UGC NET Exam City Slip 2023: యూజీసీ నెట్(డిసెంబరు)-2023 సిటీ ఇంటిమేషన్ స్లిప్స్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల సిటీ ఇంటిమేషన్ స్లిప్స్(City Intimation Slip)ను అందుబాటులో ఉంచింది. యూజీసీ నెట్-2023 పరీక్షకు దరఖాస్తు చేసుకున్నవారు పరీక్ష సెంటర్ వివరాలకు సంబంధించిన స్లిప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. త్వరలోనే పరీక్ష అడ్మిట్ కార్డులను కూడా ఎన్టీఏ త్వరలోనే విడుదల చేయనుంది.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ప్రధాన నగరాల్లోని కేంద్రాల్లో డిసెంబర్ 6 నుంచి 14 వరకు యూజీసీ నెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలకు సంబంధించిన ఫలితాలను 2024, జనవరి 10న వెల్లడించనున్నారు. పరీక్షకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే అభ్యర్థులు 011-40759000 ఫోన్ నెంబరు లేదా ఈమెయిల్: ugcnet@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చు. మొత్తం 83 సబ్జెక్టుల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష కంప్యూటర్ ఆధారిత (సీబీటీ) విధానంలో పరీక్ష ఉంటుంది. ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిఫ్టులో, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో షిఫ్టులో పరీక్షలు నిర్వహించనున్నారు.
UGC NET - సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ ఇలా పొందండి..
స్టెప్-1: సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ కోసం అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి-https://ugcnet.ntaonline.in/
స్టెప్-2: ఆపై అభ్యర్థి హోమ్‌పేజీలో “Advance City Intimation Slip” లింక్‌పై క్లిక్ చేయండి.
స్టెప్-3: తర్వాత అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పాస్‌వర్డ్ వివరాలను నమోదు చేయాలి.
స్టెప్-4: ఇప్పుడు అభ్యర్థి యొక్క పరీక్ష కేంద్రం వివరాలు స్క్రీన్ మీద కనబడతాయి.
స్టెప్-5: అభ్యర్థులు తమ ఎగ్జామ్ సెంటర్ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
స్టెప్-6: ఎగ్జామ్ సెంటర్ స్లిప్ ప్రింట్ తీసుకోవాలి.
UGC NET December Session 2022 - Exam city intimation slip
పరీక్ష విధానం..
➥ ఆన్‌లైన్ (సీబీటీ) విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో మొత్తం 2 పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లకు కలిపి మూడు గంటల సమయం ఉంటుంది.
➥ పేపర్-1కు గంట, పేపర్-2 కు రెండు గంటల సమయం ఉంటుంది. పేపర్-1 లో 100 మార్కులకుగాను 50 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. రీజనింగ్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, డైవర్‌జెంట్ థింకింగ్, జనరల్ అవేర్‌నెస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
➥ పేపర్-2లో 200 మార్కులకుగాను 100 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. అభ్యర్థుల ఆప్షనల్ సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు.
యూజీసీనెట్ పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
యూజీసీ నెట్ డిసెంబరు 2022 నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, సికింద్రాబాద్, హయత్‌నగర్, జగిత్యాల, జనగాం, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వరంగల్.
ఏపీలో పరీక్ష కేంద్రాలు: అమరావతి, అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు-చిత్తూరు, తిరుపతి, ఏలూరు, గూడురు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, మంగళగిరి, నంద్యాల, నర్సరావుపేట, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తూర్పుగోదావి-సూరంపాలెం, పశ్చిమగోదావరి-తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.