వరంగల్ కాకతీయ యూనివర్సిటీ (కేయూ) ఆధ్వర్యంలోని 'స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ (SDLCE) డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిని సెమిస్టర్ల ప్రకారం దూర విద్య విధానంలో నిర్వహిస్తామని తెలిపింది. ఆన్‌లైన్ సెషన్స్ ద్వారా విద్యా బోధన ఉంటుందని పేర్కొంది. ధృవ పత్రాల పరిశీలన ద్వారా ప్రవేశాలు కల్పిస్తామని చెప్పింది. పీజీ కోర్సులను గరిష్టంగా ఆరేళ్లలో, డిగ్రీ కోర్సులను తొమ్మిదేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుందని వెల్లడించింది.
ఈ కోర్సులకు ఎలాంటి వయోపరిమితి నిబంధనలు లేవు. అర్హత, ఆసక్తి ఉన్న వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ గడువు అక్టోబరు 11తో ముగియనుంది. పూర్తి వివరాల కోసం వర్సిటీ వెబ్‌సైట్ http://www.sdlceku.co.in/ను సంప్రదించవచ్చు.
డిగ్రీ కోర్సులు ఇవే..
- డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ కోర్సులు ఉన్నాయి. ఒక్కో కోర్సు వ్యవధి మూడేళ్లుగా ఉంది. వీటిలో మొత్తం 6 సెమిస్టర్లు ఉంటాయి.
- బీఎస్సీ కోర్సుకు మాథ్స్/ స్టాటిస్టిక్స్/కంప్యూటర్స్ ఒక సబ్జెక్టుగా ఇంటర్ / 12వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. మిగతా కోర్సులకు ఏ గ్రూప్ వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
- బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ప్రోగ్రామ్ వ్యవధి ఏడాదిగా ఉంది. ఇందులో 2 సెమిస్టర్లు ఉంటాయి. డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు దీనికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
- బీకాం (కంప్యూటర్స్), బీబీఏ, బీఎల్‌ఐఎస్సీ కోర్సులను ఇంగ్లిష్ మీడియంలో మాత్రమే అభ్యసించాలి. మిగతా కోర్సులకు తెలుగు/ ఇంగ్లిష్ మీడియాలను ఎంచుకోవచ్చు.
బీఏ గ్రూప్‌లు: హెచ్‌పీపీ, ఈపీపీ, ఎస్‌పీపీ
బీకాం గ్రూప్‌లు: జనరల్, కంప్యూటర్స్
బీఎస్సీ సబ్జెక్ట్‌లు: మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్
పీజీ కోర్సుల వివరాలు..
- పీజీలో ఎంఏ, ఎంఎస్సీ, ఎంకాం, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంటీఎం వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో కోర్సు వ్యవధి రెండేళ్లుగా ఉంది. ఇందులో 4 సెమిస్టర్లు ఉంటాయి.
- ఎంఎస్సీకి దరఖాస్తు చేసుకునే వారు స్పెషలైజేషన్‌ను అనుసరించి సైన్స్ డిగ్రీ/ బీఏ(మ్యాథ్స్)/ బీఎస్సీ(ఎంపీసీ) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మిగతా కోర్సులకు ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి.
- ఎంఏ లాంగ్వేజెస్‌లో ప్రవేశానికి అభ్యర్థులు ఎంచుకున్న సంబంధిత భాష ఒక సబ్జెక్ట్‌గా డిగ్రీ చదివి ఉండాలి. మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ వ్యవధి ఏడాదిగా ఉంది. ఇందులో 2 సెమిస్టర్లు ఉంటాయి. బీఎల్‌ఐఎస్సీ ఉత్తీర్ణత సాధించిన వారు దీనికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
- మాస్టర్ ఆఫ్ జర్నలిజం వ్యవధి ఏడాదిగా ఉంది. ఇందులో 4 సెమిస్టర్లు ఉంటాయి. బీసీజే అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంఏ స్పెషలైజేషన్లు: తెలుగు, ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, హిస్టరీ, రూరల్ డెవల్‌పమెంట్, సోషియాలజీ, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్.
ఎంఎస్సీ స్పెషలైజేషన్లు: మ్యాథ్స్, సైకాలజీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్