BCYP party Ramachandra Yadav : పుంగనూరుకు చెందిన  బోడె రామచంద్ర యాదవ్ కి ఏపీ రాజకీయవర్గాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. రామచంద్ర యాదవ్ ను మంత్రి పెద్దిరెడ్డి టార్గెట్ చేస్తూంటారు. ఈ క్రమంలో ఆయనకు రాష్ట్ర వ్యాప్త గుర్తింపు వచ్చింది. ఏం వ్యాపారం చేస్తారో ఎవరికీ తెలియదు కానీ.. ఆయన కోసం రాందేవ్ బాబా కూడా పుంగనూరు వచ్చారు. నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి వై సెక్యూరిటీని కూడా తెచ్చుకున్నారు. ఆయన ఏ పార్టీలోనూ చేరకుండా సొంత పార్టీ పెట్టుకున్నారు. 


బీసీవైపీ పేరుతో పార్టీ పెట్టుకున్న  రామచంద్ర యాదవ్             


రాష్ట్ర రాజకీయాలులో అనుకోని విధంగా చర్చలో నిలిచిన వ్యక్తి రామచంద్ర యాదవ్.  2019 ముందు వరకు వ్యాపారవేత్తగా ఉన్నారు. ఆ ఎన్నికల్లో పుంగనూరు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు.పుంగనూరులో కోట్ల రూపాయలతో నిర్మించిన ఇంటి గృహప్రవేశం 30 రోజులపాటు జరిపించారు. ప్రముఖులు ఎంతో మంది హాజరయ్యారు. ఈ ఒక్క ఘటనతో రామచంద్ర యాదవ్ పేరు మారుమోగింది.  గత ఐదు సంవత్సరాల వరకు తన సొంతూరికే  పరిమితమైన వ్యక్తి... 2019 ఎన్నికల్లో పోటీ చేసి నియోజకవర్గానికి పరిచయమయ్యారు. ఆ తరువాత జరిగిన పరిణామాలతో రాష్ట్ర స్థాయిలో చర్చనీయమైన వ్యక్తిగా మారారు ఆయన. ఆయన సొంతంగా పార్టీ పెట్టి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసేందుకు ముందుకు సాగుతున్నారు.  


మంగళగిరిలోనూ పోటీకి నిర్ణయం              


2024 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీ తరపున 32 మంది అభ్యర్ధులతో మొదటి విడత జాబితాను  కొద్ది రోజులకిందట  ప్రకటించారు.  పుంగనూరులో పెద్దిరెడ్డిని ఓడించాలని లక్ష్యంగా పెట్టుకున్ నఆయన ..  మంగళగిరి నుంచి కూడా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.  రాష్ట్ర రాజధాని రక్షణ, అక్కడ రైతులకు అండగా నిలిచేందుకు అధినేత ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నరాు.  రాన్స్‌జెండర్‌కు తొలిసారి ప్రాధాన్యత దక్కింది. ప్రజాసేవ పట్ల మక్కువ ఉన్న ట్రాన్స్‌ జెండర్లకు చట్టసభల్లో అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో తమన్నా సింహాద్రిని ఫిఠాపురం నియోజకవర్గ అభ్యర్ధిగా బీసీవై పార్టీ ప్రకటించింది. పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పోటీ చేస్తున్నారు.  


పెద్దిరెడ్డిని ఓడించేందుకు గట్టి ప్రయత్నం               


ఎలాగైన పుంగనూరు నుంచి విజయం సాధించాలని రామచంద్ర యాదవ్ పట్టుదలగా ఉన్నారు.  పుంగనూరులో కొన్ని సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయని వాటికి చెక్‌ పెడితే పుంగనూరులో విజయం పెద్ద విషయం కాదని భావిస్తున్నారు. అందుకే ఎన్నికల సంఘానికి విజ్ఞప్తులు చేసి  180కిపైగా పోలింగ్ బూతుల్లో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేసేలా ఆదేశాలు వచ్చేలా చేసుకున్నారు.   . ప్రతి నియోజకవర్గంలో పోలింగ్ సరళిని వీడియో రికార్డింగ్ చేస్తారు. సీసీ టీవీ రికార్డింగ్ చేస్తారు. కాని సమస్యాత్మక ప్రాంతాలు, వనరబుల్ ప్రాంతాల్లో మాత్రమే లైవ్ స్ర్టీమింగ్ నిర్వహిస్తారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాలతోపాటు లైవ్ స్ర్టీమింగ్ నిర్వహించే వాటిలో పుంగనూరు అధికంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.