Union Cabinet: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ - ఏపీలో 8 కేంద్రీయ, తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు, కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Kendriya Vidyalayas: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా 85 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ఆమోదం తెలపగా ఏపీలో 8, తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Continues below advertisement

Union Cabinet Approves Kendriya And Navodaya Vidyalayas: తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో 8 కేంద్రీయ విద్యాలయాలు (Kendriya Vidyalaya), తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాల (Navodaya Vidyalaya) ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా కొత్తగా 85 కేంద్రీయ విద్యాలయాలు, 28 నవోదయ విద్యాలయాలను ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం జరిగిన కేంద్ర క్యాబినెట్ (Union Cabinet) సమావేశంలో పలు కీలక నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav) వెల్లడించారు. నూతన కేవీల ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 82 వేల మందికి పైగా విద్యార్థులకు ఉన్నత నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్య అందనుంది. దేశంలో కొత్త కేవీల కోసం రూ.5,872 కోట్లు ఖర్చు చేయనున్నట్లు అంచనా. అవి అందుబాటులోకి వస్తే ఒక్కో కేవీలో 960 మంది విద్యార్థులు చదువుకునేందుకు అవకాశం లభిస్తుంది.

Continues below advertisement

ఏపీలో ఎక్కడంటే..?

ఏపీలోని అనకాపల్లి, చిత్తూరులోని వలసపల్లె, సత్యసాయి జిల్లాలోని పాలసముద్రం, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తాళ్లపల్లె, రొంపిచర్ల, ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నందిగామ, నూజివీడు, నంద్యాల జిల్లాలోని డోన్‌లో కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు కేంద్రం ఆమోదం తెలిపింది.

తెలంగాణలో నవోదయ విద్యాలయాలు ఎక్కడంటే.?

అటు, తెలంగాణలో కొత్తగా 7 నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని జగిత్యాల, నిజామాబాద్, కొత్తగూడెం, మేడ్చల్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, సూర్యాపేటలో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయనుంది. ఒక్కో నవోదయ విద్యాలయంలో 560 మంది విద్యార్థులకు అవకాశం దక్కనుంది. 

Also Read: TGSRTC: ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ - అందుబాటులోకి పికప్ వ్యాన్లు, పూర్తి వివరాలివే!

Continues below advertisement