Munugodu RO :  మునుగోడు ఉప ఎన్నిక నూతన ఆర్వోగా మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్ కు కేంద్ర ఎన్నికల కమిషన్ బాధ్యతలు అప్పగించింది. ఇప్పటి వరకూ ఉన్న జగన్నాథ రావు ను తప్పించి  రోహిత్ సింగ్ ను నియమించారు.  ఉప ఎన్నికలో రోడ్డు రోలర్ గుర్తును నిబంధనలకు విరుద్ధంగా జగన్నాథరావును మార్చారు. యుగతులసీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న శివకుమార్ కు  రోడ్డు రోలర్ గుర్తును మొదట కేటాయించారు. తరవాత మార్చి  బేబీవాకర్‌ను కేటాయించారు. దీనిపై శివకుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో తిరిగి రోడ్డు రోలర్ గుర్తును శివకుమార్‌కు కేటాయించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సీఈసీ ఆదేశించింది.  


రోడ్డు రోలర్ గుర్తు కేటాయించి మళ్లీ మార్చిన జగన్నాథరావు


సీఈసీ ఆదేశాలతో శివకుమార్ కు మళ్లీ రోడ్డు రోలర్ గుర్తు కేటాయిస్తూ గెజిట్ విడుదల చేయాలని ఆదేశించింది. గుర్తులు ఎందుకు మార్చారో రిటర్నింగ్ అధికారిని వివరణ ఇవ్వాలని ఈసీని ఆదేశించింది. వివరణ ఇవ్వక ముందే ఆయనను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. యుగతులసీ పార్టీ గుర్తింపు పొందిన పార్టీ కాదు.. రిజిస్టర్డ్ పార్టీ మాత్రమే. గుర్తుల కేటాయింపుల్లో భాగంగా శివకుమార్కు రోడ్డు రోలర్ గుర్తు కేటాయించారు. ఒక సారి కేటాయింపులు చేసిన తర్వాత మార్చడానికి అవకాశం లేదు. కానీ ఆర్వో జగన్నాథరావు ఈ అంశంలో చొరవ తీసుకున్నారు. లేని అధికారంతో గుర్తుల్ని మార్చేశారు. ఇది ఆయన బదిలీకి కారణం అయింది. 


శివకుమార్ ఫిర్యాదు చేయడంతో సీఈసీ సీరియస్ 


నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించి రోడ్డు రోలర్ గుర్తును తొలగించిన రిటర్నింగ్ ఆఫీసర్ ను కేంద్ర ఎన్నికల కమిషన్ బదిలీ చేయడం సరైన పద్ధతి కాదని టీఆర్ఎస్ మండిపడింది. 2011లో తొలగించిన రోడ్డు రోలర్ గుర్తును మళ్లీ ఎలా కేటాయిస్తారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్, మంత్రి కేటీఆర్ ఎలక్షన్ కమిషన్ ను ప్రశ్నించారు. ఇది పూర్తిగా వ్యవస్థను దుర్వినియోగం చేయడమేనన్నారు.  తమ పార్టీ కారు గుర్తును పోలిన గుర్తులతో అయోమయానికి గురిచేసి దొడ్డిదారిన ఓట్లు పొందే కుటిల ప్రయత్నాన్ని బీజేపీ చేస్తుందని  విమర్శించారు. 






మునుగోడులో హోరాహోరీ పోరు 


మునుగోడులో  బీజేపీ, టీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీల మధ్య  హోారాహోరీ పోరు నడుస్తోంది.  టీఆర్ఎస్ తెలంగాణలో ఉన్న అధికార పార్టీ ,  బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది. ఈ రెండు పార్టీల పోరాటంతో  అధికారులకు విధి నిర్వహణ కూడా సవాల్‌గా మారింది.