YSRCP News: మంచి జరిగిందనే జగన్‌ తరఫున ప్రచారం: వైసీపీ స్టార్ క్యాంపెయినర్‌లు

Sheershika Updated at: 11 May 2024 09:44 AM (IST)

Andhra Pradesh News: 12 మందితో మొదలైన స్టార్‌ క్యాంపెయినర్ జాబితా ఇప్పుడు 79 లక్షలకు చేరుకుందని వైసీపీ ప్రకటించింది. ఐదేళ్లలో ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందుకున్న వారంతా ప్రచారం చేస్తున్నారు.

లబ్ధి జరిగిందనే జగన్‌ తరఫున ప్రచారం: వైసీపీ స్టార్ క్యాంపెయినర్‌లు

NEXT PREV

Andhra Pradesh Assembly Elections:  జగన్ పాలనలో ప్రతి గడపకు మంచి జరిగిందో లేదో తెలుసుకున్న తర్వాతే ఓటు వేయాలని వైసీపీ తరపున లబ్ధిదారులు ప్రచారం చేస్తున్నారు. గత పాలనకు ఇప్పుడు అమలు అవుతున్న సంక్షేమ పథకాలను బేరీజు వేసుకోవాలని పిలుపునిస్తున్నారు. వివిధ పథకాల లబ్ధిదారులు, వైసీపీ సానుభూతిపరులు సుమారు 79 లక్షల మంది ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు. పథకాలతో తాము లబ్ధి పొందామని మీరు లబ్ధి పొందుంటే కచ్చితంగా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.  


ప్రచారం ఆఖరి అంకానికి చేరుకున్న టైంలో ఈ స్టార్ క్యాంపెయినర్లతో వైసీపీ వీడియో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పోలింగ్ జరిగే వరకు అనుసరించాల్సిన వ్యూహాలను వారితో చర్చించారు. ప్రత్యర్థులు చేస్తున్న దుష్ప్రచారాన్ని అడ్డుకుంటూనే వారి వస్తే జరిగే పరిణామాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.  ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు ప్రచారకర్తలు... చంద్రబాబుతోపాటు కూటమి నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. 


"జగన్ పాలనలో రాష్ర్టంలోని ప్రతి గడపకు మంచి జరిగింది. ఈ మంచి మరికొంత కాలం కొనసాగాలన్నదే మా ఉద్దేశం." అని స్టార్ క్యాంపెయినర్లు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. ఐదేళ్లపాటు క్రమం తప్పకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం గొంతు పిసికేసేందుకు చంద్రబాబు అండ్ టీమ్‌ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆరు పథకాల నగదు ప్రజలకు అందకుండా కుట్ర చేశారని ధ్వజమెత్తారు. ఈ చర్యలను పేద ప్రజలు క్షమించబోరని శాపనార్థాలు పెట్టారు. 


తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం అనంతరం పథకాల లబ్ధిదారులు, వైసీపీ తరఫున ప్రచారం చేస్తున్న స్టార్ క్యాంపెయినర్లు మీడియాతో మాట్లారు. "నవరత్నాల పేరుతో చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా ప్రభుత్వం పేదలకు ఆర్థిక భరోసా ఇచ్చింది.  క్రమం తప్పకుండా అందుతున్న ఆర్థిక భరోసాను చంద్రబాబు అడ్డుకున్నారు. చంద్రబాబు వల్ల రాష్ట్రంలోని ప్రతి వర్గం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థులు ఫీజులు కట్టలేకపోతున్నారు. రైతులు పంటలు వేసుకోలేకపోతున్నారు."



చేసిన సాయం జగనన్నకు గుర్తుండకపోవచ్చు కానీ సాయం అందుకున్న మాకు లైఫ్‌ లాంగ్‌ గుర్తు ఉంటుంది. ఆరోగ్య శ్రీ కింద మా కుటుంబంలో ప్రాణాలు కాపాడుకున్నాం. ఆసరా లాంటి పథకాలతో  చిన్న వ్యాపారాలు చేసుకొని ఉపాధి పొందుతున్నాం. అమ్మఒడి లాంటి పథకాలతో పిల్లలను చదివించుకుంటున్నాం. ఈ ఐదేళ్లలో  మా ఊరు మారింది, మా కుటుంబ స్థితిగతులు మారాయి. కులాలు, మతాలు, పార్టీలు, ప్రాంతాలు చూడకుండా సాయం అందిస్తా అన్న మాట జగన్ నిజం చేశారు. మా నియోజకవర్గంలో బీజేపీ నేతకు వైద్య సహాయం, ఆసుపత్రి బిల్లులు అందాయి. ఇలా అండగా నిలిచిన జగనన్నకు మేము అండగా నిలుస్తున్నాం."- జనార్దన్ రెడ్డి, తుగ్గలి, కర్నూలు జిల్లా




"జగన్‌కు మహిళలంతా సంపూర్ణ మద్ధతు ప్రకటిస్తున్నారు. డ్వాక్రా ఆప్పులు మాఫీ చేస్తామని 2014లో, పసుపు కుంకుమ నిధులు వేస్తామని 2019లో చంద్రబాబు మోసం చేశారు. ఇప్పుడేమో ఎన్నికల కమిషన్‌కు లేఖలు రాసి ఆర్థిక సాయం నిలిపేశారు. రైతులకు సాయం అందకుండా చేశారు. ఓటు వేయనివారిపై కక్ష కట్టారు. తనకు ఓటు వేయని వారికి కూడా సాయం చేసిన లీడర్‌ జగన్"- గంగు కళ్యాణి, శ్రీకాకుళం



"రాష్ట్రంలో ఉన్న 94 శాతం ఇళ్లకు ప్రభుత్వ లబ్ధి అందింది. ప్రతి ఇంటి గడపకూ ప్రభుత్వాన్ని తీసుకెళ్లారు. ఉన్న ఊళ్లోనే ప్రభుత్వ సేవలు ఒక్క రోజులోనే లభించేలా చేశారు. అందువల్లే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిజమైన పేదల ప్రభుత్వం. ప్రజలు ప్రభుత్వానికి వారథలుగా పని చేస్తున్న వలంటీర్ వ్యవస్థను ప్రతిపక్షాలు తప్పుపడితే కోవిడ్ లాంటి విపత్కర సమయాల్లో ప్రతి కుటుంబానికి సేవలు అందించారు. "- ఎ. అనంతలక్ష్మి, రాజమండ్రి సిటీ నియోజకవర్గం



" జగన్ పరిపాలన ఎంటో చెప్పేందుకు రాష్ర్టంలోని ప్రభుత్వ పాఠశాలే ఉదాహరణ. పేదల పిల్లలకు నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్య అందుతోంది. డిగ్రీ పూర్తి చేసి ఐదేళ్లే అయ్యింది. ఇప్పటి నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు చూస్తే తేడా అర్ధమవుతుంది. డిజిటల్ క్లాస్ రూంలు, ట్యాబ్‌లతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యను బోధిస్తున్నారు. మరో పదేళ్లలో ఈ ప్రభుత్వ పాఠశాలల నుంచి బయటికి వచ్చే వారితో రాష్ర్టం మరో ఎత్తుకు ఎదగనుంది. "- -అన్వర్, నెల్లూరు జిల్లా.



"ప్రతి ఇంటికి అందాల్సిన ప్రభుత్వ పథకాన్ని సీఎం జగన్ బాద్యతగా అందించారు. గతంలో ఎలా ఉండేది. నవరత్నాలతో ఆర్థిక భరోసా అందిన తరువాత ఎలా మారిందో నాకు స్పష్టం కనిపించింది. ఐదేళ్లలో నిజమైన అభివృద్ధి చూశా. మేం చదువుకునే రోజుల్లో ఇలాంటి ప్రభుత్వం ఉంటే మా జీవితాలు ఎంత బాగుపడేవో. రాష్ర్ట భవిష్యత్తును జగన్ మారుస్తున్న నాయకుడని నేను నమ్ముతున్నాను. ఒక తల్లిగా ఆలోచిస్తే మా పిల్లలకు అవసరమైన చదువులు, అవసరాలు అన్నీ పాఠశాలల్లో లభిస్తున్నాయి. - - ఈశ్వరి, కొండపల్లి, మైలవరం, ఎన్టీఆర్ జిల్లా



మాది సాధారణ రైతు కుటుంబం. నా పెద్ద కుమారుడు ఢిల్లీలోని మారుతీసుజీకీలో ఉద్యోగం చేసేవాడు. ఇప్పుడు అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో మాస్టర్స్ ఇన్ పొలిటికల్ అఫైర్స్‌లో సీటు సంపాదించారు. కోర్సు ఫీజుకు కావాల్సిన డబ్బు విదేశీ విద్య కింద మంజూరైంది. ఇప్పటికి రెండు దఫాలుగా రూ. 50 లక్షలు అందింది. విద్యకు ప్రాధాన్యత ఇస్తున్న జగన్ కోసం స్టార్ క్యాంపెయినర్‌గా పని చేయడానికి కారణం ఇదే. - - పండలనేని శివప్రసాద్, మోపిదేవి మండలం, అవనిగడ్డ నియోజకవర్గం, కృష్ణా జిల్లా



నేను ద్విచక్రవాహనాలకు సీట్ కవర్లు కుట్టే షాపు నిర్వహిస్తుంటా. రోజువారీ సంపాదన కుటుంబ పోషణకే సరిపోతుంది. నా కొడుకు ఫీజు రియింబర్స్‌మెంట్, వసతి దీవెన పథకాలతో బాగా చదువుకున్నాడు. రెండో కొడుకు డిగ్రీ చదువుతున్నాడు. మూడో బిడ్డకు అమ్మఒడి అందుతోంది. పెద్ద కొడుకు ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం సాధించాడు. సమాజంలో ఒక అడుగు ముందుకు వేసినట్లైంది. తన జీవితాన్ని మెరుగుపరిచిన జగన్ కోసం స్టార్ క్యాంపెయినర్‌గా పనిచేస్తున్నా. - - కటారి జగదీష్, మల్లవీధి, అనకాపల్లి


12 మందితో మొదలైన స్టార్‌ క్యాంపెయినర్ జాబితా ఇప్పుడు 79 లక్షలకు చేరుకుందని వైసీపీ ప్రకటించింది. ఐదేళ్లలో ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందుకున్న వారంతా వైసీపీ తరఫున ప్రచారం చేసేందుకు ముందుకు వస్తున్నారని పేర్కొంది. జగన్‌ కోసం సిద్ధం అని నినదిస్తూ ఇంటింటికీ వెళ్లి ఇప్పటి వరకు ఐదేళ్లలో జరిగిన లబ్ధిని వివరిస్తున్నారని తెలిపారు. కూటమి కుట్రలు భగ్నం చేసేందుకు ఈ సైన్యం జగన్‌కు అండగా నిలబడుతుందని తెలిపారు. ఇంకా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే 9612096120 నెంబర్ మిస్డ్ కాల్ ఇవ్వాలని పార్టీ ప్రకటించింది. ఇలా స్టార్ క్యాంపెయినర్‌గా నమోదైన ప్రతి ఒక్కరికి మెంబర్ ఐడీ కార్డు ఇస్తారు. 

Published at: 11 May 2024 09:43 AM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.