాజకీయ హింస పలు జిల్లాల్లో చోటు చోసుకుంది.   ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డలో రాజకీయ హత్యలు చోటు చేసుకున్నాయి. అలాగే పల్నాడు జిల్లాలోని మాచర్లలో దాడులు చోటు చేసుకున్నాయి. ఈ మూడు ఘటనలను ఈసీ సీరియస్ గా తీసుకుంది. 


హింసను అరికట్టడంలో ఎందుకు విఫలమయ్యారో చెప్పాలని మూడు జిల్లాల ఎస్పీలను ఈసీ ఆదేశించింది. అంతే కాదు నేరుగా హాజరై ఈ వివరణ ఇవ్వాలని ఆదేశాలు పంపింది. దీంతో ప్రకాశం, పల్నాడు, నంద్యాల ఎస్పీలు   సీఈవో ముందు హాజరై వివరణ ఇచ్చారు.  వారి వివరణ తీరు ఏ మాత్రం సంతృప్తికరంగా లేదనుకున్న ఈసీ బదిలీ వేటు వేసింది. అనంతపురం ఎస్పీ అన్బురాజన్, చిత్తూరు ఎస్పీ జాషువా  చాలా కాలంగా.. వైసీపీ నేతలు చెప్పినట్లే చేస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి.  ఐజీ పాలరాజుపై కూడా ఫిర్యాదులు వెళ్లడంతో విచారణ జరిపిన ఈసీ బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.  


ముగ్గురు కలెక్టర్లపైనా ఈసీ బదిలీ వేటు వేసింది. కృష్ణా, అనంతపురం, తిరుపతి జిల్లాల కలెక్టర్లపైనా  వేటు వేసింది. వీరు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వర్ల రామయ్య నేతృత్వంలో టీడీపీ బృందం  ఈసీకి ఫిర్యాదు చేసింది. వీరంతా తక్షణం విధుల నుంచి వైదొలగాలని.. ఎన్నికలు అయ్యే వరకూ ఎన్నికల సంబంధ విధులు అప్పగించవద్దని స్పష్టం చేసింది.