దేశవ్యాప్తంగా ఉన్న నకిలీ విశ్వవిద్యాలయాల జాబితాను విశ్వవిద్యాలయ నిధుల సంఘం(యూజీసీ) విడుదల చేసింది. అందులో ఏపీ నుంచి రెండు వర్సిటీలు ఉన్నట్లు పేర్కొంది. నకిలీ వర్సిటీలపై చర్యలు తీసుకోవాలని ఉన్నత విద్యాశాఖలను ఆదేశిస్తూ ఆయా రాష్ట్రాలకు లేఖలు రాసింది. ఆ విశ్వవిద్యాలయాలు డిగ్రీలను ప్రదానం చేయడం వల్ల ఎంతో మంది విద్యార్థులు నష్టపోతున్నారని, అది వారిని మోసం చేయడమేనని వెల్లడించింది.


ఈ జాబితాలో ఏపీ నుంచి రెండు కళాశాలలు ఉన్నాయి. వాటిలో 'క్రీస్ట్‌ న్యూ టెస్టమెంట్‌ డీమ్డ్‌ వర్సిటీ', 'బైబిల్‌ ఓపెన్‌ వర్సిటీ ఆఫ్‌ ఇండియా' ఆ జాబితాలో ఉన్నట్లు యూజీసీ పేర్కొంది. ఇక ఈ జాబితాలో ఢిల్లీ నుంచి 8 యూనివర్సిటీలు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పుదుచ్ఛేరిలలో ఒక్కోటి చొప్పున, ఉత్తర్ ప్రదేశ్‌లో 4 యూనివర్సిటీలు, వెస్ట్ బెంగాల్ నుంచి రెండు యూనివర్సిటీలు ఉన్నాయి.


ఫేక్ యూనివర్సిటీల జాబితా కోసం క్లిక్ చేయండి..


ALSO READ:


వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకుల్లో 91 భారతీయ విశ్వవిద్యాలయాలకు చోటు..
ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకును లండన్‌కు చెందిన టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ మ్యాగజీప్‌ బుధవారం ప్రకటించింది. ఈ యూనివర్సిటీ ర్యాంకుల్లో రికార్డు స్థాయిలో ఈసారి భారత్‌కు చెందిన 91 యూనివర్సిటీలకు చోటు దక్కింది. గత ఏడాది 75 విశ్వవిద్యాలయాలు చోటు సంపాదించాయి. బెంగళూరులోని ది ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ (IISc)కు భారత్‌లోని ఉత్తమ వర్సిటీగా మరోసారి నిలిచింది. ఈ వర్సిటీకి ఈ ర్యాంకుల్లో 250వ ర్యాంకు దక్కింది.


2017 తర్వాత మరోసారి ఈ ర్యాంకు లభించింది. 108 దేశాల్లోని 1904 విశ్వవిద్యాలయాలు ఈసారి ర్యాంకింగ్‌లో పాల్గొన్నాయి. ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి ఈ ర్యాంకుల్లో మొదటి స్థానం లభించింది. తర్వాత కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం, కేంబ్రిడ్జి మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలు వరుసగా రెండు, మూడు స్థానాలు కైవసం చేసుకున్నాయి. మన దేశంలోని అగ్రశ్రేణి ఐఐటీలు వరుసగా నాలుగో ఏడాది ఈ ర్యాంకులను బహిష్కరించాయి. గత ఏడాది ఈ ర్యాంకుల్లో భారత్‌ ఆరోస్థానంలో ఉండగా.. ఈ సారి 91 విశ్వవిద్యాలయాలకు చోటు దక్కడంతో భారత్‌ స్థానం నాలుగుకు మెరుగుపడింది.


భారత్‌లోని అన్నా విశ్వవిద్యాలయం, జామియా మిలియా ఇస్లామియా, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాలు, స్కూలిని యూనివర్సిటీ ఆఫ్‌ బయోటెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సైన్సెస్‌.. ఈ నాలుగు విశ్వవిద్యాలయాలకు 501 నుంచి 600 ర్యాంకుల మధ్య నిలిచాయి. గువహటి, ధన్‌బాద్‌ ఐఐటీలు గతసారి 1001 నుంచి 1200 ర్యాంకుల శ్రేణి జాబితాలో ఉండగా, ఈసారి 601 నుంచి 800 శ్రేణి జాబితాలోకి చేరుకుని మెరుగయ్యాయి. కోయంబత్తూర్‌లోని భారతీయార్‌ విశ్వవిద్యాలయం, జైపూర్‌లోని మాలవీయ ఎన్‌ఐటీ కూడా ఈ జాబితాలోకి వచ్చాయి. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


ALSO READ:


GATE - 2024 దరఖాస్తు గడువు పెంపు, చివరితేది ఎప్పుడంటే?
దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో పీజీ, డాక్టోరల్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌(గేట్‌)-2024 దరఖాస్తు గడువును పొడిగించారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఎలాంటి ఆలస్యరుసుము లేకుండా అక్టోబర్‌ 5లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే ఎక్స్‌టెండెడ్ పీరియడ్‌తో అక్టోబరు 13 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో గేట్ పరీక్షలను నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 200 నగరాలు, పట్టణాల్లో పరీక్ష జరుగుతుంది. 
దరఖాస్తు, పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...