Illu Illalu Pillalu Serial Today Episode ప్రేమ పార్టీలో ఫుల్లుగా తాగేస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత వల్లీకి చుక్కలు చూపిస్తుంది. చిన్న పిల్లలా వల్లీ చంక ఎక్కిపోతుంది. తర్వాత డ్యాన్స్ చేయమని.. ఢీ సినిమాలో బ్రహ్మానందం సునీల్‌లో మేకులు మీద డ్యాన్స్ చేయించినట్లు వల్లీతో గాజు పెంకుల మీద డ్యాన్స్ చేయిస్తుంది. వల్లీ తిప్పలు పడుతూ డ్యాన్స్ చేస్తుంది. ఇక నా వల్ల కాదు బాబోయ్ అని పారిపోతుంది. 

Continues below advertisement


వల్లీ ఉదయం కాలు పట్టుకొని ఆరుబయట కూనిరాగాలు తీస్తూ ప్రేమని తిట్టుకుంటూ ఉంటుంది. ఏమైందని నర్మద అడిగితే కాలికి గాజు పెంకులు గుజ్జుకున్నాయని ఏడుస్తుంది. నర్మద చూసి ఏమైంది నువ్వు ఎక్కడా ఒక చోట ఉండవు కదా ప్రతీ దానిలో కాలు పెట్టేస్తావ్ కదా అంటుంది. నేనేం కావాలి అని చేయలేదు.. ఇలా గాజుపెంకులు గుచ్చుకోవడం వెనక చాలా పగ ఉంది తెలిసా అని ఏడుస్తుంది. ప్రేమకి నిద్రలో ధీరజ్‌ని ముద్దు పెట్టుకోవడం గుర్తొచ్చి ఉలిక్కి పడి లేస్తుంది. కళ్లు మూసినా తెరిచినా అదే గుర్తొస్తుంది. లైట్ ఆఫ్ అయిన వరకు గుర్తుంది తర్వాత ఏమైంది అని అనుకుంటుంది. ఇంతలో ధీరజ్ వస్తాడు.


ప్రేమని చూసి అమ్మా చంద్రముఖి లేచావా రాత్రి నాకు చంద్రముఖి, అపరిచితుడు కలిపి చూపించేశావ్ తల్లీ అని అంటాడు. తాగింది దిగింది కానీ ఇంకో మత్తు ఎక్కేసిందని ప్రేమ అంటుంది. ఏంటి అని ధీరజ్ అడిగితే ఐశ్వర్య గురించి చెప్తుంది. ఇక ధీరజ్ షర్ట్ తీసుకొని ఇది బాగుందా అంటే వెళ్లి నీ ఐషూని అడుగు అని అంటుంది. ఐరెన్ చేయమని ధీరజ్ అడిగితే నీ తిప్పులాడి ఐశ్వర్యని అడుగు తిప్పుకుంటూ చేస్తుంది. ఇంటర్‌లోనే లవ్‌స్టోరీ.. అబ్బబ్బా ఐషూ అంట నన్ను ఎప్పుడైనా అలా పిలిచావా.. ఈడో మజ్ను అదో లైలా నేను పిచ్చిదాన్ని.. వెర్రిదాన్ని అని మూతి తిప్పుకుంటూ వెళ్లిపోతుంది. ధీరజ్ ఓరి దేవుడా ఏదో ఉడికిద్దాం అనుకొని అలా చేశా కానీ ఇది ఉడికిపోవడం కాదు ఏకంగా మండిపోతుందని అనుకుంటాడు.


వల్లీ నర్మదకు ప్రేమ తనతో ఆడుకున్న విషయం చెప్తే బాగా అయిందని అనుకుంటుందని విషయం చెప్పకూడదు అని అనుకుంటుంది. మీ అమ్మా వాళ్లని రమ్మని చెప్పాను వస్తారా అని అడుగుతుంది. చెప్పాను వస్తారోరారో నాకు తెలీదు అని వల్లీ అంటే వాళ్లు రాకపోతే నువ్వు పర్మినెంట్‌గా మీ పుట్టింట్లో ఉంటావ్ అని నర్మద అంటుంది. వల్లి భయపడుతూ ఒక వైపు ప్రేమ మరోవైపు నర్మద ఇద్దరూ ముందు ముందు నాకు ఇంకెన్ని చుక్కలు చూపిస్తారో అని అనుకుంటుంది. 


భాగ్యం, ఆనంద్‌రావు రామరాజు ఇంటికి వెళ్తారు. నర్మద చూసి వెళ్లండి అని సైగ చేస్తుంది. రామరాజు పంచాయితీ మొదలవుతుంది. మా పెద్దోడి దగ్గర మీరు ఎందుకు డబ్బులు తీసుకున్నారు.. వాడు జీతం మొత్తం నాకే ఇస్తాడు.. వాడు నాకు చెప్పకుండా మీకు డబ్బు ఇచ్చాడు అంటే.. ఇప్పటికీ ఆ విషయం నాకు చెప్పలేదు అంటే దీని వెనక ఏదో గూడు పుటానీ జరిగింది అని అర్థమైంది.. మీకు డబ్బు కావాలి అంటే నాకు అడగాలి.. కానీ మా పెద్దోడి దగ్గర ఎందుకు తీసుకున్నారు అని అడుగుతాడు. మేం తీసుకోలేదు అల్లుడు గారే ఇచ్చారని భాగ్యం అనేస్తుంది. 



చందు అలా చేయడు అని రామరాజు అంటే మేం మా కష్టం కూతురికి చెప్పుకుంటే అల్లుడు విని కొడుకు అయినా అల్లుడు అయినా నేనే అని డబ్బు ఇచ్చాడని అంటుంది. రామరాజు చందు దగ్గరకు వెళ్లి వాళ్లు చెప్పేది నిజమా.. నాకు నమ్మాలి అనిపించడం లేదు.. నువ్వు నాకు చెప్పకుండా డబ్బు ఇవ్వవు అని అంటాడు. చందు ఏం మాట్లాడకుండా భార్య ముఖం చూస్తాడు. ఏం జరిగిందో చెప్పరా లక్ష ఇచ్చావా ఇంకా ఎక్కువ ఇచ్చావా అని రామరాజు అడుగుతాడు. 


చందు నిజం చెప్పబోతుంటే ఆనంద్‌రావు హార్ట్‌ అటాక్ వచ్చినట్లు నాటకం ఆడుతాడు. హాస్పిటల్‌కి తీసుకెళ్తామని భాగ్యం తీసుకెళ్లిపోతుంది. ఆటోని పిలిపించి ధీరజ్ వాళ్లు దగ్గరుండి పంపిస్తారు. భాగ్యం రామరాజుకి దండం పెట్టి మీ కొడుకు ఇస్తే తీసుకున్నాం ఈ విషయం ఇక్కడితో వదిలేయండి అని వెళ్లిపోతుంది. భలే తప్పించుకున్నాం అని ఆనంద్ రావు, భాగ్యం చాలా సరదా పడిపోతారు. ఇంతలో ఆటోకి ఎదురుగా నర్మద వస్తుంది. ఇద్దరూ షాక్ అయిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.