OU UCE: ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో బీఈ, బీటెక్‌ కోర్సులు - ప్రవేశం ఇలా

OU USE Admissions: ఉస్మానియా యూనివర్సిటీలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ లేటరల్ ఎంట్రీ ద్వారా ఇంజినీరింగ్ రెండో ఏడాదిలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

Continues below advertisement

OU University College of Engineering: హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలోని 'యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (UCE)', కంటిన్యూయింగ్ ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (CEEP)లో భాగంగా 2024-2025 విద్యాసంవత్సరానికిగాను బీఈ, బీటెక్‌ ప్రోగ్రామ్‌లో రెండో ఏడాదిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 90 సీట్లలో ప్రవేశాలు కల్పించనున్నారు. వర్కింగ్ ప్రొఫెషనల్స్‌ కోసం ఈ కోర్సులను ప్రత్యేకించారు.

Continues below advertisement

సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు ఏదైనా సంస్థలో పనిచేస్తున్న తదితర రంగాల్లో ఏడాది పని అనుభవం ఉన్నవారు అర్హులు. ప్రవేశ పరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నారు. సరైన అర్హతలున్నవారు జులై 11లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్ష ఆధారంగా సీట్లను భర్తీచేయనున్నారు. రూ.1500 ఆలస్య రుసుముతో జులై 18 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అభ్యర్థులకు జులై 21న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. రాతపరీక్షలో అర్హత సాధించినవారికి జులై 27న మొదటి విడత కౌన్సెలింగ్, ఆగస్టు 3న రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.

వివరాలు..

* బీఈ, బీటెక్‌ (సీఈఈపీ) ప్రోగ్రామ్‌- డిప్లొమా లేటరల్ ఎంట్రీ ప్రవేశాలు

సీట్ల సంఖ్య: 90.

సబ్జెక్టులవారీగా సీట్లు..

సివిల్: 30 సీట్లు  

➥ మెకానికల్: 30 సీట్లు

➥ ఎలక్ట్రికల్‌: 30 సీట్లు

➥ కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజినీరింగ్ (ఏఐ & ఎంఎల్‌): 30 సీట్లు.

కోర్సు వ్యవధి: 6 సెమిస్టర్లు (మూడేళ్లు).

అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు ఇండస్ట్రీ/ఆర్గనైజేషన్‌/కంపెనీ తదితర రంగాల్లో ఏడాది పని అనుభవం ఉండాలి. 

దరఖాస్తు ఫీజు: రూ.2000. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా.

పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు  ఉంటాయి. అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచి ప్రశ్నలు అడుగుతారు.

ముఖ్యమైన తేదీలు...

➥ నోటిఫికేషన్ విడుదల: 01.06.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.06.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 11.07.2024.

➥ రూ.1500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 15.07.2024.

➥ పరీక్షకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 18.07.2024.

➥ రాతపరీక్ష తేదీ: 21.07.2024.

➥ కౌన్సెలింగ్ తేదీలు: ఫేజ్-I: 27.07.2024, ఫేజ్ II: 03.08.2024.

Notification

Instructions and Guidelines

Online Application

Website

ALSO READ:

శ్రీకొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీలో డిప్లొమా కోర్సు - ప్రవేశాలకు ఇవీ అర్హతలు
SKLTSHU Diploma Admissions: తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా, ములుగులోని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ (SKLTSHU), రెండేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జూన్ 15న ప్రారంభంకాగా.. జులై 15న సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దీనిద్వారా మొత్తం 200 సీట్లలో ప్రవేశాలు కల్పిస్తారు. వీటిల్లో యూనివర్సిటీ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 120 సీట్లు, అనుబంధ పాలిటెక్నిక్‌లలో 80 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 60 శాతం సీట్లను గ్రామీణ విద్యార్థులకు, 40 శాతం సీట్లను పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు. పదోతరగతి లేదా తెలంగాణ పాలిసెట్ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తుకు అర్హులు. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ పాసైనా లేదా ఇతర ఏదైనా డిగ్రీ ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు వీల్లేదు. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Continues below advertisement