CSK vs LSG IPL 2024 Lucknow Super Giants won by 6 wkts: చివరి బాల్ వరకు ఉత్కంఠతో జరిగిన మ్యాచ్ లో చెన్నై(CSK)పై లఖ్‌నవూ (LSG) విజయం సాధించింది . తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన లఖ్‌నవూ 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బ్యాటర్ మార్కస్ స్టాయినిస్ అద్భుత శతకంతో అదరగొట్టాడు.
ఒకానొక సమయంలో మ్యాచ్ చెన్నై వైపు ఉన్నట్టు అనిపించినా సమయంలో సీఎస్కే బౌలర్లపై స్టోయినీస్ విరుచుకుపడ్డాడు. మార్కస్ 63 బంతుల్లో 124 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో 6 సిక్సులు, 13 ఫోర్లు ఉన్నాయి. పూరన్ 14 బంతుల్లో 34 పరుగులు చేయగా చివర్లో దీపక్ హూడా 6 బంతుల్లో 17 రన్స్ తో జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. చెన్నై బౌలర్లలో పతిరన 2, ముస్తాఫిజుర్ రెహ్మాన్ 1, దీపక్ చాహర్ 1 వికెట్ తీశారు.
చెలరేగిన రుతురాజ్
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకు... తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. ఈ సీజన్‌లో వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న అజింక్యా రహానే ఈ మ్యాచ్‌లోనే విఫలమయ్యాడు. హెన్రీ వేసిన తొలి ఓవర్ చివరి బంతికే రహానే అవుటయ్యాడు. రహానే మూడు బంతుల్లో ఒకే పరుగు చేసి రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో నాలుగు పరుగుల వద్దే చెన్నై తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం డేరిల్ మిచెల్ కూడా 11 పరుగులు, రవీంద్ర జడేజా 17 పరుగులకే వెనుదిరగడంతో చెన్నై కష్టాల్లో పడింది. కానీ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు జత కలిసిన శివమ్ దూబే చెన్నై స్కోరు వేగాన్ని పెంచాడు. రుతురాజ్ 60 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సులతో 108 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. శివమ్ దూబే 27 బంతుల్లోనే 3 ఫోర్లు, ఏడు భారీ సిక్సులతో 66 పరుగులు చేశాడు. వీరిద్దరి బ్యాటింగ్‌తో న్నై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో హెన్రీ, యష్ ఠాకూర్, మోహిన్ ఖాన్ ఒక్కో వికెట్ తీశారు.