Jagan  derogatory comments on Sharmila :  వైఎస్ షర్మిల పసుపు చీర కట్టుకుని చంద్రబాబు ఇంటికి వెళ్లిందని పులివెందులలో వైఎస్ జగన్ చేసిన విమర్శలపై .. టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తోడబుట్టిన చెల్లెలి పుట్టుక పైనా... మహాలక్ష్మీగా భావించే ఇంటి ఆడబిడ్డ కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఒక ముఖ్యమంత్రా?  అని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో స్పందించారు. ఎంత నీచం! ఇది కాదా వికృత మనస్తత్వం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


 





 
పులివెందులలో నామినేషన్ వేసిన సమయంలో జగన్ బహిరంగభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా షర్మిలపై మండిపడ్డారు. ఆమెపై విమర్శలు చేస్తున్న సమయంలో షర్మిల పసుపు చీర కట్టుకుని చంద్రబాబు ఇంటికి వెళ్లిందని అన్నారు. తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించడానికి చంద్రబాబు ఇంటికి షర్మిల వెళ్లారు. అప్పుడు ఆమె ధరించిన చీర గురించే జగన్ కామెంట్స్ చేశారు. 


నారా లోకేష్ కూడా జగన్ వ్యాఖ్యలను తప్పు పట్టారు. 


 





  


పులివెందుల జగన్ ప్రసంగంలో షర్మిలను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. పసుపు చీర కట్టుకుని వాళ్ల కుట్రలో భాగమైన వీళ్లా వైఎ‍స్సార్‌ వారసులు అని మండిపడ్డారు.  అవినాష్‌ ఏ తప్పు చేయలేదని తాను నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చానన్నారు.  అవినాష్‌ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.  ఈ మధ్య కాలంలో కొత్తగా వైఎస్సార్‌ వారసులమని కొందరు ప్రజల మందుకు వస్తున్నారని అది వారి కుట్రలో భాగమన్నారు.  "వైఎస్సార్‌ కుటుంబాన్ని టార్గెట్‌ చేసింది ఎవరు? నాన్నపై కక్షతో, కుట్రతో ఆయనపై కేసులు పెట్టింది ఎవరు?. ఆ కుట్రలు చేసిన పార్టీలో చేరిన వాళ్లు.. వైఎస్సార్‌ వారసులా?  వైఎస్‌కు వారసులు ఎవరిని చెప్పాల్సింది ప్రజలేనన్నారు. 


జగన్మోహన్ రెడ్డి పులివెందుల ప్రసంగం ఒఒక్క సారిగా హాట్ టాపిక్ గామారింది. ఓ వైపు ఇద్దరు చెల్లెళ్లే వైఎస్ వివేకా హత్య వెనుక అవినాష్ రెడ్డి ఉన్నారని గట్టిగా ఆరోపిస్తున్నారు. సాక్ష్యాలు చూపించి మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓ వైపు వైసీపీ నేత కోర్టుకు వెళ్లడంతో మాట్లాడకుండా గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ పై కోర్టుకు వెళ్లారు. ఇలాంటి సమయంలో అవినాష్ రెడ్డికి సీఎం జగన్ పూర్తి మద్దతు ప్రకటించడమే కాకుండా.. షర్మిల కట్టుకున్న చీరను బట్టి ఆమె టీడీపీతో కలిసి కుట్రలు చేస్తుందన్నట్లుగా మాట్లాటటం చర్చనీయాంశమవుతోంది .             


వైఎస్ అవినాష్ రెడ్డి, షర్మిల మధ్య కడప లోక్ సభలో పోటీ జరుగుతోంది. తమకు న్యాయం చేయాలని షర్మిల కొంగు పట్టుకుని అడుగుతున్నారు. ఈ క్రమంలో షర్మిల చీరపై జగన్ చేసిన విమర్శలు వైరల్ అవుతున్నాయి. ఓ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నేత.. ఏ మహిళ పట్ల అలా మాట్లాడకూడదని.. సొంత చెల్లిపై అలా మాట్లాడటం ఇంకా దుర్మర్గమన్న అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి.