East Godavari Districts Nws: ఏపీలో ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా తర్వాతే ఏ జిల్లా కోసమైనా మాట్లాడుకుంటారు. అంత ప్రాధాన్యత ఉన్న జిల్లా తూర్పుగోదావరి జిల్లా. ఈ జిల్లాలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీ అధికారంలోకి రావడమనేది ఇంతవరకు చూస్తూనే ఉన్నారు. అందుకే ఇప్పుడు అన్ని పార్టీల చూపు ఉమ్మడి తూర్పుగోదావరిపై ప‌డింది. ఇక్కడి ప్రజలుకూడా అంతే చైతన్యవంతంగా ఆలోచిస్తుంటారని అంటుంటారు. ఎన్నికల సమీపిస్తున్న వేళ అసలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయ ముఖచిత్రం ఎలా ఉంది..? ఏ పార్టీల తరుఫున ఎవరు బరిలో ఉన్నారు. కొత్తగా పోటీ చేస్తుంది ఎవరు.? 2014, 19 ఎన్నికల్లో విజయం ఎవరిని వరించింది..? ఈ అంశాలన్నీ ఓ సారి పరిశీలిద్దాం.

తూర్పుగోదావరి జిల్లా పునర్విభజన తరువాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పార్లమెంటు నియోజకవర్గ పరిధి ప్రాతిపదికన మూడు జిల్లాలుగా మార్చారు. రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం పార్లమెంటు స్థానాలు ఉండగా మొత్తం 21 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో గతంలో ఉన్న రంపచోడవరం నియోజకవర్గం తప్పించి కొత్తగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో చేర్చారు. గతంలో పశ్చిమగోదావరి పరిధిలో ఉన్న కొవ్వూరు, గోపాలపురం(ఎస్సీ) నిడదవోలు నియోజకవర్గాలను తూర్పుగోదావరి జిల్లాలో చేర్చారు. రంపచోడవరంకు బదులు గోపాలపురం నియోజకవర్గం రాజమండ్రి పార్లమెంటు స్థానంలో కలిసింది.  

తూర్పుగోదావరి జిల్లాలో..
తూర్పుగోదావరి జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అనపర్తి, కొవ్వూరు, గోపాలపురం(ఎస్సీ), నిడదవోలు, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్‌, రాజానగరం. అనపర్తిలో ప్రస్తుతం వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి వైసీపీ తరపున బరిలో ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి తరపున బీజేపీ నుంచి మాజీ సైనికుడు ములగపాటి శివరామకృష్ణంరాజు పోటీ చేస్తున్నారు. అనపర్తిలో 2019లో వైసీపీ, టీడీపీ తలపడ్డాయి. వైసీపీ నుంచి సత్తిసూర్యనారాయణరెడ్డి, టీడీపీ నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ పడితే నల్లమిల్లి 15 వేల ఓట్లు తేడాతో ఓడిపోయారు. 2014లో వైసీపీ అభ్యర్ధి సత్తి సూర్యనారాయణరెడ్డిపై టీడీపీ అభ్యర్ధి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 1300 ఓట్ల తేడాతో గెలుపొందారు. 

అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో  ఇప్పుడు ఎవరెవరు పోటీ. గతంలో గెలిచింది ఎవరు

ప్రస్తుతం వైసీపీ తరఫున పోటీలో ఉన్నది ప్రస్తుతం ఎన్డీఏ తరఫున పోటీలో ఉన్నది 2019లో విజయం సాధించింది.  2014లో విజయం సాధించింది. 
సత్తి సూర్యనారాయణరెడ్డి ములగపాటి శివరామకృష్ణంరాజు(బీజేపీ) సత్తిసూర్యనారాయణరెడ్డి(వైసీపీ) నల్లమిల్లి రామకృష్ణారెడ్డి(టీడీపీ)

కొవ్వూరు నియోజకవర్గం నుంచి ఈసారి వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే తానేటి వనిత, టీడీపీ నుంచి వంగలపూడి అనిత పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో తంబళ్లపల్లి రవికుమార్‌మూర్తి పోటీచేశారు. తానేటి వనిత 25,188 మెజార్టీతో గెలుపొందారు. 2014లో టీడీపీ నుంచి కొత్తపల్లి శామ్యూల్‌ జవహర్‌, వైసీపీ నుంచి తానేటి వనిత పోటీచేయగా 12,745 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు.  

కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు ఎవరెవరు పోటీ. గతంలో గెలిచింది ఎవరు

ప్రస్తుతం వైసీపీ తరఫున పోటీలో ఉన్నది ప్రస్తుతం ఎన్డీఏ తరఫున పోటీలో ఉన్నది 2019లో విజయం సాధించింది.  2014లో విజయం సాధించింది. 
తానేటి వనిత వంగలపూడి అనిత(టీడీపీ)  తానేటి వనిత (వైసీపీ) శామ్యూల్‌ జవహర్‌(టీడీపీ)

నిడదవోలు నియోజకవర్గం నుంచి ఈసారి కూటమి అభ్యర్ధిగా జనసేన నేత కందుల దుర్గేష్‌ బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌నాయుడు పోటీ చేస్తున్నారు. ఇక్కడే స్వతంత్య్ర అభ్యర్థిగా కస్తూరి సత్యప్రసాద్‌(నాని) రంగంలో ఉన్నారు. 2019లో వైసీపీ తరపున జి.శ్రీనివాస్‌నాయుడు, టీడీపీ నుంచి బూరుగుపల్లి శేషారావు, జనసేన నుంచి అతికాల రమ్యశ్రీ, బీజేపీ నుంచి లింగంపల్లి వెంకటేశ్వరరావు పోటీ పడ్డారు. 21,688 ఓట్లు మెజార్టీతో శ్రీనివాస్‌ నాయుడు గెలుపొందారు. 2014లో టీడీపీ నుంచి బూరుగుపల్లి శేషారావు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నుంచి ఎస్‌.రాజీవ్‌ కృష్ణలు పోటీలో ఉండగా టీడీపీ అభ్యర్ధి శేషారావు విజయం సాధించారు.  

నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు ఎవరెవరు పోటీ. గతంలో గెలిచింది ఎవరు

ప్రస్తుతం వైసీపీ తరఫున పోటీలో ఉన్నది ప్రస్తుతం ఎన్డీఏ తరఫున పోటీలో ఉన్నది 2019లో విజయం సాధించింది.  2014లో విజయం సాధించింది. 
జి.శ్రీనివాస్‌నాయుడు కందుల దుర్గేష్‌ జి.శ్రీనివాస్‌నాయుడు(వైసీపీ) శేషారావు(టీడీపీ)

రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఈసారి సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని(టీడీపీ) భర్త ఆదిరెడ్డి వాసు, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌(వైసీపీ) మధ్య వార్‌ నడుస్తుంది. 2019లో టీడీపీ అభ్యర్ధిగా ఆదిరెడ్డి భవాని, వైసీపీ నుంచి రౌతు సూర్యప్రకాశరావు, జనసేన నుంచి అత్తి సూర్యనారాయణ, బీజేపీ నుంచి బమ్మల దత్తులు పోటీ చేశారు. వైసీపీ అభ్యర్ధి రౌతుపై ఆదిరెడ్డి భవాని 30,065ఓట్లు మోజార్టీతో విజయం సాధించారు. 2014లో బీజేపీ అభ్యర్ధి ఆకుల సత్యనారాయణకు, వైసీపీ అభ్యర్ధి బమ్మన రాజ్‌కుమార్‌ మధ్య పోటీ జరగ్గా బీజేపీ అభ్యర్ధి ఆకుల 26,377 ఓట్లుతో గెలుపొందారు. 

రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు ఎవరెవరు పోటీ. గతంలో గెలిచింది ఎవరు

ప్రస్తుతం వైసీపీ తరఫున పోటీలో ఉన్నది ప్రస్తుతం ఎన్డీఏ తరఫున పోటీలో ఉన్నది 2019లో విజయం సాధించింది.  2014లో విజయం సాధించింది. 
 మార్గాని భరత్‌ ఆదిరెడ్డి వాసు(టీడీపీ) ఆదిరెడ్డి భవాని(టీడీపీ) ఆకుల సత్యనారాయణ(బీజేపీ)

రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గంలో టీడీపీ సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వైసీపీ నుంచి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పోటీలో ఉన్నారు. 2019లో టీడీపీ అభ్యర్ధిగా గోరంట్ల బుచ్చయ్యచౌదరి,  వైసీపీ నుంచి ఆకుల వీర్రాజు, జనసేన నుంచి కందుల దుర్గేష్‌లు తలపడగా 10,404 మెజార్టీతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలుపొందారు. 2014లో టీడీపీ అభ్యర్ధిగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వైసీపీ నుంచి ఆకుల వీర్రాజు పోటీలో ఉండగా 18,058 ఓట్లు మెజార్టీతో గోరంట్ల గెలుపొందారు. 

రాజమండ్రి రూరల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు ఎవరెవరు పోటీ. గతంలో గెలిచింది ఎవరు

ప్రస్తుతం వైసీపీ తరఫున పోటీలో ఉన్నది ప్రస్తుతం ఎన్డీఏ తరఫున పోటీలో ఉన్నది 2019లో విజయం సాధించింది.  2014లో విజయం సాధించింది. 
 చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గోరంట్ల బుచ్చయ్య చౌదరి(టీడీపీ) గోరంట్ల బుచ్చయ్య చౌదరి(టీడీపీ) గోరంట్ల బుచ్చయ్య చౌదరి(టీడీపీ)

రాజానగరంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్ధిగా జక్కంపూడి రాజా పోటీలో ఉండగా టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి ఉమ్మడి అభ్యర్ధిగా జనసేన నుంచి బత్తుల బలరామకృష్ణ బరిలో ఉన్నారు. 2019లో వైసీపీ నుంచి జక్కంపూడి రాజా, టీడీపీ నుంచి పెందుర్తి వెంకటేష్‌, జనసేన నుంచి రాయపురెడ్డి ప్రసాద్‌లు పోటీచేయగా వైసీపీ అభ్యర్ధి జక్కంపూడి రాజా 31,772 ఓట్లు మెజార్టీతో విజయం సాధించారు. 2014లో టీడీపీ అభ్యర్ధి పెందుర్తి వెంకటేష్‌, వైసీపీ నుంచి జక్కంపూడి విజయలక్ష్మి పోటీచేయగా 8,887 ఓట్లు మెజార్టీతో టీడీపీ అభ్యర్ధి విజయం సాధించారు..

రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు ఎవరెవరు పోటీ. గతంలో గెలిచింది ఎవరు

ప్రస్తుతం వైసీపీ తరఫున పోటీలో ఉన్నది ప్రస్తుతం ఎన్డీఏ తరఫున పోటీలో ఉన్నది 2019లో విజయం సాధించింది.  2014లో విజయం సాధించింది. 
జక్కంపూడి రాజా బత్తుల బలరామకృ(జనసేన) జక్కంపూడి రాజా(వైసీపీ) పెందుర్తి వెంకటేష్‌(టీడీపీ)

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో...
అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో అమలాపురం పార్లమెంటు సెగ్మెంట్‌లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వాటిలో అమలాపురం, కొత్తపేట, పి.గన్నవరం, రాజోలు, రామచంద్రపురం, మండపేట, ముమ్మిడివరం నియోజకవర్గాలున్నాయి. అమలాపురం(ఎస్సీ) నుంచి ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీ నుంచి సిట్టింగ్‌ పినిపే విశ్వరూప్‌, ఉమ్మడి కూటమి అభ్యర్ధిగా టీడీపీ నుంచి అయితాబత్తుల ఆనందరావు బరిలో ఉన్నారు. 2019లో వైసీపీ నుంచి పినిపే విశ్వరూప్‌, టీడీపీ నుంచి అయితాబత్తుల ఆనందరావు, జనసేన నుంచి శెట్టిబత్తుల రాజబాబులు పోటీలో ఉండగా వైసీపీ అభ్యర్ధి విశ్వరూప్‌ 25,645 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. 2014లో టీడీపీ అభ్యర్ది అయితాబత్తుల ఆనందరావు వైసీపీ అభ్యర్ధి గొల్ల బాబూరావుపై 12,413 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. 

అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు ఎవరెవరు పోటీ. గతంలో గెలిచింది ఎవరు

ప్రస్తుతం వైసీపీ తరఫున పోటీలో ఉన్నది ప్రస్తుతం ఎన్డీఏ తరఫున పోటీలో ఉన్నది 2019లో విజయం సాధించింది.  2014లో విజయం సాధించింది. 
పినిపే విశ్వరూప్‌ అయితాబత్తుల ఆనందరా(టీడీపీ) పినిపే విశ్వరూప్‌(వైసీపీ) అయితాబత్తుల ఆనందరావు(టీడీపీ)

కొత్తపేట నుంచి ప్రస్తుతం వైసీపీ అభ్యర్ధిగా సిట్టింగ్‌ చిర్ల జగ్గిరెడ్డి, కూటమి అభ్యర్ధిగా బండారు సత్యానందరావు బరిలో ఉన్నారు. 2019లో వైసీపీ నుంచి జగ్గిరెడ్డి, టీడీపీ నుంచి బండారు సత్యానందరావు, జనసేన నుంచి బండారు శ్రీనివాసరావులు పోటీలో ఉండగా 4,038 ఓట్లుతో జగ్గిరెడ్డి గెలుపొందారు. 2014లో టీడీపీ అభ్యర్ధి బండారు సత్యానందరావుపై 713 ఓట్లు సాధించి చిర్ల జగ్గిరెడ్డి గెలుపొందారు. 

కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు ఎవరెవరు పోటీ. గతంలో గెలిచింది ఎవరు

ప్రస్తుతం వైసీపీ తరఫున పోటీలో ఉన్నది ప్రస్తుతం ఎన్డీఏ తరఫున పోటీలో ఉన్నది 2019లో విజయం సాధించింది.  2014లో విజయం సాధించింది. 
చిర్ల జగ్గిరెడ్డి బండారు సత్యానందరావు(టీడీపీ) చిర్ల జగ్గిరెడ్డి(వైసీపీ) చిర్ల జగ్గిరెడ్డి(వైసీపీ)

పి.గన్నవరం(ఎస్సీ) నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీ అభ్యర్ధిగా విప్పర్తి వేణుగోపాలకృష్ణ, కూటమి నుంచి జనసేన అభ్యర్ధి గిడ్డి సత్యనారాయణ పోటీలో ఉన్నారు. 2019లో వైసీపీ అభ్యర్ధిగా కొండేటి చిట్టిబాబు, టీడీపీ నుంచి నేలపూడి స్టాలిన్‌ పోటీ చేయగా 22,207 ఓట్లు మెజార్టీతో చిట్టిబాబు గెలుపొందారు. 2014లో వైసీపీ అభ్యర్ధి కొండేటి చిట్టిబాబుపై టీడీపీఅభ్యర్ధి పులపర్తి నారాయణమూర్తి 13,505 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. 

పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు ఎవరెవరు పోటీ. గతంలో గెలిచింది ఎవరు

ప్రస్తుతం వైసీపీ తరఫున పోటీలో ఉన్నది ప్రస్తుతం ఎన్డీఏ తరఫున పోటీలో ఉన్నది 2019లో విజయం సాధించింది.  2014లో విజయం సాధించింది. 
విప్పర్తి వేణుగోపాలకృష్ణ గిడ్డి సత్యనారాయణ (జనసేన)  చిట్టిబాబు (వైసీపీ) పులపర్తి నారాయణమూర్తి(టీడీపీ)

రాజోలు(ఎస్సీ) నియోజకవర్గంలో వైసీపీ నుంచి గొల్లపల్లి సూర్యారావు, కూటమి నుంచి జనసేన అభ్యర్ధిగా మాజీ ఐఏఎస్‌ అధికారి దేవ వరప్రసాదరావు బరిలో ఉన్నారు. 2019లో వైసీపీ నుంచి బంతు రాజేశ్వరరావు, టీడీపీ నుంచి గొల్లపల్లి సూర్యారావు, జనసేన నుంచి రాపాక వరప్రసాదరావు బరిలో ఉండగా 1,167 ఓట్లు సాధించి రాపాక గెలుపొందారు. 2014లో వైసీపీ అభ్యర్ధి బంతు రాజేశ్వరరావుపై టీడీపీ అభ్యర్ధి గొల్లపల్లి సూర్యారావు విజయం సాధించారు. 

రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు ఎవరెవరు పోటీ. గతంలో గెలిచింది ఎవరు

ప్రస్తుతం వైసీపీ తరఫున పోటీలో ఉన్నది ప్రస్తుతం ఎన్డీఏ తరఫున పోటీలో ఉన్నది 2019లో విజయం సాధించింది.  2014లో విజయం సాధించింది. 
గొల్లపల్లి సూర్యారావు దేవ వరప్రసాదరా(జనసేన)  రాపాక వరప్రసాదరావు(వైసీపీ) గొల్లపల్లి సూర్యారావు(టీడీపీ)

రామచంద్రపురం నియోజకవర్గంలో వైసీపీ నుంచి పిల్లి సూర్యప్రకాశరావు, టీడీపీ నుంచి వాసంశెట్టి సుభాష్‌ బరిలో ఉన్నారు. 2019లో టీడీపీ అభ్యర్ధి తోట త్రీమూర్తులు పై వైసీపీ అభ్యర్ధి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ 5,168 ఓట్లు సాధించి గెలుపొందారు. 2014లో వైసీపీ అభ్యర్ధి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌పై టీడీపీ అభ్యర్ధి తోట త్రీమూర్తులు 16,922 ఓట్లుతో విజయం సాధించారు. 

రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు ఎవరెవరు పోటీ. గతంలో గెలిచింది ఎవరు

ప్రస్తుతం వైసీపీ తరఫున పోటీలో ఉన్నది ప్రస్తుతం ఎన్డీఏ తరఫున పోటీలో ఉన్నది 2019లో విజయం సాధించింది.  2014లో విజయం సాధించింది. 
పిల్లి సూర్యప్రకాశరావు వాసంశెట్టి సుభాష్‌(టీడీపీ)  చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ(వైసీపీ) తోట త్రీమూర్తులు(టీడీపీ)

మండపేట నియోజకవర్గంలో వైసీపీ నుంచి తోట త్రీమూర్తులు, కూటమి నుంచి టీడీపీ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పోటీలో ఉన్నారు. 2019లో వైసీపీ అభ్యర్ధి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, టీడీపీ అభ్యర్ధి వేగుళ్ల జోగేశ్వరరావు, జనసేన నుంచి వి.లీలాకృష్ణ పోటీలోఉండగా 10,600 ఓట్లుతో జోగేశ్వరరావు గెలుపొందారు. 2014లో వైసీపీ నుంచి జీవీ స్వామి నాయుడుపై 36,014 ఓట్లు మెజార్టీతో వేగుళ్ల జోగేశ్వరరావు గెలుపొందారు. 

మండపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు ఎవరెవరు పోటీ. గతంలో గెలిచింది ఎవరు

ప్రస్తుతం వైసీపీ తరఫున పోటీలో ఉన్నది ప్రస్తుతం ఎన్డీఏ తరఫున పోటీలో ఉన్నది 2019లో విజయం సాధించింది.  2014లో విజయం సాధించింది. 
తోట త్రీమూర్తులు వేగుళ్ల జోగేశ్వరరావు(టీడీపీ)  వేగుళ్ల జోగేశ్వరరావు(టీడీపీ)  వేగుళ్ల జోగేశ్వరరావు(టీడీపీ)


ముమ్మిడివరం నియోజకవర్గంలో ఈసారి కూటమి అభ్యర్ధిగా దాట్ల సుబ్బరాజు, వైసీపీ అభ్యర్ధిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ బరిలో ఉన్నారు. 2019లో వైసీపీ అభ్యర్ధిగా పొన్నాడ సతీష్‌, టీడీపీ నుంచి దాట్ల సుబ్బరాజు, జనసేన నుంచి పితాని బాలకృష్ణ పోటీచేశారు. 5547 ఓట్లు మెజార్టీతో వైసీపీ అభ్యర్ధి పొన్నాడ గెలుపొందారు. 2014లో టీడీపీ నుంచి దాట్ల సుబ్బరాజు, వైసీపీ నుంచి గుత్తుల వెంకటసాయి శ్రీనివాసరావు పోటీచేయగా 29,538 ఓట్లు మెజార్టీతో టీడీపీ అభ్యర్ధి దాట్ల సుబ్బరాజు గెలుపొందారు. 

ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు ఎవరెవరు పోటీ. గతంలో గెలిచింది ఎవరు

ప్రస్తుతం వైసీపీ తరఫున పోటీలో ఉన్నది ప్రస్తుతం ఎన్డీఏ తరఫున పోటీలో ఉన్నది 2019లో విజయం సాధించింది.  2014లో విజయం సాధించింది. 
పొన్నాడ సతీష్‌ దాట్ల సుబ్బరాజు (టీడీపీ) పొన్నాడ సతీష్‌(వైసీపీ) దాట్ల సుబ్బరాజు (టీడీపీ)

కాకినాడ జిల్లాలో..
కాకినాడ సిటీ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం వైసీపీ అభ్యర్ధిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, టీడీపీ నుంచి వనమాడి కొండబాబు బరిలో ఉన్నారు. 2019లో వైసీపీ అభ్యర్ధిగా ద్వారంపూడి, టీడీపీ నుంచి కొండబాబు పోటీచేయగా ద్వారంపూడి 14,111 ఓట్లు ఆధిక్యంతో విజయం సాధించారు. 2014లో వైసీపీ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డిపై టీడీపీ అభ్యర్ధి వనమాడి కొండబాబు24,000 ఓట్లుతో గెలుపొందారు. 

కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు ఎవరెవరు పోటీ. గతంలో గెలిచింది ఎవరు

ప్రస్తుతం వైసీపీ తరఫున పోటీలో ఉన్నది ప్రస్తుతం ఎన్డీఏ తరఫున పోటీలో ఉన్నది 2019లో విజయం సాధించింది.  2014లో విజయం సాధించింది. 
ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి వనమాడి కొండబాబు(టీడీపీ) ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి(వైసీపీ) వనమాడి కొండబాబు(టీడీపీ)

కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో వైసీపీ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, కూటమి నుంచి జనసేన తరపున పంతం నానాజీ పోటీలో ఉండగా 2019లో వైసీపీ అభ్యర్ధి కురుసాల కన్నబాబు టీడీపీ అభ్యర్ధి పిల్లి అనంతలక్ష్మి, జనసేన అభ్యర్ధి పంతం నానాజీ బరిలో ఉన్నారు. కురసాల కన్నబాబు 8,789 ఓట్లుతో గెలుపొందారు. 2014లో టీడీపీ నుంచి పిల్లి అనంతలక్ష్మి, వైసీపీ నుంచి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, స్వతంత్య్ర అభ్యర్ధిగా కురసాల కన్నబాబు పోటీచేశారు. 9,048 ఓట్లుతో టీడీపీ నుంచి పిల్లి అనంతలక్ష్మి గెలుపొందారు. 

కాకినాడ రూరల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు ఎవరెవరు పోటీ. గతంలో గెలిచింది ఎవరు

ప్రస్తుతం వైసీపీ తరఫున పోటీలో ఉన్నది ప్రస్తుతం ఎన్డీఏ తరఫున పోటీలో ఉన్నది 2019లో విజయం సాధించింది.  2014లో విజయం సాధించింది. 
కురసాల కన్నబాబు పంతం నానాజీ(జనసేన ) కురుసాల కన్నబాబు(వైసీపీ)  పిల్లి అనంతలక్ష్మి(టీడీపీ)

పెద్దాపురంలో టీడీపీ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, వైసీపీ నుంచి దవులూరి దొరబాబు పోటీలో ఉన్నారు. 2019లో టీడీపీ అభ్యర్ధిగా నిమ్మకాయల చినరాజప్ప, వైసీపీ నుంచి తోట వాణి, జనసేన నుంచి యార్లగడ్డ రాంకుమార్‌ పోటీలో ఉండగా 4,027 ఓట్లు తేడాతో చినరాజప్ప గెలుపొందారు. 2014లో టీడీపీ నుంచి నిమ్మకాయల చినరాజప్ప, వైసీపీ నుంచి తోట సుబ్బారావునాయుడు పోటీచేయగా 10,663 ఓట్లు తో చినరాజప్ప విజయం సాధించారు. 

పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు ఎవరెవరు పోటీ. గతంలో గెలిచింది ఎవరు

ప్రస్తుతం వైసీపీ తరఫున పోటీలో ఉన్నది ప్రస్తుతం ఎన్డీఏ తరఫున పోటీలో ఉన్నది 2019లో విజయం సాధించింది.  2014లో విజయం సాధించింది. 
దవులూరి దొరబాబు నిమ్మకాయల చినరాజప్ప(టీడీపీ) నిమ్మకాయల చినరాజప్ప(టీడీపీ) నిమ్మకాయల చినరాజప్ప(టీడీపీ)

పిఠాపురంలో ఈసారి జనసేన నుంచి పవన్‌కల్యాణ్‌, వైసీపీ నుంచి కాకినాడ ఎంపీ వంగా గీత బరిలో ఉన్నారు. 2019లో వైసీపీ నుంచి పెండెం దొరబాబు, టీడీపీ నుంచి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ, జనసేన నుంచి మాకినీడు శేషుకుమారి పోటీలో ఉండగా 14,992 ఓట్లుతో పెండెం దొరబాబు విజయం సాధించారు. 2014లో స్వతంత్య్ర అభ్యర్ధిగా ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ బరిలో దిగగా వైసీపీ నుంచి పెండెం దొరబాబు, టీడీపీ నుంచి పోతుల విశ్వం పోటీ చేశారు. 47,080 ఓట్లు భారీ మెజార్టీతో ఎస్‌వీఎస్‌ఎస్‌ వర్మ గెలుపొందారు. 

పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు ఎవరెవరు పోటీ. గతంలో గెలిచింది ఎవరు

ప్రస్తుతం వైసీపీ తరఫున పోటీలో ఉన్నది ప్రస్తుతం ఎన్డీఏ తరఫున పోటీలో ఉన్నది 2019లో విజయం సాధించింది.  2014లో విజయం సాధించింది. 
వంగా గీత పవన్‌కల్యాణ్‌(జనసేన ) పెండెం దొరబాబు(వైసీపీ) ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ(ఇండిపెండెంట్)

ప్రత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీ నుంచి వరుపుల సత్యప్రభ, వైసీపీ నుంచి వరుపుల సుబ్బారావు బరిలో ఉన్నారు. 2019లో వైసీపీ నుంచి పర్వత పూర్ణచంద్రప్రసాద్‌, టీడీపీ నుంచి వరుపుల సుబ్బారావు పోటీలో ఉండగా 4,666 ఓట్లు తేడాతో పర్వత పూర్ణచంద్రరావు గెలుపొందారు. 2014లో వైసీపీ నుంచి వరుపుల సుబ్బారావు, టీడీపీ నుంచి పర్వత సత్యనారాయణమూర్తి పోటీ చేయగా 3,413 ఓట్లుతో వరుపుల సుబ్బారావు గెలుపొందారు. 

ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు ఎవరెవరు పోటీ. గతంలో గెలిచింది ఎవరు

ప్రస్తుతం వైసీపీ తరఫున పోటీలో ఉన్నది ప్రస్తుతం ఎన్డీఏ తరఫున పోటీలో ఉన్నది 2019లో విజయం సాధించింది.  2014లో విజయం సాధించింది. 
వరుపుల సుబ్బారావు వరుపుల సత్యప్రభ(టీడీపీ) పర్వత పూర్ణచంద్రరావు(వైసీపీ) వరుపుల సుబ్బారావు(వైసీపీ)

జగ్గంపేట నుంచి ఈసారి వైసీపీ తరపున తోట నరసింహం, టీడీపీ నుంచి జ్యోతుల నెహ్రూ బరిలో ఉన్నారు. 2019లో టీడీపీ నుంచి జ్యోతుల నెహ్రూ, వైసీపీ నుంచి జ్యోతుల చంటిబాబు, జనసేన నుంచి పాతంశెట్టి సూర్యచంద్ర బరిలో ఉండగా 23,365 ఓట్లుతో జ్యోతుల చంటిబాబు విజయం సాధించారు. 2014లో వైసీపీ నుంచి జ్యోతుల నెహ్రూ, టీడీపీ నుంచి జ్యోతుల చంటిబాబు పోటీ చేయగా వైసీపీ అభ్యర్ధిగా పోటీచేసిన జ్యోతుల నెహ్రూ 15,932 ఓట్లుతో గెలుపోందారు. 

జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు ఎవరెవరు పోటీ. గతంలో గెలిచింది ఎవరు

ప్రస్తుతం వైసీపీ తరఫున పోటీలో ఉన్నది ప్రస్తుతం ఎన్డీఏ తరఫున పోటీలో ఉన్నది 2019లో విజయం సాధించింది.  2014లో విజయం సాధించింది. 
తోట నరసింహం జ్యోతుల నెహ్రూ(టీడీపీ) జ్యోతుల చంటిబాబు(వైసీపీ)  జ్యోతుల నెహ్రూ(వైసీపీ)

తుని నియోజకవర్గంలో ప్రస్తుతం టీడీపీ నుంచి యనమల దివ్య, వైసీపీ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా బరిలో ఉన్నారు. 2019లో వైసీపీ అభ్యర్ధిగా దాడిశెట్టి రాజా, టీడీపీ నుంచి యనమల కృష్ణుడు, జనసేన నుంచి కృష్ణంరాజు శ్రీరాజవత్సవాయి పోటీ చేశారు. ఈ పోటీలో దాడిశెట్టి రాజా 24,016 ఓట్లు ఆధిక్యంతో విజయం సాధించారు. 2014లో వైసీపీ నుంచి దాడిశెట్టి రాజా, టీడీపీ నుంచి యనమల కృష్ణుడు పోటీచేయగా 18,573 ఓట్లు సాధించి వైసీపీ అభ్యర్ధి దాడిశెట్టి రాజా గెలుపొందారు. 

తుని అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు ఎవరెవరు పోటీ. గతంలో గెలిచింది ఎవరు

ప్రస్తుతం వైసీపీ తరఫున పోటీలో ఉన్నది ప్రస్తుతం ఎన్డీఏ తరఫున పోటీలో ఉన్నది 2019లో విజయం సాధించింది.  2014లో విజయం సాధించింది. 
దాడిశెట్టి రాజా యనమల దివ్య(టీడీపీ) దాడిశెట్టి రాజా (వైసీపీ) దాడిశెట్టి రాజా(టీడీపీ)