Celebrations in Afghanistan:  ఒక్క గెలుపు దేశాన్ని ఏకం చేసింది. ప్రజలందరినీ రహదారులపైకి వచ్చి సంబరాలు చేసుకునేలా చేసింది. ఆ చారిత్రాత్మక విజయాన్ని చూసిన క్రికెట్‌ అభిమానులు, సామాన్యులు పులకించిపోయారు. అద్భుతమంటూ వేడుకలు చేసుకున్నారు. ఏంటి ఇదంతా అనుకుంటున్నారా... టీ 20 ప్రపంచకప్‌(T20 World Cup) సూపర్ ఎయిట్‌ మ్యాచు(Super 8)లో  వన్డే ప్రపంచ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా( Australia)పై అఫ్గాన్‌(Afghanistan) సాధించిన విజయం.. ఆ దేశమంతా సంబరాల్లో మునిగిపోయింది. రోడ్లపైకి వందల్లో చేరిన క్రికెట్ అబిమానులు  సంబరాల్లో మునిగిపోవడంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది.






అలాంటి విజయం మరి...

టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై అఫ్గానిస్థాన్‌ చారిత్రాత్మక విజయం సాధించింది.  21 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను  రషీద్‌ ఖాన్‌ ఓడించడంతో 2024 T20 ప్రపంచ కప్‌లో సెమీ ఫైనల్ రేసులో తిరిగి ప్రవేశించింది. ఇప్పటికే అనేక సమస్యలతో సతమవుతున్న అఫ్గాన్‌ ప్రజలకు ఈ గెలుపు సరికొత్త సంతోషాన్ని ఇచ్చింది. ప్రపంచ ఛాంపియన్‌లను కీలక మ్యాచ్‌లో ఓడించి.. మళ్లీ సెమీస్‌ రేసులో నిలవడం ఆ దేశ అభిమానులకు కొండంత ఆనందాన్ని ఇచ్చింది. ఆసిస్‌పై సాధించిన విజయంతో ఆఫ్ఘాన్‌ ప్రజలు మళ్లీ ఏకం అయ్యారు. సూపర్ 8లో ఆస్ట్రేలియాపై అఫ్గాన్‌ సాధించిన చారిత్రాత్మక విజయంతో అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. 2023 వన్డే ప్రపంచకప్‌లో ఎదురైన ఓటమికి ఆస్ట్రేలియాపై అఫ్గాన్‌ ప్రతీకారం తీర్చుకుంది. వేలాది మంది ప్రజలు అఫ్ఘానిస్తాన్‌ వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సంబరాలతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ స్తంభించిపోయిందని సోషల్‌ మీడియాలో వీడియోలు వైరల్‌గా మారాయి. టీ 20 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాపై ఆఫ్ఘనిస్తాన్ తొలిసారిగా విజయం సాధించడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. భారీగా  బాణాసంచా కాల్చారు. ఖోస్ట్ ప్రావిన్స్ పరిధిలో ఈ సంబరాలు ఓ రేంజ్‌లో జరిగాయి. వందలాదిమంది అప్ఘాన్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. మరొక వీడియోలో కూడా ఇలాంటి సంబరాలే కనిపించాయి. 

 





సెమీస్‌ బెర్తు ఎవరికో..?

 ఇక గ్రూప్ ఏలో భారత్‌తో ఆస్ట్రేలియా తలపడుతుండగా, బంగ్లాదేశ్‌తో అఫ్గానిస్థాన్ తలపడనుంది. ఈ రెండు మ్యాచులతో సెమీస్‌ బెర్తులు ఖరారు కానున్నాయి. అఫ్ఘనిస్థాన్‌... బంగ్లాదేశ్‌పై గెలిస్తే.. ఆసిస్‌ భారత్‌ చేతిలో ఓడిపోతే అఫ్గాన్‌ సెమీస్‌కు చేరుతుంది. 2023 వన్డే ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్ గెలిచే స్థానం నుంచి ఓడిపోయింది. ఆ మ్యాచ్‌లో గ్లెన్ మాక్స్‌వెల్ ఆల్ టైమ్ అత్యుత్తమ వన్డే ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లోనూ మాక్స్‌వెల్‌ అర్ధ సెంచరీ చేశాడు. కానీ గుల్బదిన్ నైబ్ ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. నాలుగు వికెట్లతో చెలరేగాడు. నవీన్‌ ఉల్‌ హక్‌ మూడు వికెట్లు తీశాడు. ఆసిస్‌పై విజయం తర్వాత అఫ్గాన్‌ బౌలింగ్ కోచ్ డ్వేన్ బ్రావో పాడిన "ఛాంపియన్" పాటకు అఫ్గాన్ జట్టు బస్‌లో డ్యాన్స్‌ చేసింది.