Kurnool District MLA Candidates 2024: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల 2024 ఫలితాల్లో కర్నూలు జిల్లాలో తొడగొట్టిన టీడీపీ - రెండు స్థానాలే దక్కించుకున్న వైసీపీ

AP Assembly Election Results 2024:కర్నూలు జిల్లాలో టీడీపీ నాలుగు స్థానాల్లో, వైసీపీ రెండు స్థానాల్లో బీజేపీ ఒక్క స్థానంలో విజయం సాధించాయి. మంత్రాలయం, ఆలూరులో వైసీపీ గట్టెక్కింది.

Continues below advertisement

Kurnool District MLA Candidates Winner List 2024:  కర్నూలు జిల్లాలో  టీడీపీకి తిరుగులేని మెజార్టీని కట్టబెట్టారు ప్రజలు. ఏడు నియోజకవర్గాల్లో నాలుగింటిలో టీడీపీ విజయం సాధించింది. ఈ జిల్లాలో కూడా వైసీపీ కేవలం రెండు స్థానాలకే పరిమితం అయింది. ఇక్కడ బీజేపీ ఖాతా తెరిచింది. ఆధోనీలో పార్థసారథి విజయం సాధించారు. 

Continues below advertisement

నియోజకవర్గం 

విజేత

 పార్టీ 

కోడుమూరు

బొగ్గుల దస్తగిరి 

టీడీపీ

ఆలూరు

బి. విరూపాక్షి 

వైసీపీ

ఎమ్మిగనూరు

జయనాగేశ్వర రెడ్డి 

టీడీపీ

ఆధోని

పీవీ పార్థసారధి 

బీజేపీ

కర్నూలు

టీజీ భరత్‌ 

టీడీపీ 

పత్తికొండ

కేఈ శ్యాంబాబు 

టీడీపీ 

మంత్రాలయం

వై. బాలనాగిరెడ్డి 

వైసీపీ 

 

కర్నూలు జిల్లా

రాజకీయంగా అత్యంత కీలకమైన జిల్లా కర్నూలు. ఈ జిల్లాలో మెజార్టీ స్థానాలు గెల్చుకున్న జిల్లాకు రాయలసీమ ప్రాంతంలో మెజార్టీ లభిస్తూ వస్తోండి. తొలి నుంచి ఈ జిల్లా కాంగ్రెస్‌ పార్టీకి కీలకంగా ఉండగా, టీడీపీ ఆవిర్భావం తరువాత జరిగిన అనేక ఎన్నికల్లో ఆ పార్టీకి ఇక్కడ మెజార్టీ స్థానాలు లభించాయి. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావం తరువాత ఈ జిల్లాకు బలమైన జిల్లాగా ఉంటూ వస్తోంది. గడిచిన రెండు ఎన్నికల్లోనూ ఇక్కడ అత్యధిక స్థానాలను వైసీపీ గెల్చుకుంది. ఇరు పార్టీలకు ఈ జిల్లాలో బలమైన నాయకులు, కేడర్‌ ఉండడంతో తాజా సార్వత్రిక ఎన్నికల్లో పోటీ గట్టిగా సాగింది. కూటమికి జనసేన కలవడంతో ఈ జిల్లాలోని అనేక నియోకజవర్గాల్లో పోటీ హోరాహోరీగా సాగింది. అనేక నియోకజవర్గాల్లో స్వల్ప ఓట్ల మెజార్టీతోనే ఏ పార్టీ అభ్యర్థి అయినా విజయం సాధించే అవకాశముందన్న విశ్లేషనలు వినిపిస్తున్నాయి. 2009లో జరిగిన ఎన్నికల్లో ఈ జిల్లాలోని నాలుగు స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా, మూడు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించారు. విభజన తరువాత 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో ఇక్కడ మెజార్టీ స్థానాలను వైసీపీ దక్కించుకుంది. రెండు స్థానాల్లో టీడీపీ విజయాన్ని నమోదు చేయగా, ఐదు స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఏడు స్థానాల్లోనూ విజయం సాధించి జిల్లాను క్లీన్‌స్వీప్‌ చేసింది. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఎమ్మిగనూరు స్థానం నుంచి వైసీపీ విజయం సాధించింది. తాజాగా సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ మెజార్టీ సీట్లు దక్కించుకుంటుందన్నది తేలాల్సి ఉంది. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో స్వల్పంగా పెరిగిన ఓటింగ్‌ శాతం కూడా కీలక నియోజకవర్గాల్లో విజయాలపై ప్రభావం చూపించనుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 75.46 శాతం ఓటింగ్‌ నమోదు కాగా, తాజా సార్వత్రిక ఎన్నికల్లో 76.80 శాతం ఓటింగ్‌ నమోదైంది. 

కర్నూలు జిల్లా

 

2009

2014

2019

కోడుమూరు

కాంగ్రెస్

వైసీపీ

వైసీపీ

ఆలూరు

కాంగ్రెస్

వైసీపీ

వైసీపీ

ఎమ్మిగనూరు

కాంగ్రెస్

వైసీపీ

వైసీపీ

ఆధోని

టీడీపీ

వైసీపీ

వైసీపీ

కర్నూలు

కాంగ్రెస్

వైసీపీ

వైసీపీ

పత్తికొండ

టీడీపీ

టీడీపీ

వైసీపీ

మంత్రాలయం

టీడీపీ

వైసీపీ

వైసీపీ

 

 

Continues below advertisement