ఏపీలో ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి సంబంధించిన వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ నవంబరు 8తో ముగియనుంది. నీట్ యూజీలో అర్హత సాధించిన విద్యార్థులు నవంబరు 8న సాయంత్రం 7 గంటల్లోగా తమ ఆప్షన్లను నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్ల నమోదుకోసం డాక్టర్ వైఎస్సార్ వైద్య విద్యాలయం ప్రత్యేక లింక్ ఏర్పాటు చేసింది. విద్యార్థులు ప్రాధాన్యత క్రమంలో ఒకేసారి ఆప్షన్‌లు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆప్షన్‌ల నమోదు విషయంలో విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలి. 


వెబ్ఆప్షన్ల నమోదు కోసం క్లిక్ చేయండి...



సీట్ల వివరాలు ఇలా..
రాష్ట్రంలో మొత్తం 30 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 11 ప్రభుత్వ, 16 ప్రైవేట్, రెండు మైనారిటీ, శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాలలు ఉన్నాయి. 11 ప్రభుత్వ కళాశాలల్లో 2,185 సీట్లు ఉన్నాయి. వీటిలో 325 సీట్లు ఆలిండియా కోటాలో భర్తీ అవుతాయి. మిగిలిన 1,860 సీట్లు రాష్ట్ర కోటాలో భర్తీ చేస్తారు. మరోవైపు 16 ప్రైవేట్, రెండు మైనార్టీ కళాశాలల్లో 3 వేల సీట్లు ఉన్నాయి. వీటిలో 1,500 సీట్లు కన్వీనర్‌ కోటాలో భర్తీ అవుతాయి. మిగిలిన సీట్లను బీ, సీ కేటగిరీల్లో భర్తీ చేస్తారు. మరోవైపు శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (స్విమ్స్‌)లో 175 సీట్లు ఉండగా 126 రాష్ట్ర కోటాలో, 26 ఆల్‌ ఇండియా కోటాలో, 23 ఎన్నారై కోటా కింద భర్తీ అవుతాయి. ఇలా మొత్తంగా ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేట్, మైనార్టీ, ఇతర కళాశాలల్లో మొత్తం 5,360 సీట్లు అందుబాటులో ఉన్నాయి.


వన్‌టైమ్‌ ఆప్షన్‌ విధానం..
ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి సంబంధించి తొలి దశ ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌లో భాగంగా ఆప్షన్‌ల నమోదుకు డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం అర్ధరాత్రి నోటిఫికేషన్‌ జారీ చేసింది. విద్యార్థులు మంగళవారం (నవంబర్‌ 8) రాత్రి ఏడు గంటల్లోగా ఆప్షన్‌లను నమోదు చేయాలి. ఒక్కసారి ఆప్షన్లు నమోదు చేస్తే చాలు.. వీటినే అన్ని విడతల కౌన్సెలింగ్‌కు పరిగణనలోకి తీసుకుంటారు. రీటెయిన్‌ విధానాన్ని ఈ ఏడాది విశ్వవిద్యాలయం అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రకారం.. విద్యార్థి తనకు ఇష్టమైన కళాశాలలో తొలి దశలోనే సీటు వస్తే.. ఆ సీటుకే పరిమితం అవుతానని అంగీకారం తెలపొచ్చు. ఇలాంటి విద్యార్థులను తర్వాతి కౌన్సెలింగ్‌లకు పరిగణనలోకి తీసుకోరు.


విద్యార్థుల మొగ్గు విశాఖపట్నంలోని ఆంధ్రా వైద్య కళాశాల వైపే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాత స్థానాల్లో గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల, కాకినాడ రంగరాయ, కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాల ఉన్నాయి. గతేడాది ఆంధ్రా కళాశాలలో ఎస్టీ కేటగిరీలో 472 స్కోరుతో 1,10,270 ర్యాంక్‌ సాధించిన విద్యార్థికి చివరి సీటు వచ్చింది. ఇక ఎస్సీల్లో 79,876 ర్యాంక్, బీసీ కేటగిరీలో 32,693 ర్యాంక్, ఓసీల్లో 15,824 ర్యాంక్, ఈడబ్ల్యూఎస్‌లో 20,137 ర్యాంక్‌ తుది కటాఫ్‌ ర్యాంకులుగా నిలిచాయి.


ఆప్షన్ల నమోదులో జాగ్రత్త..
విద్యార్థులు ప్రాధాన్యత క్రమంలో ఒకేసారి ఆప్షన్‌లు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆప్షన్‌ల నమోదు విషయంలో విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలి. సీనియర్‌ల సలహాలు, సూచనలు తీసుకుంటే మంచిది. అన్ని సీట్లు భర్తీ అయ్యేంత వరకూ మాప్‌–అప్‌ రౌండ్‌ కౌన్సెలింగ్‌లు చేపడతాం. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఏమైనా సందేహాలు ఉంటే విశ్వవిద్యాలయం ఇచ్చిన ఫోన్‌ నంబర్లను సంప్రదించవచ్చని యూనివర్సిటీ వీసీ డాక్టర్‌ శ్యామ్‌ప్రసాద్ సూచించారు.


 


:: Also Read ::


TAFRC: ఇంజినీరింగ్ కాలేజీలకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌, అలాచేస్తే ఫైన్ కట్టాల్సిందే!!
ఇంజినీరింగ్‌ కాలేజీలను తెలంగాణ అడ్మిషన్స్‌ అండ్‌ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) హెచ్చరించింది. టీఏఎఫ్‌ఆర్‌సీ నిర్ణయించిన ఫీజుల కన్నా ఎక్కువ వసూలు చేస్తే జరిమానా తప్పదని స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చింది. జీవో నంబర్‌ 37 ప్రకారం అందులో సూచించిన ఫీజుల కన్నా ఎక్కువ వసూలు చేయకూడదని, ఏ ఇతర రూపాల్లోనూ డబ్బులు వసూలు చేయకూడదని కాలేజీలకు తేల్చి చెప్పింది. ఒకవేళ అదనంగా ఫీజు వసూలు చేస్తే రూ.2 లక్షల జరిమానా వేస్తామని స్పష్టం చేసింది. అది కూడా ఒక్కసారి కాకుండా ఎంతమంది విద్యార్థుల దగ్గర ఎక్కువ ఫీజు వసూలు చేస్తే అన్ని సార్లు రూ.2 లక్షలు కట్టించుకుంటామని ఆ కమిటీ పేర్కొంది. ఈ మేరకు శనివారం కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. అదనంగా తీసుకున్న ఫీజును విద్యార్థులకు తిరిగి చెల్లించాలని ఆదేశించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


'ఫ్యాషన్' కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు ప్రారంభం- చివరితేది ఎప్పుడంటే?
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ప్రవేశాలకు నిర్దేశించిన 'NIFT-2023' రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబరు 1న ప్రారంభమైంది. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబరు 31 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.3000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1500 చెల్లిస్తే సరిపోతుంది. 
నోటిఫికేషన్, కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..