Nandyala Constituency MLA Winner List 2024: నంద్యాల జిల్లాను టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. దాదాపు అన్ని ప్రాంతాల్లో టీడీపీ అభ్యర్థులు భారీ మెజార్టీలు సాధించారు. ఇక్కడ పోటీ చేసిన మంత్రులు కూడా అడ్రెస్‌ లేకుండా పోయారు. కనీసం పోటీ ఇవ్వలేకపోయారు. 

నియోజకవరగం  

విజేత  

 పార్టీ

నందికొట్కూరు

గిత్తా జయసూర్య

టీడీపీ

శ్రీశైలం


బుడ్డా రాజశేఖర్‌రెడ్డి 

టీడీపీ

పాణ్యం


గౌరు చరితా రెడ్డి

టీడీపీ

డోన్‌

కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి

టీడీపీ

ఆళ్లగడ్ల


భూమా అఖిలప్రియ 

టీడీపీ

బనగానపల్లి

బీసీ జనార్దన్‌ రెడ్డి 

టీడీపీ

నంద్యాల

ఎన్‌ఎండీ ఫరూక్‌

టీడీపీ

నంద్యాల జిల్లా

రాయలసీమ ప్రాంతంలోని మరో జిల్లా నంద్యాల. ఈ జిల్లా ఇటు టీడీపీ కూటమికి, అటు అధికార వైసీపీకి ఎంతో కీలకమనది. ఈ జి ల్లా తొలి నుంచి కాంగ్రెస్‌ పార్టీకి అండగా ఉండగా, తెలుగుదేశం ఏర్పాటైన తరువాత ఇక్కడి ప్రజలు ఆ పార్టీని ఆదరిస్తూ వచ్చారు. 2009లో జరిగిన ఎన్నికల్లో ఈ జిల్లాలోని ఏడు స్థానాల్లో రెండు చోట్ల ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థులు కూడా విజయం సాధించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావం తరువాత జరిగిన రెండు పూర్తి స్థాయి ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను ఆ పార్టీయే గెల్చుకుంది. 2009లో కాంగ్రెస్‌ పార్టీ నాలుగు స్థానాల్లో విజయం సాధించగా, ప్రజారాజ్యం రెండు స్థానాల్లో, టీడీపీ ఒక స్థానంలో విజయం సాధించింది. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఒకే ఒక్క స్థానాన్ని ఇక్కడ గెల్చుకుంది. మిగిలిన ఆరు స్థానాల్లోనూ వైసీపీ అభ్యర్థులే విజయం సాధించగా, 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఏడు స్థానాలనూ గెల్చుకుని అధికారాన్ని కైవశం చేసుకుంది. 2012, 2014లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థులు విజయం సాధించగా, 2017లో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. 20149లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 81.19 శాతం ఓటింగ్‌ నమోదు కాగా, తాజా ఎన్నికల్లో పోలింగ్‌ శాతం స్వల్పంగా తగ్గింది. ఈ ఎన్నికల్లో 80.61 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గడిచిన ఎన్నికలతో పోలిస్తే తాజా ఎన్నికల్లో కూటమి బలంగా కనిపించిందని, మెజార్టీ స్థానాలను దక్కించుకుంటామన్న ధీమాలో టీడీపీ నాయకులు ఉన్నారు. గత ఎన్నికలు మాదిరిగానే క్లీన్‌ స్వీప్‌ చేస్తామని వైసీపీ నాయకులు చెబుతున్నారు.      

 

2009

2014

2019

నందికొట్కూరు

కాంగ్రెస్

వైసీపీ

వైసీపీ

శ్రీశైలం

కాంగ్రెస్

వైసీపీ

వైసీపీ

పాణ్యం

కాంగ్రెస్

వైసీపీ

వైసీపీ

డోన్‌

టీడీపీ

వైసీపీ

వైసీపీ

ఆళ్లగడ్ల

ప్రజారాజ్యం 

వైసీపీ

వైసీపీ

బనగానపల్లి

ప్రజారాజ్యం 

టీడీపీ

వైసీపీ

నంద్యాల

కాంగ్రెస్

వైసీపీ

వైసీపీ