Nindu Manasulu Serial Today Episode సిద్ధూకి సారీ చెప్పడానికి ప్రేరణ సిద్ధూ గదికి వెళ్లి కాఫీ అడుగుతుంది. అప్పుడే సిద్ధూ తల్లి, చెల్లి ఇంటికి వస్తారు. సాహితి ప్రేరణని గుర్తు పట్టి మంజులతో అన్నయ్య ఫ్రెండ్ ప్రేరణ ఆరోజు చెప్పా కదా అని పరిచయం చేస్తుంది. ప్రేరణ నమస్కారం పెడుతుంది.
సిద్ధూ ప్రేరణకి కాఫీ తీసుకొస్తూ తల్లి, చెల్లిని చూస్తాడు. వాళ్లని పలకరించి కూర్చొపెడతాడు. ప్రేరణకు కాఫీ ఇచ్చి తర్వాత సాహితికి మంజులకు తీసుకొస్తాడు. నా చేతితో అన్నం తినాల్సిన నువ్వు నీ చేతితో అమ్మకి కాఫీ ఇవ్వాల్సి వస్తుందని మంజుల సిద్ధూని అంటుంది. ఇక మంజుల కొడుకుతో కాఫీ షాప్ గురించి మాట్లాడుతుంది. నీ కాలి మీద నువ్వు నిలబడాలి అనుకుంటున్నావ్ నేను కాదు అనను కానీ మన స్థాయిని మర్చిపోయి కాఫీ షాపు మీద నిలబడాలి అనే ఆలోచన ఎందుకు రా అని అంటుంది. ఎప్పుడూ చెప్పే మాట చాలా చాలా పాత మాట కానీ అమ్మ ఒక్క మాట. ఆ మాట వినాల్సి రావడం కంటే నీ అసహనం వినాల్సి వస్తుంది అంటాడు.
అసహనం కాదురా నా ఆవేదని అని మంజుల అంటుంది. సిద్ధూ మాత్రం తను తన కాలి మీద నిలబడతా ఎవరి దగ్గర తల వంచను.. ఎవరి రికమండేషన్ అవసరం లేదు అని అంటాడు. మమల్ని అర్థం చేసుకోవడం లేదు ఏంట్రా అని మంజుల అంటుంది. కాఫీ షాప్‌కి బ్యాంక్ మెట్లు ఎక్కడం ఏంట్రా.. నేను లేనా మీ నాన్న లేరా అని అంటుంది. దానికి సిద్ధూ నా వ్యక్తత్వం కోసం బ్యాంక్ మెట్లు కాదు గుడి మెట్లు ఎక్కి అడుక్కోవడానికి సిద్ధమై అని అంటాడు. ప్రేరణ తల్లీ కొడుకుల మాటల వింతగా చూస్తుంది.
మంజుల కొడుకుతో నేను నీకు సాయం చేస్తా అని చెప్పి చెక్ ఇస్తుంది. నువ్వు ఇచ్చే డబ్బు చేసే సాయం రెండూ తీసుకోలేను అని అంటాడు. కన్న తల్లి దగ్గర సాయం తీసుకోవడం కూడా నీకు అవమానమా అని మంజుల అడుగుతుంది. డబ్బు సాయం కూడా రికమండేషన్ లెక్కే అని ఎవరి సాయంతోనూ ఎదగడం నాకు ఇష్టం లేదు అని సిద్ధూ అంటాడు. నాకు రికమండేషన్ ఇష్టం ఉండదు అని అతనికి తెలిసి కూడా నా కోసం సాయం చేస్తా అంటూ బ్యాంక్‌కి రికమండేషన్ చేశాడు.. అతని మాటలు నమ్మి నువ్వు సాయం చేయడానికి వచ్చావ్.. ఇలాంటి సాయం నన్ను ఎలా తీసుకోమంటావ్ అమ్మా నన్ను నేను చంపేసుకోవాలా అని సిద్ధూ అంటాడు. ఇందులో కూడా తప్పులు వెతుకుతావా అని మంజు అంటే వెతుకుతాడు మంజు అంటూ విజయానంద్ ఎంట్రీ ఇస్తాడు.
విజయానంద్ వచ్చి వీడు మనం ఏం చేసినా తప్పు వెతుకుతాడు. కానీ మన ప్రేమ వెతకలేడు.. మనకి వాడి మీద ఉన్న మమకారం చూడలేకపోతున్నాడు.. నాన్న సిద్ధూ ఇంకా ఎన్నాళ్లురా ఈ నాన్నని శత్రువులా చూస్తావ్.. ఎప్పుడురా నాన్నని దగ్గరకు తీసుకుంటావ్ అని విజయానంద్ అంటాడు. టాప్ బిజినెస్ మెన్ విజయానంద్ సిద్ధూ తండ్రా అని ప్రేరణ షాక్ అయిపోతుంది. రికమండేషన్ నాకు నచ్చదు అని ప్రతీ సారి రికమండ్ చేస్తూ ఆయన నన్ను అవమానిస్తున్నాడని సిద్ధూ అంటాడు. ఇప్పుడు కూడా ఆయనే నిన్ను పంపాడని నన్ను రికమండేషన్ చేయించి ఇబ్బంది పెడుతున్నాడని.. తల్లి ప్రేమని కూడా ఇలా వాడుకుంటున్నాడు.. తన సాయం లేకుండా నేనేం చేయలేను అన్నాడు అందుకే ఇదంతా చేస్తున్నాడు అమ్మా అని సిద్ధూ అంటాడు.
మంజుల చాలా ఏడుస్తుంది. ఇంక నేను నీకు ఏం చెప్పలేను అని అంటుంది. సిద్ధూ తల్లితో ఇలా ఏడ్వొద్దు అమ్మ నేను, ప్రేరణ కాఫీ షాప్ పెడతాం ఎవరి సాయం మాకు వద్దు.. అని అంటాడు. నువ్వు మమల్ని అర్థం చేసుకోలేవురా అని మంజుల వెళ్లిపోతుంది. వెనకాలే సాహితి వెళ్తుంది. విజయానంద్ నవ్వడంతో సిద్ధూ కోపంగా చూస్తాడు. మా అమ్మ ఉన్నంత వరకే నీకు నా ముందు నిల్చొనే అర్హత ఉంది అది తెలుసు కదా అని సిద్ధూ అనగానే విజయానంద్ ఏడుస్తున్నట్లు నటించి వెళ్లిపోతాడు.
సిద్ధూ మేడ మీద ఆలోచిస్తుంటే ప్రేరణ కాఫీ తీసుకెళ్లి ఇస్తుంది. ఇన్ని షాకులు, సర్జఫ్రైజ్‌లు ఇంత గొడవ జరిగిన తర్వాత కాఫీ తాగకపోతే పోవడం పక్కా అని అంటుంది. నేను అయితే ఇంత జరిగినందుకు కోమాలోకి వెళ్లిపోవాలి అని అంటుంది. నిజంగా ఈ రోజు తెలిసింది మనం చూసినవన్నీ నిజం కాదు అని.. అంత పెద్ద బిజినెస్మెన్ కొడుకు అయి ఇన్ని రోజులు ఇంత సింపుల్‌గా ఎలా ఉన్నావ్,, నాతో ఎలా ఇంత సింపుల్‌గా తిరిగావ్.. నువ్వు గ్రేట్ ఎంత డబ్బు ఉన్నా నీ కాళ్ల మీద నువ్వు బతకాలి అనుకోవడం.. కోట్లు ఉన్నా బతకడానికి బైక్ నడుపుకోవడం..గ్రేట్ కానీ నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా నిజానికి నేను సారీ చెప్పడానికి వచ్చానని అంటుంది. సారీ చెప్తుంది.
ఇక సిద్ధూతో నువ్వు ఎందుకు మీ నాన్నతో మాట్లాడటం లేదు.. నీకు మీ నాన్నకి మధ్య ప్రాబ్లమ్ ఏంటి. ఎందుకు ఆయన మీద అంత కోపం అని అడుగుతుంది. ఆయన గురించి మాట్లాడే ఇష్టం లేదు..ఆయన గురించి ఆలోచించే టైం లేదు.. మనుషుల కంటే మనీకి విలువ ఇచ్చే వారి గురించి అవసరం లేదు అంటాడు. దానికి ప్రేరణ నీ బాధ అర్థం చేసుకోగలను.. తండ్రీ కొడుకుల మధ్య ఎన్ని అయినా ఉండొచ్చు కానీ నువ్వేంటి తండ్రిని ఆయన అంటున్నావ్.. నాన్న అని కూడా పలకలేనంత ఏముంటుంది అని అడుగుతుంది. ఆయన్ని ఇంకో పిలుపుతో పలకలేను.. ఆయన నా తండ్రి కాదు.. నా అమ్మకి భర్త మాత్రమే అని సిద్ధూ అంటాడు. ప్రేరణ షాక్ అయిపోతుంది. ఇక ప్రేరణకు ఐశ్వర్య ద్వారా తన తల్లి ఉదయం బయటకు వెళ్లి సాయంత్రం వస్తుందని తెలుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.