Andhra Politics Ambati Rambabu : రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారం కోసం చేసే వింత వింత ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎక్కువ మంది చేతుల్లో తమ పాంప్లెట్లు లేకపోతే.. తమ ప్రచార సామాగ్రి ఉండాలనుకుంటారు. సత్తెనపల్లి నుంచి మూడో సారి పోటీ చేస్తున్న అంబటి రాంబాబు రెండో సారి గెలిచేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన ప్రచారాన్ని వినూత్నంగా నిర్వహిస్తున్నారు. కొద్ది రోజుల కిందట పంచాలనుకుని సిద్ధం చేసిన చీరలు పెద్ద ఎత్తున ఎన్నికల అధికారులకు పట్టుబడటంతో ఆ పని చేయలేకపోయారు. ఇప్పుడు కొంత  వినూత్నంగా ఆలోచించారు. 


సత్తెనపల్లిలో టీ దుకాణాల వద్ద  సామాన్య జనం గుమికూడుతుంటారు కాబట్టి వారికి తెలిసేలా ప్రచారం చేయాలనుకున్నారు. ఆలోచించగా.. వారి చేతుల్లో ఉండే పేపర్ కప్పులతో ప్రచారం చేయాలనుకున్నారు. ఆర్డర్ ఇచ్చి వేల కప్పులు తయారు చేయించి.. టీ స్టాల్స్ అన్నింటికీ ఉచితంగా పంపిణీ చేశారు. ఈ పేపర్ కప్పులు కొనాలంటే.. టీ స్టాల్ యాజమాన్యాలకూ కొంత ఖర్చు అవుతుంది. ఊరకనే వస్తున్నాయి కదా అని ఆ టీ కప్పుల్లో నే వారు కస్టమర్లకు టీ పోసి ఇస్తున్నారు. వద్ద ఉంటే.. ఎమ్మెల్యేతో ఇబ్బందులు వస్తాయని ఎక్కువ మంది భావిస్తున్నారు. టీ స్టాల్స్ ఎక్కువగా రోడ్డు మీదనో.. రోడ్డును ఆకుకునే పెట్టుకుని ఉంటారు. అంబటి రాంబాబుతో సమస్యలు ఎందుకని.. వారంతా ఆయన పంపిణీ చేసిన టీ కప్పుల్లోనే టీ పోసి ఇస్తున్నారు.                                               


అంబటి రాంబాబు పంపిణీ  చేసిన టీ కప్పులపై జగన్ తో పాటు అంబటి రాంబాబు బొమ్మ.. వైసీపీ రంగులు..అలాగే ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు పేరుతో నినాదం ఉన్నాయి.  అయితే ఇప్పుడు ఏ టీ స్టార్ దగ్గర చూసినా డస్ట్  బిన్లలో, చెత్త కుప్పల్లో ఈ కప్పులే కనిపిస్తున్నాయి. ఈ ఫోటోలు.. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైసీపీని అప్పుడే చెత్తబుట్టలో పడేశారా అని సెటైర్లు వేస్తున్నారు. అంబటి రాంబాబు కోరుకున్నది ఒకటైతే జరుగుతున్న ప్రచారం మరొకటి. పోనీ కప్పుల పంపిణీ ఆపేద్దామా అంటే.. తర్వాత తర్వాత ఈసీ అడ్డుకుంటుందేమోనని.. నెల రోజులకు సరిపడా కప్పులు పంచేశారు. 


అయితే వ్రతం చెడటంతో పాటు ఇప్పుడు కేసుల పాలయ్యే ప్రమాదం కూడా కనిపిస్తోంది. ఎదైనా ఇలా ప్రచారం కోసం చేస్తే.. ఖచ్చితంగా ఈసీ అనుమతి  తీసుకోవాలి. ఎన్ని కప్పులు  తయారు చేయించారు.. ఎంత ఖర్చయిందో.. మ్యాన్యుఫ్యాక్చర్ ఎవరో టీ కప్పుల మీద  ప్రచురించాల్సి ఉంటుంది. కానీ ఆ టీ కప్పులపై అలాంటివేమీ లేకపోవడంతో ఇతర పార్టీల నేతలు.. ఈసీకి పిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈసీ చర్యలు తీసుకుంటే.. అంబటి రాంబాబుకు రెండు విధాలుగా నష్టపోయిన వారవుతారు.