మన మోచేయి అకస్మాత్తుగా దేనితోనైనా ఢీకొన్నప్పుడు, ఆ సమయంలో తీవ్రమైన నొప్పికి బదులుగా కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది. ఒక్కసారిగా జలదరింపు అనుభూతి కలుగుతుంది. చాలా మంది దీన్ని సరదాగా చేస్తూ కూడా ఎదుటి వారిని ఆట పట్టిస్తుంటారు. పిల్లలు, పెద్దలు అంతా ఏదో టైంలో దీన్ని ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్లే. కానీ దాని వెనుక ఉన్న కారణం ఏమిటి... ఇది మోచేయికి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? దెబ్బ తగిలిన తర్వాత శరీరంలోని అన్ని భాగాలు నొప్పిని కలిగిస్తాయి. మోచేయిలోని ఈ భాగం మాత్రం వింతైన అనుభూతిని ఇస్తుంది. దాని వెనుక ఉన్న ప్రత్యేక కారణం గురించి మనం ఇక్కడ చూద్దాం.
దెబ్బతగిలితే కరెంట్‌లా షాక్ కొట్టే మన మోచేయి వద్ద ఉన్న బోన్‌ను సాధారణ పరిభాషలో 'ఫన్నీ బోన్' అని పిలుస్తారు. దాన్ని వైద్య పరిభాషలో చెప్పాలంటే ఉల్నార్ నాడి అంటారు. ఈ నాడి మెడ (కాలర్ బోన్ ), భుజాలు, చేతుల ద్వారా మణికట్టు వరకు వెళుతుంది. తర్వాత డివైడ్ అయ్యి ఉంగరపు వేలు, చిటికెన వేలు వద్ద ముగుస్తుంది.
ఈ కారణంగానే షాక్ కొడుతుంది
ఈ ఫన్నీ బోన్ ప్రధాన విధి మెదడు నుంచి సందేశాలను శరీరంలోని మిగిలిన భాగాలకు తీసుకురావడం, తీసుకెళ్లడం. శరీరంలోని మొత్తం నాడీ వ్యవస్థ వలె, ఉల్నార్ నాడిలో ఎక్కువ భాగం ఎముకలు, మజ్జ కలిగి ఉంటుంది. మోచేయి ద్వారా వెళ్ళే ఈ బోన్ చర్మం, కొవ్వుతో మాత్రమే కవర్ చేసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మోచేయి దేనినైనా తాకినప్పుడు ఈ బోన్‌పై నేరుగా ప్రభావం పడుతుంది. అందుకే షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది. ఈ ఒత్తిడి అకస్మాత్తుగా నేరుగా బోన్‌పై పడినప్పుడు షాక్ కొట్టిట్టు అనిపించడంతోపాటు జలదరింపు అనుభూతి కలుగుతుంది.
దీనికి 'ఫన్నీ బోన్' అని ఎందుకు పేరు పెట్టారు
ఉల్నార్ నాడిని ఫన్నీ బోన్ అని పిలవడం వెనుక వైద్య శాస్త్రంలో రెండు ప్రత్యేక కారణాలు ఉన్నాయి. మొదటిది ఉల్నార్ నాడి మన చేతి ఎముక గుండా వెళుతుంది. దీనిని వైద్య పరిభాషలో హ్యూమర్స్ అని అంటారు. హ్యూమర్స్ అనే పదం హ్యూమరస్ (సరదా) ను పోలి ఉంటుంది. ఈ సారూప్యత కారణంగా దీనికి ఫన్నీ బోన్ అనే పేరు వచ్చిందని కొందరు నమ్ముతారు. ఇది కాకుండా, కొంతమంది ఇక్కడ గాయపడినప్పుడు ఎక్కువ నవ్వు వస్తుందని నమ్ముతారు. కాబట్టి దీనిని ఫన్నీ బోన్ అని పిలుస్తారు.