యూజీసీ ఏటా రెండుసార్లు నిర్వహించే నెట్‌ షెడ్యూల్ విడుదల చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తన అధికారిక వెబ్‌సైట్‌లో యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET) 2022 డిసెంబర్ 2021,  జూన్ 2022 ఫేజ్ 1 పరీక్షకు సంబంధించిన పరీక్ష తేదీలు, సబ్జెక్ట్ వారీ షెడ్యూల్‌ను విడుదల చేసింది.


యూజీసీ నెట్‌ 2022 పరీక్షకు హాజరు కావడానికి నమోదు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ ugc net.nta.nic.inలో షెడ్యూల్‌ను చూసుకోవచ్చు. 


నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం అర్హత పరీక్ష నిర్వహిస్తుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డిసెంబర్ 2021, జూన్ 2022లో విడుదల చేసింది. కంప్యూటర్‌పై నిర్వహించే ఈ పరీక్ష తేదీలను యూజీసీ వెబ్‌సైట్‌లో ఉంచింది. జూలై 9, 11, 12, 2022 & ఆగస్ట్ 12, 13, 14, 2022 పరీక్షలు జరగనున్నాయి. 


నోటిఫికేషన్ ప్రకారం 25 సబ్జెక్టులకు పరీక్షలు జులై 9, 2022న, 5 సబ్జెక్టులకు పరీక్షలు జులై 11, 2022న, 4 సబ్జెక్టులకు పరీక్షలు జులై 12, 2022న నిర్వహించనున్నారు. "12, 13 & 14 ఆగస్టు 2022 మధ్య నిర్వహించే పరీక్షల షెడ్యూల్, మిగిలిన సబ్జెక్టుల వివరాలు త్వరలోన వెల్లడిస్తామని వెబ్‌సైట్‌లో యూజీసీ చెప్పింది. 


జూలై 9 పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌కార్డులను కూడా యూజీపీ వెబ్‌సైట్‌లో పెట్టింది. మిగిలిన పరీక్షల సంబందించిన హాల్‌టికెట్స్‌ను ఒకట్రెండు రోజుల్లో వెబ్‌సైట్‌లో పెట్టనున్నారు. పరీక్ష సమాచారం కోసం అభ్యర్థులు ఎన్టీఏ వెబ్‌సైట్ nta.ac.in, ugcnet.nta.nic.inను ఫాలో అవుతుండాలని యూజీసీ చెబుతోంది.