Chandrababu  first reaction on winning :  ఆంధ్రప్రదేశ్ గెలిచిందని టీడీపీ అధినేత చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిచారని సోషల్ మీడియాలో స్పదించారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ఆశీస్సులు అందించినందుకు ప్రజలందరికి కృతజ్ఞతలు తెలిపారు. అందరం కలిసి గెలిచామని.. అందరం కలిసి అభివృద్ది చేస్తామన్నారు.  ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. 


ఏపీ భవిష్యత్ కోసం ఎంతో కమిట్ మెంట్ తో ఉన్న  పవన్ కల్యాణ్‌, జనసేన పార్టీ, పురందేశ్వరి అందరికీ అభినందనలు తెలిపారు. కార్యకర్తల శ్రమతోనే ఇంత భారీ విజయం సాధ్యమయిందని  తెలిపారు.  అనేక ఇబ్బందులు ఎదుర్కొని.. తమ ఓటును వినియోగించుకున్నారన్నారు. అందరికీ శుభాభినదనలు తెలిపారు.,                              


 





 
అంతకు ముందు కూటమి విజయంపై అభినందనలు తెలుపుతూ..  ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ట్వీట్‌కు కూడా చంద్రబాబు రిప్లై ఇచ్చారు.  లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున తాను శుభాకాంక్షలు చెబుతున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓ గొప్ప చారిత్రకమైన నిర్ణయం వెలువరించారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలతో కలిసి ఏపీని పునర్‌నియమిస్తామన్నారు.                                                          


 





 


చంద్రబాబు, పవన్ బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఎన్డీఏ సమావేశంలో పాల్గొంటారు.  కేంద్ర, రాష్ట్రాల్లో  ప్రభుత్వాల ఏర్పాటు అంశంపై చర్చలు జరుపుతారు.