Andhra Pradesh Postal Ballots : అలా ఉన్నా పోస్టల్ బ్యాలెట్స్ చెల్లుబాటు - ఏపీ సీఈవో కీలక నిర్ణయం

Andhra politics : రిటర్నింగ్ అధికారి సంతకం లేకపోయినా పోస్టల్ బ్యాలెట్స్ చెల్లుతాయని సీఈవో తెలిపారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేయాలని సీఈవోను టీడీపీ నేతలు కోరారు.

Continues below advertisement

Elections 2024 :  పోస్టల్ బ్యాలెట్ వెనుక రిటర్నింగ్ అధికారి సీల్, సంతకం లేని వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలని ఈసీని  టీడీపీ నేతలు కోరారు.   రాష్ట్ర సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఈ విజ్ఞప్తికి అంగీకరించారు. వీలైనంత త్వరగా లిఖిత పూర్వక ఉత్తర్వులు ఇవ్వాలని టీడీపీ నేతలు కోరారు. డిక్లరేషన్‍పై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేసిన సీల్ లేకపోయినా పరిగణలోకి తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. రిటర్నింగ్ అధికారి ఫాసిమెయిల్, గెజిటెడ్ ఆఫీసర్ సంతకం బాధ్యత ఎన్నికల కమిషన్‍దే అని చెబుతోంది.                         

Continues below advertisement

మొత్తం పోస్టల్ బ్యాలెట్స్ 5,39,189 ఓట్లు                                     
 
ఏపీలో రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి.  తాజా లెక్కలు ప్రకారం జిల్లాల నుంచి వచ్చినవి 5,39,189 ఓట్లుగా గుర్తించారు.  అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 38,865 ఓట్లు, తర్వాతి స్థానంలో నంద్యాల జిల్లాలో 25,283 ఓట్లు, మూడో స్థానంలో కడప జిల్లాలో 24,918 పోస్టల్ బ్యాలెట్లు, అత్యల్పంగా నరసాపురంలో 15,320 ఓట్లుగా లెక్క తేల్చారు. వీరంతా ఎన్నికల విధుల్లో పాల్గొన్న వారు..త సర్వీస్ ఓటర్లు.    

పోస్టల్ బ్యాలెట్స్ ను బట్టి కౌంటింగ్ టేబుళ్లు                                                                  

పోస్టల్ బ్యాలెట్స్ ను బట్టి టేబుల్స్ ఏర్పాటు చేస్తారు. ఒక్కో టేబుల్‍లో ఎన్ని పోస్టల్ బ్యాలెట్ ట్లు లెక్కించాలనే అంశంపై రిటర్నింగ్ అధికారులకు కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు పంపింది. పోస్టల్ బ్యాలెట్ల వినియోగంలో ఈ సారి ఉద్యోగులు ఎక్కువ ఆసక్తి చూపించారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో  2,95,003 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో 56,545 ఓట్లు చెల్లలేదు. పోలైన వాటిలో 2,38,458 ఓట్లు చెల్లుబాటయ్యాయి.                         

గత ఎన్నికల్లో  2,95,003 మంది   ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్లు                          

చెల్లుబాటైన ఓట్లలో వైసీపీకి 1,36,768 ఓట్లు ద‌క్కాయి. టీడీపీకి 81,608 ఓట్లు వచ్చాయి. జనసేనకు 11,326 ఓట్లు ల‌భించాయి. మిగిలిన 8,756 ఓట్లు వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కైవసం చేసుకున్నాయి. ఈ సారి రెండు లక్షలకుపైగా పోస్టల్ బ్యాలెట్లు పెరగడంతో ఎవరికి ప్లస్ .. ఎవరికి మైనస్ అన్న చర్చ  జరుగుతోంది. డిక్లరేషన్‍పై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేసిన సీల్ లేకపోయినా ఓట్లను పరిగణనలోకి తీసుకుంటామని ఈసీ చెప్పడంతో చెల్లని ఓట్లు కూడా  తగ్గే అవకాశాలు ఉన్నాయి.       

Continues below advertisement
Sponsored Links by Taboola