TTD Junior College Admissions: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని జూనియర్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. దీనిద్వారా తిరుపతిలోని టీటీడీ నిర్వహిస్తున్న శ్రీ పద్మావతి జూనియర్ కాలేజీ(బాలికల కోసం), శ్రీ వేంకటేశ్వర జూనియర్ కాలేజీ(బాలుర కోసం)లలో మొత్తం 1760 సీట్లను భర్తీచేస్తారు. ఇందులో బాలికలకు 968 సీట్లు, బాలురకు 792 సీట్లు కేటాయించారు. ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే (మే 15న) ప్రారంభంకాగా.. మే 31 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. పదోతరగతి లేదా తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి. మెరిట్, రిజర్వేషన్లు ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. 


వివరాలు..


* తిరుమల తిరుపతి దేవస్థానం - ఇంటర్ ప్రవేశాలు


మొత్తం సీట్ల సంఖ్య: 1760.


➥ శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, తిరుపతి (తెలుగు, ఇంగ్లిష్ మీడియం)   


కోర్సులు: ఎంపీసీ, ఎంఈసీ, బైపీసీ, సీఈసీ, సీఈఎల్, హెచ్ఈసీ కోర్సులు. 


సీట్లసంఖ్య: మొత్తం 968 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మొదటి 450 మందికి మాత్రమే హాస్టల్ వసతి కల్పిస్తారు.


➥ శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల, తిరుపతి (తెలుగు, ఇంగ్లిష్ మీడియం)   


కోర్సులు: ఎంపీసీ, ఎంఈసీ, బైపీసీ, సీఈసీ, సీఈఎల్,హెచ్ఈసీ, హెచ్టీసీ, జీఈహెచ్.


సీట్లసంఖ్య: మొత్తం 792 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 400 మందికి మాత్రమే హాస్టల్ వసతి కల్పిస్తారు.


అర్హతలు: పదోతరగతి లేదా తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి. 


ఫీజు: ప్రవేశాలు పొందిన విద్యార్థులు కళాశాలలో చేరేముందు ఫీజుగా సైన్స్ గ్రూపుల్లో ప్రవేశాలు కోరే విద్యా్ర్థులు అయితే రూ.4,875, ఆర్ట్స్ గ్రూపుల్లో ప్రవేశాలు కోరే విద్యార్థులైతే రూ.3,975 చెల్లించాల్సి ఉంటుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: పదోతరగతి మార్కుల మెరిట్, రిజర్వేషన్లు ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. పదోతరగతి పరీక్షల్లో ముందుగా పాసైనవారికి ప్రాధాన్యత ఇస్తారు. ఆ తర్వాత సప్లిమెంటరీ పరీక్షల్లో పాసైనవారికి సీట్లు కేటాయిస్తారు. విద్యార్థులు వారుండే గ్రామం నుంచి 20 కి.మీ కంటే తక్కువ దూరం ఉన్నవారికి జూనియర్ కాలేజీ హాస్టళ్లలో ప్రవేశాలు కల్పించరు.  శ్రీ పద్మావతి జూనియర్ కాలేజీలో బాలికలకు, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కాలేజీలో బాలురకు, థర్డ్ జెండర్ విద్యార్థులకు మాత్రమే ప్రవేశాలు కల్పిస్తారు. అయితే థర్డ్ జెండర్ విద్యార్థులకు హాస్టల్ సదుపాయం ఉండదు. 


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.05.2024.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 31.05.2024.


➥ మెరిట్ జాబితా, సీట్ల కేటాయింపు: 02.06.2024 - 03.06.2024.


➥ SMS ద్వారా విద్యార్థులకు సమాచారం చేరవేత: 03.06.2024 - 04.06.2024.


➥ ఇంటర్ మొదటి సంవత్సరంలో ఫేజ్-1 ప్రవేశాలు ప్రారంభం: 05.06.2024.


➥ తరగతులు ప్రారంభం: 10.06.2024.


Website


ALSO READ:


శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఎంవీఎస్సీ కోర్సు, ప్రవేశం ఇలా
తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ 2023-24 విద్యా సంవత్సరానికి ఎంవీఎస్సీ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 80 సీట్లను భర్తీ చేయనున్నారు. బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌తో పాటు ఐకార్‌ ఏఐసీఈ(జేఆర్‌ఎఫ్‌/ ఎస్‌ఆర్‌ఎఫ్‌)- 2023 ర్యాంకు సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జూన్ 3 వరకు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చు. ఐకార్‌ ఏఐఈఈఏ(పీజీ)- 2023 ర్యాంకు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, కౌన్సెలింగ్‌ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
ప్రవేశానికి సంబంధించిన వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..