Daily Horoscope Predictions in Teluguమేష రాశి 

ఈ రోజు మేష రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. కీలక నిర్ణయాలు తీసుకునేముందు సన్నిహితులతో చర్చించడం మంచిది. ఉద్యోగులు పని విషయంలో ఆందోళన చెందుతారు. నిరుద్యోగులకు కెరీర్ కి సంబంధించి కొనసాగుతున్న ఆందోళనలు తొలగిపోతాయి. వ్యాపారం బాగానే సాగుతుంది. ఆరోగ్ం విషయంలో జాగ్రత్త అవసరం.  

వృషభ రాశి

ఆధ్యాత్మిక  కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామితో కొనసాగుతున్న గందరగోళం తొలగిపోతుంది. పిల్లల చదువు విషయంలో ఆందోళన పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి...కుటుంబానికి సమయం కేటాయించాలి. 

మిథున రాశి

ఈ రాశివారు ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగులు, వ్యాపారులు లాభపడతారు. ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. 

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మంచి రోజు అవుతుంది. మీ రహస్యాలను ఎవ్వరిముందూ బహిర్గతం చేయవద్దు. మీ జీవిత భాగస్వామి మీకు శుభవార్త అందిస్తారు. కుటుంబ కార్యక్రమాలతో బిజీగా ఉంటారు. 

Also Read: మిథునం, కర్కాటకం, మీనం సహా ఈ రాశులవారికి భావోద్వేగాలు ఎక్కువ - ఎదుటివారి కష్టాలు చూసి ఇట్టే కరిగిపోతారు!

సింహ రాశి

అపరిచిత వ్యక్తుల నుంచి దూరం పాటించడం మంచిది. కార్యాలయంలో ఇతరుల పనిలో జోక్యం చేసుకోవద్దు. అనుకోని సమస్యలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఈ రాశివారు అగ్ని, నీరు పట్ల జాగ్రత్తగా ఉండాలి. పిల్లల కారణంగా ఇంట్లో సంతోషం ఉంటుంది.  కన్యా రాశి 

ఈ రోజు మీకు అన్నీ శుభఫలితాలే ఉన్నాయి. ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. అదనపు పని కారణంగా అలసిపోతారు. అనారోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి.

తులా రాశి 

ఈ రాశివారు వృత్తి, ఉద్యోగాలపై దృష్టి సారిస్తారు. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపట్ల ఆసక్తి చూపిస్తారు. ఓ గుడ్ న్యూస్ వింటారు. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. 

వృశ్చిక రాశి 

అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. చెడు సహవాసాలకు దూరంగా ఉండాలి.  ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది జాగ్రత్తపడండి. వ్యాపారంలో ఉండే సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగులకు మంచి రోజు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. 

ధనుస్సు రాశి

ఈ రోజు పని ఒత్తిడితో ఇబ్బందిపడతారు. తొందరగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. కొత్తగా ప్రారంభించే పనులు లాభిస్తాయి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. 

మకర రాశి

ఈ రోజు మీరు శత్రువుల నుంచి జాగ్రత్తగా ఉండాలి. అనుకోని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రాశివారు కార్యాలయంలో శుభవార్త వింటారు. నూతన వాహనం కొనుగోలు చేయాలన్న మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. 

Also Read: ఈ రాశుల అమ్మాయిలకు ధనవంతులైన భర్తలు వస్తారట - ఇందులో మీ రాశి ఉందేమో చూడండి

కుంభ రాశి 

ఈ రోజు మీరు కుటుంబ పనిలో బిజీగా ఉంటారు. స్నేహితులు సన్నిహితుల నుంచి శుభవార్త వింటారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రయాణం చేసేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. ఉద్యోగులు , వ్యాపారులు మిశ్రమ ఫలితాలు పొందుతారు...

మీన రాశి 

ఈ రోజు ఈ రాశివారికి నూతన వ్యవహారాలపై ఆసక్తి ఉంటుంది. చదువు పూర్తిచేసుకుని ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి టైమ్ కలిసొస్తుంది. వ్యాపారంలో ఎప్పటి నుంచో కొనసాగుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం బావుంటుంది.  

గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.