తెలంగాణలోని యూనివర్సిటీలకు సంబంధించిన కామన్ అకడమిక్ క్యాలెండర్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి అక్టోబరు 26న విడుదల చేసింది. దీంతో యూనివర్సిటీల్లోని డిగ్రీ, పీజీ కోర్సుల షెడ్యూళ్లకు సంబంధించిన గందరగోళానికి రాష్ట్ర ప్రభుత్వం తెరదించినట్లయింది. రాష్ట్రంలోని ఏడు యూనివర్సిటీలకు కామన్‌ అకాడమిక్‌ క్యాలెండర్‌ను ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి విడుదల చేశారు. డిగ్రీ మొదటి సెమిస్టర్‌, పీజీలోని 1, 3 సెమిస్టర్లకు సంబంధించిన అకాడమిక్‌ క్యాలెండర్‌ను ప్రకటించారు. 


ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. ఉస్మానియా, కాకతీయ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, తెలంగాణ, తెలంగాణ మహిళా యూనివర్సిటీల్లో డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరిన విద్యార్థులందరికీ ఒకేసారి తరగతులు ప్రారంభంకానున్నాయి. అదేవిధంగా ఇంటర్నల్ పరీక్షలు, సెమిస్టర్‌ పరీక్షలు కూడా ఒకేసారి నిర్వహించనున్నారు. ఇప్పటిదాకా ఈ ఏడు యూనివర్సిటీల్లో వేర్వేరు అకాడమిక్‌ క్యాలెండర్లు అమలు చేసేవారు. దీనివల్ల ప్రవేశ పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటనలో ఇబ్బందలు తలెత్తడంతో అన్ని వర్సిటీలకు కలిపి ఒకే క్యాలెండర్‌ రూపొందించాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు కామన్‌ అకాడమిక్‌ క్యాలెండర్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఇప్పటికే అక్టోబరు 10 నుంచి డిగ్రీ, పీజీ విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి. 


  డిగ్రీ కోర్సుల అకాడమిక్‌ క్యాలెండర్‌ (మొదటి సెమిస్టర్‌) ఇలా..

✈ తరగతులు ప్రారంభం: 10.10.2022.

✈ మొదటి ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌: 08.12.2022, 09.12.2022 తేదీల్లో

✈ రెండో ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌: 23.01.2023, 24.01.2023 తేదీల్లో.

✈ తరగతుల ముగింపు: 03.02.2023.

✈ ప్రాక్టికల్స్‌, ప్రిపరేషన్‌ హాలీడేస్: 04.02.2023 నుంచి 08.02.2023 వరకు.

✈ సెమిస్టర్‌ పరీక్షలు: 09.02.2023 నుంచి.



  పీజీ కోర్సుల అకాడమిక్‌ క్యాలెండర్‌ (1, 3 సెమిస్టర్స్‌ వారికి) ఇలా..


✈ తరగతులు ప్రారంభం: 10.10.2022.

✈ మొదటి ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌:  22.12.2022, 23.12.2022 తేదీల్లో.

✈ రెండో ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌: 09.02.2023, 10.02.2023 తేదీల్లో.

✈ తరగతుల ముగింపు: 23.02.2023.

✈ప్రాక్టికల్స్‌, ప్రిపరేషన్‌ సెలవులు: 24.02.2022 నుంచి 26.02.2022 వరకు.

✈ సెమిస్టర్‌ పరీక్షలు: 27.02.2023 నుంచి.


 


:: ఇవీ చదవండి ::


TS Scholarships: ఫీజు రీయింబెర్స్‌మెంట్, స్కాలర్‌షిప్స్‌ దరఖాస్తుకు చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలో బోధన ఫీజులు, ఉపకారవేతనాల కోసం దరఖాస్తు గడువును ప్రభుత్వం వచ్చే ఏడాది జనవరి 31 వరకు పొడిగించింది. ఈ మేరకు ఎస్సీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి విజయ్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. ఉపకారవేతనాలకు అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా గడువును పెంచినట్లు ఆయన వెల్లడించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..



AISSEE-2023: సైనిక పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ - పరీక్ష, ఎంపిక వివరాలు ఇలా!
దేశంలోని సైనిక పాఠశాలల్లో 2023-2024 విద్యా సంవత్సర ప్రవేశాల కోసం 'అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష (AISSEE-2023)' నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 33 సైనిక పాఠశాలల్లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఎన్‌జీవోలు/ ప్రైవేట్ పాఠశాలలు/ రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పనిచేసే 18 కొత్త సైనిక పాఠశాలలకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ పాఠశాలల్లోనూ 6 తరగతి ప్రవేశాలు ఏఐఎస్‌ఎస్‌ఈఈ-2023 ద్వారా జరుగుతాయి.
నోటిఫికేషన్, దరఖాస్తు, ఎంపిక వివరాల కోసం క్లిక్ చేయండి..


 


మహిళా 'ప్రతిభ'కు చేయూత 'ప్రగతి' స్కాలర్‌షిప్‌!! దరఖాస్తు చేసుకోండి, అర్హతలివే!
మహిళలను సాంకేతిక విద్యలో ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ‘ప్రగతి స్కాలర్‌షిప్‌’  నోటిఫికేషన్‌ వెలువడింది.  ‘ఆలిండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ)’ ఏటా ఈ ఉపకారవేతనం అందిస్తోంది. డిప్లొమా, డిగ్రీ కోర్సులు చదువుతున్న అర్హులైన అమ్మాయిలకు ఈ స్కీమ్ కింద ఆర్థికసాయం అందిస్తారు. కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలకు మించకూడదు.  ఒక కుటుంబం నుంచి ఇద్దరు అమ్మాయిలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. సరైన అర్హతలున్న మహిళలు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాలి. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా స్కాలర్‌షిప్ అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
స్కాలర్‌షిప్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 


 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..