రేపటి నుంచి ఏపీలో ఇంజినీరింగ్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం అవుతున్నాయి. కానీ ఈసెట్ రిజల్ట్స్ వచ్చి 45 రోజులు గడుస్తున్నా కౌన్సెలింగ్ లో అడుగు కూడా ముందుకు పడలేదని జగన్ విమర్శించారు. ఇంజినీరింగ్ రెండో ఏడాదిలో అడ్మిషన్లకోసం నిర్వహించిన ఏపీ ఈసెట్ లో 34వేల మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఎగ్జామ్ రాస్తే.. అందులో 31,922 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
మే 15వ తేదీన ఏపీ ఈసెట్ ఫలితాలు వెలువడినా నేటికి లేటరల్ ఎంట్రీ విద్యార్థులకు కౌన్సెలింగ్ ప్రక్రియపై షెడ్యూల్ విడుదల చేయలేదు. ఆ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో ఇంజనీరింగ్ లో చేరాలనుకునే పాలిటెక్నిక్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఏపీలో విద్యావ్యవస్థలో నెలకొన్న దారుణ పరిస్థితులకు ఈసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కాకపోవడమే నిదర్శనం అన్నారు. అమాత్యా మేలుకో.. పప్పూ నిద్ర వదులు అంటూ జగన్ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.