TS Congress MLA List 2023: తీవ్ర ఉత్కంఠ మధ్య తెలంగాణ కాంగ్రెస్ తన తొలిజాబితాను విడుదల చేసింది. ఈ సారి ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆ పార్టీ తీవ్ర కసరత్తు చేసింది. అభ్యర్థుల ఎంపిక కోసం ఇప్పటికే స్క్రీనింగ్ మూడు సార్లు భేటీ అయ్యి క్యాండిడేట్ల పేర్ల జాబితాను కొలిక్కి తెచ్చింది. పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, ఏఐసీసీ ఆమోదం తర్వాత అభ్యర్థుల ప్రకటన వచ్చింది. తొలి జాబితాను 55మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. రెండు రోజుల ముందే ఈ జాబితా ఖరారు అయినా మంచి రోజులు ప్రారంభం అవుతున్నందున ఆదివారం (అక్టోబర్ 15న) జాబితా ప్రకటన చేసింది. పార్టీలోని ముఖ్య నేతల పేర్లు ఈ మొదటి జాబితాలోనే ఉన్నాయి. 


కాంగ్రెస్‌ తొలి జాబితా విడుదల -55 మంది అభ్యర్థులతో ఫస్ట్‌ లిస్ట్‌ 
బెల్లంపల్లి - గడ్డం వినోద్‌
మంచిర్యాల- ప్రేమ్‌సాగర్
 నిర్మల్‌- వినయ్ కుమార్
బోధన్- సుదర్శన్‌ రెడ్డి 
ఆర్మూర్‌- వినయ్‌కుమార్ రెడ్డి


బాల్కొండ- ముత్యాల సునీల్ కుమార్
జగిత్యాల- జీవన్ రెడ్డి
ధర్మపురి-ఆదూరి లక్ష్మణ్‌ కుమార్
రామగుండం-ఎంఎస్‌ రాజ్‌ ఠాకూర్‌
మంథని- దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు
పెద్దపల్లి- చింతకుంట విజయరామారావు
వేములవాడ- ఆది శ్రీనివాస్
మానుకొండూరు- కవ్వంపల్లి సత్యనారాయణ
మెదక్‌- మైనంపల్లి రోహిత్‌రావు
ఆందోల్‌- దమోదర్‌ రాజనరసింహ
జహీరాబాద్‌- చంద్రశేఖర్‌ 
సంగారెడ్డి-తూర్పు జగ్గారెడ్డి 
గజ్వేల్‌- తూముకుంట నర్సారెడ్డి
మేడ్చల్‌ - తోటకూర వజ్రేష్‌ యాదవ్
మల్కాజిగిరి- మైనంపల్లి హనుమంతురావు
కుత్బుల్లాపూర్‌- కొలన్‌ హనుమంత రెడ్డి 
ఉప్పల్‌- పరమేశ్వర్‌ రెడ్డి
చేవెళ్ల-పేమెన భీంభరత్‌
పరిగి- రామ్మోహన్ రెడ్డి 
వికారాబాద్-గడ్డం ప్రసాద్‌ కుమార్
ముషిరాబాద్- అంజన్ కుమార్ యాాదవ్ 
మలక్‌పేట- షేక్ అక్బర్
సనత్‌నగర్‌- కోట నీలిమ
నాంపల్లి- మహ్మద్‌ ఫిరోజ్‌ ఖాన్ 
ఖార్వాన్- ఒస్మాన్‌ బిన్ మహ్మద్‌ అల్‌ హజ్రి
గోషామహాల్-  మొగిలి సునీత 
చాంద్రయాన్ గుట్ట- బోయనగేష్‌


యాకుత్పురా- రవిరాజు
బహుదుర్‌పూర్- రాజేష్ కుమార్ పులిపాటి
సికింద్రాబాద్- సంతోష్‌కుమార్
కొడంగల్‌- రేవంత్ రెడ్డి 
గద్వాల్‌- సరితా తిరుపతయ్య
అలంపూర్- సంపత్ కుమార్
నాగర్‌కర్నూల్- రాజేశ్‌ రెడ్డి
అచ్చంపేట- చిక్కుడు వంశీ కృష్ణ
కల్వకుర్తి- కాసిరెడ్డి నారాయణ రెడ్డి 
షాద్‌నగర్‌- శంకరయ్య
కొల్లంపూర్- జూపల్లి కృష్ణారావు
నాగార్జున సాగర్- జయవీర్‌ 
హుజూర్‌నగర్‌- ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి
కోదాడ- పద్మావతి రెడ్డి 
నల్గొండ- కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నక్రేకల్‌- వీరేశ్
ఆలేరు- ఐలయ్య
ఘనపూర్- ఇందిరా 
నర్సంపేట- మాధవ్‌ రెడ్డి
భూపాల్‌పల్లి-సత్యనారాయణ రావు
ములుగు-సీతక్క
మధిర- భట్టి విక్రమార్క 
భద్రాచలం- వీరయ్య 


Telangana Congress MLA List 2023:




కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో భాగంగా శుక్రవారం జీఆర్జీ రోడ్ నెంబర్15లోని ‘వార్ రూమ్’లో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ నాలుగో సారి భేటీ అయింది. మధ్యాహ్నం12 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 నిమిషాల వరకు ఈ భేటి సాగింది. ఈ భేటీలో ప్రధానంగా119 స్థానాల్లో అభ్యర్థల ఎంపికపై చర్చ జరిగినట్లు తెలిసింది. సీనియర్ నేతలు బరిలో ఉన్న స్థానాలు, ఒక అసెంబ్లీకి ఒకరు లేదా ఇద్దరు పోటీ పడుతున్న స్థానాలు, ఎలాంటి వివాదాలు లేని 55 స్థానాలపై మొదటి రెండు మీటింగ్ లో కమిటీ క్లారిటీకి వచ్చింది. 


మీటింగ్ అనంతరం కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలపై స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను ఆదివారం విడుదల చేస్తున్నట్టు తెలిపారు. 70 మంది పేర్లతో ఫస్ట్ లిస్ట్ విడుదల చేస్తామని ప్రకటించారు కానీ దాన్ని 55కే కుదించారు. అక్టోబర్ 18న పార్టీ బస్సుయాత్ర ప్రారంభమయ్యేలోపు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. సీపీఐ, సీపీఎంలతో పొత్తు చర్చలు కొనసాగుతున్నాయని.. త్వరలోనే స్పష్టత వస్తుందని భావిస్తున్నామని మురళీధరన్‌ స్పష్టం చేశారు. అందుకే ప్రస్తుతానికి 55 మంది పేర్లతో తొలి జాబితా విడుదల చేశారు.