Delhi Assembly News: అత్యంత ప్రతిష్టాత్మకత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సోమవారం ముగిసింది. ఫిబ్రవరి 5న జరిగే ఓటింగ్‌కు ఓటర్లు సిద్ధమయ్యారు. అందుకు తగ్గట్టుగానే ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. అంతకంటే ముందు గత నెలరోజులుగా ప్రచారంతో హోరెత్తించిన పార్టీలు ఇప్పుడు మౌనందాల్చాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం పోలింగ్ ముగియడానికి 48 గంటల ముందు బహిరంగ సమావేశాలు ఎన్నికల ప్రచార కార్యకలాపాలు నిలిపివేయాల్సి ఉంటుంది.
ఆప్ తరఫున ఆరవింద్ కేజ్రీవాల్‌సహా కీలక నేతలతా ఢిల్లీని చుట్టేశారు. తమ పాలన మెచ్చి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈసారి బీజేపీ కూడా గెలుపే లక్ష్యంగా ప్రచారం చేసింది. ఆ పార్టీ తరఫున ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్‌షాతోపాటు కీలక నేతలంతా ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్డీఏ నేతలు కూడా ప్రచారం చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి కీలక నేతలంతా అక్కడ ప్రచారంలో పాల్గొని బీజేపీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆదివారం ప్రచారం చేశారు. ప్యాలెస్ ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ, ప్రియాంక, ఇలా కీలక నేతలంతా ప్రచారం చేశారు. అయితే ప్రధాన పోటీ మాత్రం ఆప్, బీజేపీ మధ్య ఉందని సర్వేలు చెబుతున్నాయి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఆ రోజున ప్రభుత్వ సెలవు ప్రకటించింది. ఢిల్లీ అసెంబ్లీకి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఢిల్లీలోని NCT ప్రభుత్వ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక/స్వయంప్రతిపత్తి గల సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించారు. .
ఢిల్లీలో 83.49 లక్షల మంది పురుషులు, 71.73 లక్షల మంది మహిళా ఓటర్లు
ఢిల్లీలోని 70 నియోజకవర్గాలలో, 11 జిల్లాల్లోని 58 స్థానాలు సాధారణమైనవి, 12 షెడ్యూల్డ్ కులాలకు రిజర్వు చేశారు. ఢిల్లీలో 83.49 లక్షల మంది పురుష ఓటర్లు, 71.73 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. థర్డ్ జెండర్ ఓటర్ల సంఖ్య 1,261. వీరిలో 25.89 లక్షల మంది యువ ఓటర్లు ఉన్నారు. ఢిల్లీలో మొత్తం 1.55 కోట్ల కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు, ఢిల్లీ ఎన్నికల్లో మొత్తం పోలింగ్ స్టేషన్ల సంఖ్య 13,033, అందులో 70 పోలింగ్ స్టేషన్లు వికలాంగులు (PWD) 70 పోలింగ్ స్టేషన్లు మహిళలకు కేటాయించారు.
19 శాతం అభ్యర్థులపై క్రిమినల్ కేసులు
ఎన్నికల హక్కుల సంస్థ 'ఏడీఆర్' విశ్లేషణ ప్రకారం, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 19 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 2020 ఎన్నికల్లో ఈ సంఖ్య 20 శాతంగా ఉంది.
ప్రచార చివరి రోజున భారతీయ జనతా పార్టీ ఢిల్లీ అంతటా 22 రోడ్‌షోలు ర్యాలీలు నిర్వహించింది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వరుసగా మూడవసారి అధికారంలోకి వస్తామని ధీమాతో ఉంది. 2013 వరకు 15 సంవత్సరాలు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్, గత 2 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా పొందలేకపోయింది. ఇప్పుడు తిరిగి పుంజుకొని గెలుపు జెండా ఎగరేస్తామని చెబుతోంది.
Also Read: హస్తప్రయోగాన్ని నిషేధించాలట-పార్లమెంట్‌లో బిల్లు కూడా పెట్టేశాడు- ఈ ఎంపీ మరీ అతిగాడిలా ఉన్నాడే !
గతసారి ఆప్ 62 సీట్లు గెలుచుకుంది
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 62 సీట్లు గెలుచుకుంది. మిగిలిన ఎనిమిది సీట్లు బీజేపీ ఖాతాలోకి వెళ్లాయి. కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోయింది.
ఆప్-70, కాంగ్రెస్-70, బీజేపీ- 68 స్థానాల్లో పోటీ
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది. అసదుద్దీన్ ఒవైసీ, మాయావతి కూడా అభ్యర్థులను రంగంలోకి దించారు. ఢిల్లీలోని మొత్తం 70 స్థానాల్లో ఆప్, కాంగ్రెస్ పోటీ చేస్తున్నాయి. బీజేపీ 68 స్థానాల్లో పోటీ చేస్తోంది. మిత్రపక్షమైన జేడీయూకి ఒక సీటు, చిరాగ్ పాశ్వాన్ పార్టీకి ఒక సీటు ఇచ్చింది.
ప్రముఖ పేర్లలో న్యూఢిల్లీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ (ఆప్), కల్కాజీ నుంచి అతిషి (ఆప్), కరవాల్ నగర్ నుంచి మనోజ్ తివారీ (బిజెపి) ఉన్నారు. న్యూఢిల్లీ నుంచి సందీప్ దీక్షిత్, కల్కాజీ నుంచి అల్కా లాంబా వంటి కీలక అభ్యర్థులను కాంగ్రెస్ పోటీకి నిలబెట్టింది.
క్రమసంఖ్య | నియోజకవర్గం | ఆప్ | బీజేపీ | కాంగ్రెస్ |
1 | నరేలా | దినేష్ భరద్వాజ్ | రాజ్ కరణ్ ఖత్రి | అరుణ కుమారి |
2 | బురారీ | సంజీవ్ ఝా | శైలేంద్ర కుమార్ (JDU) | మంగేష్ త్యాగి |
3 | తిమార్పూర్ | సురేందర్ పాల్ సింగ్ | సూర్య ప్రకాష్ ఖత్రి | లోకేంద్ర కళ్యాణ్ సింగ్ |
4 | ఆదర్శ్ నగర్ | ముఖేష్ గోయెల్ | రాజ్ కుమార్ భాటియా | శివంక్ సింఘాల్ |
5 | బద్లీ | అజేష్ యాదవ్ | దీపక్ చౌదరి | దేవేంద్ర యాదవ్ |
6 | రిథాల | మొహిందర్ గోయల్ | కుల్వంత్ రాణా | సుశాంత్ మిశ్రా |
7 | బవానా | జై భగవాన్ | బ్రహ్మ ప్రకాష్ | సురేంద్ర కుమార్ |
8 | మండ్కా | జస్బీర్ కరాలా | గజేంద్ర దారల్ | ధరమ్ పాల్ లడ్కా |
9 | కిరారీ | అనిల్ ఝా | బజరంగ్ శుక్లా | రాజేష్ గుప్తా |
10 | సుల్తాన్‌పూర్ | మజ్రా ముఖేష్ | అహ్లావత్ కరమ్ సింగ్ | కర్మ జై కిషన్ |
11 | నాంగ్లోయ్ | జాట్ రఘువీందర్ షోకీన్ | మనోజ్ కుమార్ షోకీన్ | రోహిత్ చౌదరి |
12 | మంగోల్ | పూరి రాకేష్ | జాతవ్ రాజ్ కుమార్ చౌహాన్ | హనుమాన్ చౌహాన్ |
13 | రోహిణి | ప్రదీప్ మిట్టల్ | విజేందర్ గుప్తా | సుమేష్ గుప్తా |
14 | షాలిమర్ | బాగ్ బందన కుమారి | రేఖా గుప్తా | ప్రవీణ్ జైన్ |
15 | షకుర్ బస్తీ | సత్యేంద్ర జైన్ | కర్నైల్ సింగ్ | సతీష్ లూత్రా |
16 | TRI నగర్ | ప్రీతి తోమర్ | తిలక్ రామ్ గుప్తా | సతేంద్ర శర్మ |
17 | వజీర్పూర్ | రాజేష్ గుప్తా | పూనమ్ శర్మ | రాగిణి నాయక్ |
18 | మోడల్ టౌన్ | అఖిలేష్ పతి త్రిపాఠి | అశోక్ గోయెల్ | కున్వర్ కరణ్ సింగ్ |
19 | సదర్ బజార్ | సోమ్ దత్ | మనోజ్ జిందాల్ | అనిల్ భరద్వాజ్ |
20 | చాందినీ చౌక్ | పునర్దీప్ సింగ్ | సతీష్ జైన్ | ముదిత్ అగర్వాల్ |
21 | మాటియా మహల్ | షోయబ్ ఇక్బాల్ | దీప్తి ఇండోరా | అసీమ్ అహ్మద్ ఖాన్ |
22 | బల్లిమరన్ | ఇమ్రాన్ హుస్సేన్ | కమల్ బగ్రీ | హరూన్ యూసుఫ్ |
23 | కరోల్ బాగ్ | విశేష్ రవి | దుష్యంత్ Kr గౌతమ్ | రాహుల్ దానక్ |
24 | పటేల్ నగర్ | పర్వేష్ రతన్ | రాజ్ కుమార్ | ఆనంద్ కృష్ణ తీర్థ్ |
25 | మోతీ నగర్ | శివ చరణ్ గోయెల్ | హరీష్ ఖురానా | రాజేంద్ర నామ్ధారి |
26 | మాడిపూర్ | రాఖీ బిడ్లాన్ | ఊర్మిళ గాంగ్వాల్ | JP పన్వార్ |
27 | రాజౌరీ గార్డెన్ | ధన్వతి చండేలా | మంజిందర్ సిర్సా | ధర్మపాల్ చండేలా |
28 | హరి నగర్ | రాజ్ కుమారి ధిల్లాన్ | శ్యామ్ శర్మ | ప్రేమ్ శర్మ |
29 | తిలక్ నగర్ | జర్నైల్ సింగ్ | శ్వేతా సైనీ | PS బావా |
30 | జనకపురి | ప్రవీణ్ కుమార్ | ఆశిష్ సూద్ | హర్బానీ కౌర్ |
31 | వికాస్పురి | మహిందర్ యాదవ్ | పంకజ్ సింగ్ | జితేందర్ సోలంకి |
32 | ఉత్తమ్ నగర్ | పోష్ బాల్యన్ | పవన్ శర్మ | ముఖేష్ శర్మ |
33 | ద్వారక వినయ్ | మిశ్రా ప్రద్యుమాన్ | రాజ్‌పుత్ | ఆదర్శ శాస్త్రి |
34 | మటియాల | సోమేష్ షౌకీన్ | సందీప్ సెహ్రావత్ | రఘువీందర్ షోకీన్ |
35 | నజాఫ్‌గర్ | తరుణ్ యాదవ్ | నీలం పహల్వాన్ | సుష్మా యాదవ్ |
36 | బిజ్వాసన్ | సురేందర్ భరద్వాజ్ | కైలాష్ గహ్లోత్ | దేవేందర్ సహరావత్ |
37 | పాలం | జోగిందర్ సోలంకి | కుల్దీప్ సోలంకి | మాంగే రామ్ |
38 | ఢిల్లీ కంటోన్మెంట్ | వీరేందర్ సింగ్ | కడియన్ భువన్ తన్వర్ | ప్రదీప్ కుమార్ ఉపమన్యు |
39 | రాజిందర్ నగర్ | దుర్గేష్ పాఠక్ | ఉమంగ్ బజాజ్ | వినీత్ యాదవ్ |
40 | న్యూఢిల్లీ | అరవింద్ కేజ్రీవాల్ | పర్వేష్ వర్మ | సందీప్ దీక్షిత్ |
41 | జంగ్‌పుర | మనీష్ సిసోడియా | తర్విందర్ మార్వా | ఫర్హాద్ సూరి |
42 | కస్తూర్బా నగర్ | రమేష్ పెహల్వాన్ | నీరజ్ బసోయా | అభిషేక్ దత్ |
43 | మాల్వియా నగర్ | సోమనాథ్ భారతి | సతీష్ ఉపాధ్యాయ్ | జితేంద్ర Kr కొచర్ |
44 | R K పురం | ప్రమీల టోకాస్ | అనిల్ కుమార్ శర్మ | విశేష టోకాస్ |
45 | మెహ్రౌలీ | మహేంద్ర చౌదరి | గజైందర్ యాదవ్ | పుష్పా సింగ్ |
46 | ఛతర్పూర్ | బ్రహ్మ సింగ్ తన్వర్ | కర్తార్ సింగ్ తన్వర్ | రాజిందర్ తన్వర్ |
47 | డియోలీ | ప్రేమ్ Kr చౌహాన్ | దీపక్ తన్వర్ (LJP-RV) | రాజేష్ చౌహాన్ |
48 | అంబేద్కర్ నగర్ | అజయ్ దత్ | ఖుషీరామ్ చునార్ | జై ప్రకాష్ |
49 | సంగం విహార్ | దినేష్ మొహనియా | చందన్ కుమార్ చౌదరి | హర్ష చౌదరి |
50 | గ్రేటర్ కైలాష్ | సౌరభ్ భరద్వాజ్ | శిఖా రాయ్ | గర్విత్ సింఘ్వి |
51 | కల్కాజీ | అతిషి | రమేష్ బిధూరి | అల్కా లాంబా |
52 | తుగ్లకాబాద్ | సాహి రామ్ | రోహతాస్ బిధురి | వీరేంద్ర భిదూరి |
53 | బదర్పూర్ | రామ్ సింగ్ నేతాజీ | నారాయణ్ దత్ శర్మ | అర్జున్ భదానా |
54 | ఓక్లా | అమానతుల్లా ఖాన్ | మనీష్ చౌదరి | అరిబా ఖాన్ |
55 | త్రిలోకపురి | అంజనా పర్చా | రవికాంత్ ఉజ్జయిని | అమర్‌దీప్ |
56 | కొండ్లి | కులదీప్ కుమార్ | ప్రియాంక గౌతమ్ | అక్షయ్ కుమార్ |
57 | పత్పర్గంజ్ | అవధ్ ఓజా | రవీందర్ సింగ్ నేగి | అనిల్ కుమార్ |
58 | లక్ష్మీ నగర్ | BB త్యాగి | అభయ్ వర్మ | సుమిత్ శర్మ |
59 | విశ్వాస్ నగర్ | దీపక్ సింగ్లా | ఓం ప్రకాష్ శర్మ | రాజీవ్ చౌదరి |
60 | కృష్ణ నగర్ | వికాస్ బగ్గా | డా. అనిల్ గోయల్ | గుర్చరణ్ సింగ్ |
61 | గాంధీ నగర్ | నవీన్ చౌదరి | అరవిందర్ సింగ్ లవ్లీ | కమల్ అరోరా |
62 | షహదర | జితేంద్ర సింగ్ | షుంటి సంజయ్ గోయల్ | జగత్ సింగ్ |
63 | MA పూరి | వీర్ సింగ్ ధింగన్ | కుమారి రింకు | రాజేష్ లిలోథియా |
64 | రోహ్తాస్ నగర్ | సరితా సింగ్ | జితేందర్ మహాజన్ | సురేశ్ వాటి |
65 | లంపూర్ | జుబేర్ చౌదరి | అనిల్ గౌర్ | అబ్దుల్ రెహమాన్ |
66 | ఘొండా | గౌరవ్ శర్మ | అజయ్ మహావర్ | భీశం శర్మ |
67 | బబర్‌పూర్ | గోపాల్ రాయ్ | అనిల్ వశిష్ఠ్ | హాజీ మొహమ్మద్ ఇష్రాక్ ఖాన్ |
68 | గోకల్పూర్ | సురేంద్ర కుమార్ | ప్రవీణ్ నిమేష్ | ఈశ్వర్ బగ్రీ |
69 | ముస్తఫాబాద్ | ఆదిల్ అహ్మద్ ఖాన్ | మోహన్ సింగ్ బిష్త్ | అలీ మహంది |
70 | కరావాల్ నగర్ | మనోజ్ త్యాగి | కపిల్ మిశ్రా | డాక్టర్ పికె మిశ్రా |
Also Read: ఎగ్జామ్ టైం అయిపోయింది - గేట్స్ క్లోజ్ చేసేశారు, ఆలస్యంగా వెళ్లిన ఆ యువతి ఏం చేసిందంటే?