UPSC Results at upsc.gov.in: దేశంలో అత్యున్నత సర్వీసులు యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు వచ్చేశాయ్. సివిల్ సర్వీసులు 2020 తుది ఫలితాలు శుక్రవారం సాయంత్రం విడుదలయ్యాయి. మొత్తంగా 761 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఇతర కేంద్ర సర్వీసులకు ఎంపిక చేసినట్టు యూపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది.


యూపీఎస్సీ సివిల్స్ 2020 తుది ఫలితాలలో శుభమ్ కుమార్‌కు టాప్ ర్యాంక్ లభించింది. ఐఐటీ బాంబే నుంచి ఆయన సివిల్ ఇంజనీరింగ్ పూర్తిచేశారు. తాజాగా విడుదలైన సివిల్స్ ఫలితాలలో ఫస్ట్ ర్యాంకు సాధించారు. జాగ్రతి అవస్తికి ఓవరాల్‌గా రెండో ర్యాంక్ కాగా, మహిళలలో ఆల్ ఇండియాలో అగ్రస్థానంలో నిలిచారు. ఆమె మనిత్ భోపాల్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లో బీటెక్ పూర్తి చేశారు.


Also Read: తెలంగాణ ఎడ్ సెట్ ఫలితాలు విడుదల... ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి..






వీరిలో 545 మంది పురుషులు, 216 మంది మహిళలు ఉన్నారు. 263 మంది జనరల్‌, 229 మంది ఓబీసీ, 122 మంది ఎస్సీ, 86 మంది ఈడబ్ల్యూఎస్‌ కేటగిరి అభ్యర్థులు అర్హత సాధించారు. సివిల్స్‌లో శుభం కుమార్‌ మొదటి ర్యాంకు, జాగ్రతి అవస్తికి రెండో ర్యాంకు, అంకితా జైన్‌ మూడో ర్యాంకు సాధించారు.




సివిల్ సర్వీసెస్‌లో తెలుగు అభ్యర్థులు సత్తా చాటారు. నలుగురు అభ్యర్థులు 100లోపు ర్యాంకులు సాధించారు. తెలుగు అభ్యర్థులలో పి.శ్రీజ 20వ ర్యాంకు, మైత్రేయి నాయుడు 27వ ర్యాంకు, రవికుమార్‌ 84వ ర్యాంకు, యశ్వంత్‌ కుమార్‌రెడ్డి 93వ ర్యాంకులు సాధించి టాప్ 100లో నిలిచారు. 2015 సివిల్స్‌ టాపర్‌ టీనా దాబి సోదరి రియా దాబి తాజా ఫలితాలలో 15వ ర్యాంకు సాధించారు.


Also Read: చరిత్ర అంటే ఇష్టమా? ఇది కూడా బెస్ట్ కెరీర్ ఆప్షనే.. మీకేం కావాలో ఎంచుకోండి.. 




బాలలత, ర్యాంకర్ శ్రీజ







 


బాలలత మేడమ్ అకాడమీకి ర్యాంకుల పంట..


సివిల్స్ 2020  ఫలితాలలో హైదరాబాద్‌లోని బాలలత మేడమ్ ఆధ్వర్యంలోని సిఎస్‌బి సివిల్స్ అకాడమీ ర్యాంకుల పంట పండించింది. ఇప్పటివరకూ అందిన సమాచారం మేరకు ఈ అకాడమీకి 20, 616, 682, 686, 747 ర్యాంకులు దక్కాయి. యూపీఎస్సీ తాజాగా విడుదల చేసిన యూపీఎస్సీ ఫలితాలలో టాప్ 25 జాబితాలో 13 మంది అబ్బాయిలు కాగా, 12 మంది అమ్మాయిలు ర్యాంకులు సాధించారు. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి