TS Inter Results 2024: తెలంగాణలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 24న విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 24న ఉదయం 11 గంటలకు ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు. ఇంటర్ ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://tsbie.cgg.gov.in తోపాటు https://telugu.abplive.com//amp వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంచనున్నారు.


రాష్ట్రంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్‌ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు దాదాపు 9,80,978 మంది విద్యార్థులు హాజరయ్యారు.  ఇందులో.. 4,78,527 మంది ఇంటర్ మొద‌టి సంవత్సరం విద్యార్థులు కాగా.. 4,43,993 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. ఇక ఒకేషనల్ కోర్సులకు సంబంధించి మొదటి సంవత్సరం 48,277 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం 46,542 మంది విద్యార్థులు ఉన్నారు. 


జవాబు పత్రాల మూల్యాంకనంలో సిబ్బంది ఎలాంటి తప్పులు చేయవద్దని ఇంటర్ బోర్డు మూల్యాంకన సమయంలో హెచ్చరించిన సంగతి తెలిసిందే. గత అనుభవాల దృష్ట్యా.. ఈసారి ఎలాంటి వాటికి అవకాశం ఇవ్వొద్దని సూచించింది. పూర్తిస్థాయిలో క్షుణ్ణంగా జవాబు పత్రాలను పరిశీలించిన తర్వాతే.. మార్కులను ఎంట్రీ చేయాలని సిబ్బందికి దిశానిర్దేశం చేసింది. వాల్యూయేషన్ ప్రక్రియను మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేక అధికారులను కూడా నియమించింది.


ఒకవైపు పరీక్షలు జరుగుతుండగానే మార్చి 10 నుంచి మూల్యాంకన ప్రక్రియ ప్రారంభించారు. జవాబు పత్రాల మూల్యాంకనంలో ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు వహించారు. మూల్యాంకన ప్రక్రియ ఏప్రిల్‌ 10తో ముగియగా.. మార్కుల నమోదు పాటు ఎలాంటి సాంకేతికపరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జవాబు పత్రాలను మూడేసి సార్లు పరిశీలించడంతో పాటు కోడింగ్, డీకోడింగ్‌ ప్రక్రియ పూర్తిచేశారు.  


విద్యార్థులు ఇంటర్ ఫలితాలు ఇలా చూసుకోవచ్చు..


➥ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి- (tsbie.cgg.gov.in)


➥ అక్కడ హోంపేజీలో 'TSBIE 2024 result' లింక్ మీద క్లిక్ చేయాలి.


➥ విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబరు నమోదుచేయాలి.


➥ కంప్యూటర్ స్క్రీన్ మీద ఫలితాలు కనిపిస్తాయి.


➥ ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి. 


ALSO READ:


TOSS: తెలంగాణ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల, టైమ్‌టేబుల్ ఇలా
తెలంగాణ ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను అధికారులు విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ పేరు, జిల్లా, స్కూల్ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 25 నుంచి మే 2 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌; మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక మే 3 నుంచి 10 వరకు ఇంటర్ జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. 
హాల్‌టికెట్లు, పరీక్షల టైమ్ టేబుల్ కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...