Nuvvunte Naa Jathaga Serial Today Episode బతుకమ్మ పనుల్లో బిజీగా ఉన్న దేవా దగ్గరకు మిథున వచ్చి పెళ్లాన్ని కూడా పట్టించుకో అని కంకణం కట్టమని అంటుంది. నిన్ను ఎప్పటికప్పుడు వదిలించుకోవాలని అని నేను అనుకుంటే నువ్వేంటి పెళ్లాం.. మొగుడు అని చంపుతున్నావ్ అని అంటాడు. దానికి మిథున ప్రేమ అంటే అదే మొగుడ్స్ అంటుంది. 

Continues below advertisement

దేవా ఇరిటేట్ అవుతూ నేను ఎప్పుడు పోతానో గ్యారెంట్ లేని లైఫ్ నాది మిథున.. నా కోసం నీ జీవితాన్ని నీ టైంని వేస్ట్ చేసుకోకు అని అంటాడు. ఇది వేస్ట్‌ కాదు ఎదురు చూపు.. అని మిథున అంటుంది. అబ్బా నీకు చెప్పలేను మిథున ఏం చేస్తే నువ్వు నన్ను వదిలేస్తావో నాకు అర్థం కావడం లేదు అని దేవా అంటాడు. దానికి మిథున నా ప్రాణం పోతే తప్ప నేను నిన్ను వదలను అని అంటుంది. దేవా ఏం చేయలేక వెళ్లిపోతుంటే.. అక్కడికి బ్రహ్మముడి కావ్య వస్తుంది. ఏంటి దేవా చిన్న కంకణం కట్టడానికి అంతలా మిథునని బాధ పెట్టాలా అని అంటుంది. తన పర్మిషన్ లేకుండా తాళి కట్టేశావ్ ఇప్పుడు కంకణం కట్టలేవా అని కావ్య దగ్గరుండి దేవాతో కంకణం కట్టిస్తుంది. 

శారద, త్రిపుర, మిథున, కాంతం అందరూ అమ్మవారిని దండం పెట్టుకుంటారు. మిథున మనసులో అమ్మ ఆయన ఇంకా నాన్నకి ఇచ్చిన మాటకే కట్టుబడి ఉన్నారు.. ఆ మాట కోసం మనసులో నా మీద ఉన్న ప్రేమ చంపేస్తున్నారు.. దేవా మనసులో నేను ఉన్నానని నన్ను భార్యగా అంగీకరిస్తున్నారని అందరికీ తెలిసేలా చేయమని కోరుకుంటుంది. ఇక కంకణాన్ని అమ్మవారికి ఇచ్చి పూజ చేయమని ఆ  మహిళ ఇస్తుంటే అది కిందపడిపోతుంటే మిథున పట్టుకుంటుంది. మా ఫ్యామిలీకి అరిష్టం జరగకుండా చూశావ్ నువ్వే ఆ కంకణం అమ్మవారి పాదాల దగ్గర పెట్టు అని చెప్తుంది. మిథున పెడుతుంది. ఇక కాంతం తన మనిషితో ఆ కంకణం దొంగతనం చేయమని సైగ చేస్తుంది. 

Continues below advertisement

మిథున, కావ్య, సింధూర, ఆనంది బతకమ్మ ఆడటానికి వెళ్తారు. అందరూ సరదాగా బతుకమ్మ ఆడుతారు. ఇంతలో కంకణం పెట్టిన దంపతులు కంకణం కనిపించడం లేదని కంగారు పడి అందరితో చెప్తారు. అందరూ అక్కడికి వెళ్తారు. అమ్మవారి దగ్గర పెట్టిన కంకణం ఎవరూ తీయరు వెతకండి అని లలిత అంటుంది. ఇంతలో కంకణం తీసిన ఆమె మిథున కంకణం తీసిందని అంటుంది. దేవా కూడా అక్కడికి వస్తాడు. కావ్య కోపంగా ఆపమ్మా ఏం మాట్లాడుతున్నావ్ ఎవరి గురించి మాట్లాడుతున్నావ్.. అలాంటి కంకణాలు వంద అయినా ఫ్రీగా ఇవ్వగలదు అని కావ్య, ఆనంది, సింధూర అంటారు. బంగారం మీద ఎవరికైనా ఆశ ఉంటుందని అంటారు. 

మిథున దొంగతనం చేసిందని ఆవిడ కూడా నమ్ముతుంది. పెద్ద దొంగవని అర్థమైంది.. ఇలా చేయడానికి నీకు సిగ్గులేదా అని అరుస్తుంది. దేవా కోపంతో ఆపండి.. నా భార్యని దొంగ అంటే ఊరుకోను అని అంటాడు. తన గురించి నీకేం తెలుసు.. కోట్ల ఆస్తి  వదిలేసి కూటికి కూడా గతిలేని ఇంటికి వచ్చింది.. ఆ కుటుంబం ఇళ్లు పోగొట్టుకునే స్థితిలో ఉంటే పది లక్షలు తీసుకొని వచ్చి సాయం చేసింది.. అలాంటిది ఆఫ్ట్రాల్ కంకణం తీస్తుందా అని దేవా అంటాడు. అయితే నీ భార్య దొంగతనం చేయలేదు అని అసలు దొంగని పట్టుకొని నిరూపించు అని ఆమె భర్త అంటాడు. నిరూపిస్తా అని దేవా అంటాడు. అందరూ కంకణం కోసం వెతుకుతారు. 

ఇంతలో అమ్మవారే ఓ పాప రూపంలో వస్తుంది. దొంగతనం చేసి పట్టుకెళ్లిపోతున్న కాంతం మనిషిని ఆమె ఢీ కొడుతుంది. కంకణం కిందపడిపోతుంది. ఇంతలో దేవా చూస్తాడు. ఆమెని అందరి ముందుకి తీసుకెళ్తాడు. కావ్య ఒక్కటిస్తుంది. కాంతం తన పేరు బయటకు వస్తుందని భయపడుతుంది. మిథునకు సాయం చేయడం మాత్రమే తెలుసు.. దొంగతనం చేయడం తెలీదు.. నా భార్య నిజాయితీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే అస్సలు బాగోదు అని చెప్పి దేవా వెళ్లిపోతాడు. 

దేవా ఓ చోట బాధ పడుతుంటే భాను అక్కడికి వెళ్తుంది. ఇప్పటికైనా నిజం చెప్పు నీ గుండెల్లో ప్రేమ బయట పెట్టు అంటుంది. అలా ఏం లేదు విసిగించకుండా వెళ్లు అని దేవా అంటే భాను తన తల మీద దేవా చేయి పెట్టి నిజం చెప్పమని మిథునని ప్రేమిస్తున్నావా లేదా అని అడుగుతుంది. అయినా దేవా చెప్పకుండా మాట మార్చేసి భానుని కసిరేసి పంపేస్తాడు. నా మీద ఇంత ప్రేమ ఎందుకు మిథున నీకు అని అనుకుంటాడు. నిన్ను బాధ పెట్టలేకపోతున్నా.. నీ ప్రేమకి నేను అర్హుడినే కాదో తెలీదు కానీ నువ్వుంటే నాకు చచ్చేంత ప్రేమ మిథున.. ఈ మాట నీ ముందు అరిచి చెప్పాలని ఉంది.. కానీ ఎవరికీ చెప్పుకోలని అరుస్తాడు. పురుషోత్తం చాటుగా విని షాక్ అయిపోతాడు. ఇదేం ట్విస్ట్‌రా.. ఎంత బలవంతుడితోనైనా పెట్టుకోవచ్చు కానీ ప్రేమతో పెట్టుకోకూడదు.. వీడి వల్ల నా రాజ్యం కూలిపోనివ్వను అని పురుషోత్తం అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.