Vulture Bee: తేనె గురించి చాలా మందికి తెలియని ఓ వింత ఇప్పుడు చెప్పబోతున్నాం. మీరు సాధారణంగా పువ్వుల నుంచి తేనెను సేకరించి తయారైన తేనె గురించి మాత్రమే విని ఉంటారు. ఇక్కడ మనం చెప్పుకునే రాబందు తేనెటీగలు మాత్రం కుళ్లిన మాంసం నుంచి హనీని తయారు చేస్తాయి. ఈ రాబందు తేనెటీగలలు చాలా భిన్నంగా ఉంటాయి. మనం రెగ్యులర్‌గా చూసే తేనెటీగలతో పోల్చుకుంటే వాటి జీవనశైలి, ఆహారపు అలవాట్లు పూర్తిగా తేడా. అవి మాంసాన్ని ఆహారంగా మార్చుకుంటాయి. వాటి తేనెగా మార్చుకుంటాయి.

Continues below advertisement

కుళ్లిన మాంసం నుంచి తేనె తీసే తేనెటీగలు

రాబందు తేనెటీగలు కుళ్లిన మాంసాన్ని ఆహారంగా తీసుకుంటాయి. ఆ మాంసాన్ని శరీరంలోని ప్రత్యేక ఎంజైమ్‌లతో కలుపుకొని తిరికి వాంతి చేస్తాయి. ఈ వాంతి తేనెగా మారుతుంది. ఇది వినడానికి అసహ్యంగా ఉన్నా సరే కఠోరమైన వాస్తవం. రుచి, వాసన కూడా తేడాగానే ఉంటుంది. ఈ మాంసం తేనె నుంచి రుచిని ఆశించలేం. వాసన కూడా దారుణంగా ఉంటుంది.కానీ ఇందులో కావాల్సినంత ప్రొటీన్ ఉంటుంది. మనం సాధారణంగా తీనే తేనెలో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ రాబందు తేనెటీగులు తయారు చేసిన తేనెలో మాత్రం ప్రొటీన్ పుష్కలంగా లభిస్తుంది.

పోషకాలు పుష్కలంగా ఉంటాయని ప్రచారం

రుచిలోను వాసనలో కూడా బాగోకపోయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఈ మాంసం తేనెను తింటూ ఉంటారు. ఇందులో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయని అందుకే ఆహారంగా తీసుకుంటామని చెబుతుంటారు. మధ్య, దక్షిణ అమెరికా ఉష్ణమండల అడవుల్లో అంటే కోస్టారికా, పనామా, బ్రెజిల్‌లోని కొన్ని ప్రాంతాల్లో వీటిని తింటూ ఉంటారు. ముఖ్యంగా పిల్లలకు తినిపిస్తారు. ఇందులో ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుందని చెబుతున్నారు. విటమిన్ B12 కూడా దొరుకుతుందని అంటున్నారు. ఐరన్ అండ్‌ జింక్‌ కూడా తేనెలో లభిస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.       

Continues below advertisement

సాధారణ తేనెటీగలతో పోలిస్తే చాలా తేడా

వల్చర్ బీ ఆహారపు అలవాట్ల గురించి శాస్త్రవేత్తలు 1980లో గుర్తించారు. 8-22 మిల్లీ మీటర్ల పొడవు కలిగి ఉంటాయి. కొంచెం ఎర్రగా కనిపిస్తాయి. పువ్వుల నుంచి తేనెను సేకరించేందుకు సాధారణ తేనెటీగల కాళ్లకు కాస్కెట్‌లు ఉంటాయి. కుట్టడానికి స్ట్రింగ్ ఉంటుది. కానీ రాబందు తేనెటీగలకు మాత్రం మాంసాన్ని సేకరించేందుకు గోళ్లు మాదిరిగా ఉంటాయి. స్ట్రింగ్స్‌ కూడా ఉండవు. వాటి బదులు ఎవరైనా దాడి చేస్తే ప్రతిగా కాటు వేయడానికి పళ్ల వంటి నిర్మాణం ఉంటుంది. ఇవి సాధారణంగా చచ్చిన జంతువుల నుంచి మాంసాన్ని సేకరిస్తుంది. అలా ఎక్కడైనా ఆహారాన్ని గుర్తిస్తే తమ జాతి ఈగలను పిలించేందుకు ఫిరోమోన్‌లను వదులుతుంది. వాటి ఆధారంగానే మిగతా ఈగలు వచ్చి ఆహారాన్ని తింటాయి.

రాబందు తేనెటీగలతో ప్రకృతికి చాలా ఉపయోగం కలుగుతోంది. చనిపోయిన కళేబరాలను ఈ తేనెటీగలు తినేస్తుండటంతో కాలుష్యానికి అవకాశం లేదు. ఇది మనుషులకు ఎంతో మేలు జరుగుతుంది. మాంసం తిని తయారు చేసే తేనె రుచికరంగా లేకపోయినా ప్రమాదకరం కాదని కొన్న పరిశోధనల్లో తేలింది. అందుకే దీన్ని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు తింటున్నారు.