Komatireddy Fire On KCR : బీఆర్‌ఎస్ పార్టీని మూడు నెలల్లో రాజకీయంగా బొందపెడుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ చేశారు.  బుధవారం నల్లగొండలో మంత్రి క్యాంపు కార్యాలయంలో వెంకట్ రెడ్డి మాట్లాడారు. కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తా అనడంతో… బచ్చాగాడు రాజకీయలు తెలియవని ఊరుకున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామనడం కేసీఆర్ మూర్ఖత్వానికి అర్థం వస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వీర సైనికులు తలుచుకుంటే బిఆర్‌ఎస్ పార్టీ పునాదులు లేకుండా చేస్తామని కోమటిరెడ్డి హెచ్చరించారు.                                                           


తాము తలుచుకుంటే 30 మంది బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు కాంగ్రెస్‌లో చేరుతారన్నారు. లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి 13 నుంచి 14 ఎంపి సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. బిఆర్‌ఎస్ ఒక్క సీటు కూడా రాదని ఎద్దేవా చేశారు. జూన్ 5 నుంచి పాలనపై దృష్టి పెడుతామని చెప్పారు. కెసిఆర్ పాస్ పోర్ట్ దొంగ అని, కష్టపడి సీఎం పదవి దక్కించుకున్న రేవంత్‌కు, నీకు పోలికా అని ప్రశ్నించారు.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముఖం చూపించలేక రెండు సార్లు అసెంబ్లీ సమావేశాలకు కెసిఆర్ రాలేదని, కూతురు తీహార్ జైల్లో ఉన్న కనీసం బెయిల్ తెచ్చుకునే ప్రయత్నంచేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లుడు హరీష్ రావు, కొడుకు కెటిఆర్ తీహార్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. 


యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ లో జగదీష్ రెడ్డి జైలుకు వెళ్తారంటూ కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ 15 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసారు.మేము గేట్లు తెరిస్తే బీఆర్‌ఎస్‌లో ఒక్కరు కూడా మిగలరు. మూడు నెలల్లో బీఆర్‌ఎస్‌ కనుమరుగవుతుంది. మెదక్‌లో వెయ్యి కోట్లు ఖర్చు చేసినా బీఆర్‌ఎస్‌ గెలవలేదు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ 14 స్థానాలు గెలుస్తుందన్నారు.  కవిత జైలుకు పోయాక కేసీఆర్ కు మెంటల్ వచ్చినట్లు ఉందని.. అందుకే, రేవంత్ బీజేపీలోకి పోతున్నారని అంటున్నాడని ఎద్దేవా చేశారు. రెండేళ్లైనా కవితకు బెయిల్ రాదని ఆయన అన్నారు.  కేసీఆర్ కట్టె పట్టుకొని వేటాడుతాం అంటున్నారని.. ఇకనుంచి తాము కూడా వెంటాడుతామని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.


కేసీఆర్‌ కూతురు అవినీతి చేసి తీహార్‌ జైలులో ఉన్నారు. బిడ్డ చేసిన పనికి కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌ రావు జైలుకు వెళ్తారు. యాదాద్రి పవర్ ప్లాంట్ అవినీతి విషయంలో జగదీష్ రెడ్డి జైలుకు పోతారు. జగదీష్‌ రెడ్డి వేల కోట్ల రూపాయాలు దోచుకున్నారు. శంషాబాద్‌లో ఫామ్‌ హౌస్‌ కూడా కొన్నాడు. జగదీష్‌ రెడ్డి అవినీతిని బయటకు తీస్తాం. నల్లగొండ, భువనగిరి లోక్‌సభ స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీలకు డిపాజిట్లు కూడా రావని స్పష్టం చేశారు.