దేశంలోని యూనివర్సిటీలలో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజీసీ నెట్ (జూన్)-2023 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. పీజీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.


యూజీసీ నెట్ జూన్ - 2023 దరఖాస్తు ప్రక్రియ మే 10న ప్రారంభమైంది. సరైన అర్హతలు కలిగిన అభ్యర్థులు మే 10 నుంచి 31 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అయితే జూన్ 1న రాత్రి 11.50 గంటల వరకు ఫీజు చెల్లించవచ్చు. దరఖాస్తు ఫీజుగా జనరల్-రూ.1150; ఈడబ్ల్యూఎస్/ఓబీసీ(నాన్-క్రిమిలేయర్)-రూ.600; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్స్-రూ.325 చెల్లించాలి.


ప్రకటించిన షెడ్యూలు ప్రకారం  జూన్ 13 నుంచి 22 వరకు యూజీసీ నెట్-2023 పరీక్షలను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో రెండు షిఫ్టుల్లో పరీక్ష ఉంటుంది. మొదటి షిఫ్టులో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, రెండో షిఫ్టులో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు.


వివరాలు..


* యూజీసీ నెట్ - జూన్ 2023


అర్హత: కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. పీజీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.


వయోపరిమితి: 01.06.2023 నాటికి జేఆర్‌ఎఫ్ పోస్టులకు 30 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎలాంటి వయోపరిమితి లేదు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


 ఇలా దరఖాస్తు చేసుకోండి..


➥ అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్ చేయాలి. - ugcnet.nta.nic.in.  


➥ అక్కడ హోంపేజీలో కనిపించే UGC NET June - 2023 లింక్ పై క్లిక్ చేయాలి.


➥ స్క్రీన్‌పై వచ్చిన పేజీలో వివరాలను నింపి, సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి. దాంతో రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.


➥ ఆ తరువాత, మీ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వాలి. UGC NET June 2023 అప్లికేషన్ ఫామ్‌ను ఫిల్ చేయాలి.


➥ అవసరమైన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేసి, ఆన్‌లైన్‌లో ఫీ చెల్లించాలి.


➥ అప్లికేషన్ ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకుని పెట్టుకోవాలి.


ఎంపిక విధానం: ప్రవేశపరీక్ష ఆధారంగా.


దరఖాస్తు ఫీజు: జనరల్-రూ.1150; ఈడబ్ల్యూఎస్/ఓబీసీ(నాన్-క్రిమిలేయర్)-రూ.600; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్స్-రూ.325 చెల్లించాలి.


పరీక్ష విధానం..


➥ ఆన్‌లైన్ (సీబీటీ) విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో మొత్తం 2 పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లకు కలిపి మూడు గంటల సమయం ఉంటుంది.


➥ పేపర్-1కు గంట, పేపర్-2 కు రెండు గంటల సమయం ఉంటుంది. పేపర్-1 లో 100 మార్కులకుగాను 50 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. రీజనింగ్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, డైవర్‌జెంట్ థింకింగ్, జనరల్ అవేర్‌నెస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.


➥ పేపర్-2లో 200 మార్కులకుగాను 100 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. అభ్యర్థుల ఆప్షనల్ సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు.


తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, సికింద్రాబాద్, హయత్‌నగర్, జగిత్యాల, జనగాం, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వరంగల్. 


ఏపీలో పరీక్ష కేంద్రాలు: అమరావతి, అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు-చిత్తూరు, తిరుపతి, ఏలూరు, గూడురు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, మంగళగిరి, నంద్యాల, నర్సరావుపేట, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తూర్పుగోదావి-సూరంపాలెం, పశ్చిమగోదావరి-తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.


ముఖ్యమైన తేదీలివే..


➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 10.05.2023.


➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 31.05.2023 (5 PM) 


➥ ఫీజు చెల్లించడానికి చివరితేది: 01.06.2023 (11.50 PM) 


➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 02 - 03.06.2023 (11.50 PM) 


➥ ఎగ్జామ్ సిటీ వివరాల వెల్లడి: తర్వాత వెల్లడిస్తారు.


➥ అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్: తర్వాత వెల్లడిస్తారు.


➥ UGC NET 2023 పరీక్షలు: 13.06.2023 - 22.06.2023. 


➥ ఆన్సర్ కీ వెల్లడి: తర్వాత తెలియజేస్తారు.


Notification


Online Application


Website


Also Read:


డిగ్రీ ప్రవేశాలకు 'దోస్త్‌' నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే!
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ఆన్‌లైన్ ప్రవేశాలకు 'దోస్త్' నోటిఫికేషన్‌ వెలువడింది. మాసబ్ ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి‌ కార్యాలయంలో గురువారం (మే 11) డిగ్రీ దోస్త్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి, కళాశాల విద్యాకమిషనర్ నవీన్ మిట్టల్ ప్రకటించారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 16 నుంచి జులై 10 వరకు దోస్త్ ప్రవేశ ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం మూడు విడతలుగా ప్రవేశాలను కల్పిస్తారు. ప్రవేశాల ప్రక్రియ పూర్తయిన తర్వాత జులై 17 నుంచి డిగ్రీ కాలేజీల్లో తరగతులు ప్రారంభంకానున్నాయి. విద్యార్థులు మొదటి విడతలో రూ.200 చెల్లించాలి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుందని, రెండు, మూడో విడుతలో రూ.400 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. 
దోస్త్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..