DOST 2024 Phase-1 Seat Allotment: తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల‌కు సంబంధించి విద్యార్థులకు 'దోస్త్' తొలిదశ సీట్లను అధికారులు కేటాయించారు. మొద‌టి విడత‌లో మొత్తం 76,290 మందికి సీట్లు కేటాయించిన‌ట్లు ఉన్నత విద్యామండ‌లి జూన్ 6న ఒక ప్రకటనలో తెలిపింది. విద్యాశాఖ ప్రిన్సిప‌ల్ సెక్రట‌రీ బుర్రా వెంక‌టేశం, ఉన్నత విద్యా మండ‌లి చైర్మన్ ఆర్ లింబాద్రితో పాటు దోస్త్ క‌న్వీన‌ర్ సీట్ల కేటాయింపు కార్యక్రమంలో పాల్గొన‌నున్నారు.


ఫేజ్‌-1 మొదటి విడత సీట్ల కేటాయింపు ఫలితాలకు సంబంధించి.. మొత్తం 1,04,784 మంది విద్యార్థులు రిజిస్ట్రేష‌న్ చేసుకోగా.. 76,290కి సీట్లు దక్కాయి. ఇందులో ఆర్ట్స్ గ్రూపుల్లో 7,766 మందికి; కామ‌ర్స్ గ్రూపుల్లో 28,655 మందికి; లైఫ్ సైన్సెస్ గ్రూపుల్లో 15,301 మందికి; ఫిజిక‌ల్ సైన్సెస్ గ్రూపుల్లో 14,964 మందికి; డేటా సైన్స్ గ్రూపుల్లో 2,502; డీ-ఫార్మసీ గ్రూపుల్లో 90 మందికి, ఇత‌ర గ్రూపుల్లో 7012 మంది విద్యార్థులకు సీట్లను కేటాయించారు. సీట్లు పొందిన విద్యార్థుల జూన్ 6 నుంచి 12 మధ్య ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. 


రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,066 డిగ్రీ కాలేజీలు ఉండగా.. ఇందులో 135 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలుండగా, 86 రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీలు, మిగిలినవి ప్రైవేట్‌ కాలేజీలు ఉన్నాయి. ఆయా కళాశాల్లో మొత్తం 4,49,449 సీట్లు అందుబాటులో ఉన్నాయి. గతేడాది మొత్తం 3,89,049 సీట్లకుగాను 2.05 లక్షల సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అయితే ఈసారి అదనంగా నాలుగు కొత్త కోర్సులను ఉన్నత విద్యామండలి ప్రవేశపెట్టింది. గతంలో ప్రవేశపెట్టిన సెక్టార్‌ స్కిల్‌ కోర్సులను మరిన్ని కళాశాలలకు  విస్తరించారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ తదితర కోర్సుల్లోని సీట్లను దోస్త్‌ ద్వారా భర్తీచేస్తారు. 


DOST 2024 మొదటి విడత సీట్ల కేటాయింపు ఫలితాల కోసం క్లిక్ చేయండి..


దోస్త్' రెండో విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం..
దోస్త్ 'ఫేజ్-2' రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 6న ప్రారంభమైంది. అభ్యర్థులు జూన్ 13 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు ఫీజుగా రూ.400 చెల్లించాల్సి ఉంటుంది.   రెండో విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు జూన్ 6 నుంచి 14 వరకు అవకాశం కల్పించనున్నారు. ఇక స్పెషల్ కేటగిరీ అభ్యర్థులకు జూన్ 13న సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. విద్యార్థులకు జూన్ 18న రెండో విడత డిగ్రీ సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 19 నుంచి 24 మధ్య సంబంధిత కళాశాలలో సెల్ప్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.



దోస్త్' మూడో విడత ప్రవేశాలు ఇలా..


➥ దోస్త్ మూడో విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 19 నుంచి ప్రారంభంకానుంది.


➥ విద్యార్థులు జూన్ 25 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.


➥  చివరి విడత వెబ్ ఆప్షన్ల ప్రక్రియను జూన్ 19 నుంచి 26 వరకు అవకాశం కల్పిస్తారు.


➥ ఫేజ్-3 స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ (PH/ CAP/NCC ): 25.06.2024.


➥ విద్యార్థులకు జూన్ 29న మూడో విడత డిగ్రీ సీట్లను కేటాయిస్తారు.


➥ సీట్లు పొందిన విద్యార్థులు జులై 3లోగా సంబంధిత కళాశాలలో సెల్ప్ రిపోర్టింగ్ చేయాలి.


➥ అన్ని విడతల్లో (ఫేజ్-1, ఫేజ్-2, ఫేజ్-3) సీట్లు పొందిన విద్యార్థులు రిపోర్టింగ్ చేయడానికి తేదీలు: 29.06.2024 - 05.07.2024.


➥ కళాశాలలో విద్యార్థులకు ఓరియంటేషన్ తరగతులు: 01.07.2024 - 06.07.2024.


➥  జులై 8 నుంచి కళాశాలల్లో తరగతులు ప్రారంభంకానున్నాయి.


Notification (Telugu)


Notification (English)


DOST Schedule


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..