APBIE INTER HALLTICKETS: తెలంగాణలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల హాల్‌టికెట్లు ఫిబ్రవరి 19 విడుదలకానున్నాయి. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచనున్నారు. మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఎస్సెస్సీ లేదా మొదటి ఏడాది హాల్‌టికెట్ నంబరుతో థియరీ పరీక్షల హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రెండో ఏడాది వారు మొదటి సంవత్సరం లేదా రెండో ఏడాది హాల్‌టికెట్ నంబరుతో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్‌టికెట్లలో ఫొటోలు, సంతకాలు, ఇతర సవరణలు అవసరమైతే కళాశాల ప్రిన్సిపల్ దృష్టికి తీసుకువెళ్లి, సరిచేయించుకునే వెసులుబాటు ఉంటుంది.


ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ ఏడాది 9.8 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారు. 


Website


ఇంటర్ పరీక్షల షెడ్యూలు..


ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు..


➥ 28-02-2024: సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-I


➥ 01-03-2024: ఇంగ్లిష్‌ పేపర్‌-I


➥ 04-03-2024: మ్యాథమెటిక్స్‌ పేపర్‌-IA, బాటనీ పేపర్‌-I, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-I


➥ 06-03-2024: మ్యాథమేటిక్స్‌ పేపర్‌-IB, జువాలజీ పేపర్‌-I, హిస్టరీ పేపర్‌-I


➥ 11-03-2024: ఫిజిక్స్‌ పేపర్‌-I, ఎకనామిక్స్‌ పేపర్‌-I


➥ 13-03-2024: కెమిస్ట్రీ పేపర్‌-I, కామర్స్‌ పేపర్‌-I


➥ 15-03-2024: పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-I, బ్రిడ్జి కోర్స్‌ మ్యాథ్స్‌ పేపర్‌-I


➥ 18-03-2024: మోడర్న్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-I, జియోగ్రఫీ పేపర్‌-I


ఇంటర్‌ సెకండ్‌ పరీక్షలు..


➥ 29-02-2024: సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-II


➥ 02-03-2024: ఇంగ్లిష్‌ పేపర్‌-II


➥ 05-03-2024: మ్యాథమెటిక్స్‌ పేపర్‌-IIA, బాటనీ పేపర్‌-II, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-II


➥ 07-03-2024: మ్యాథమెటిక్స్‌ పేపర్‌-IIB, జువాలజీ పేపర్‌-II, హిస్టరీ పేపర్‌-II


➥ 12-03-2024: ఫిజిక్స్‌ పేపర్‌-II, ఎకనామిక్స్‌ పేపర్‌-II


➥ 14-03-2024: కెమిస్ట్రీ పేపర్‌-II, కామర్స్‌ పేపర్‌-II


➥ 16-03-2024: పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-II, బ్రిడ్జి కోర్స్‌ మ్యాథ్స్‌ పేపర్‌-II


➥ 19-03-2024: మోడర్న్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-II, జియోగ్రఫీ పేపర్‌-II  


ALSO READ:


ఇస్రో ‘యువ విజ్ఞాని’కి ఫిబ్రవరి 20 నుంచి దరఖాస్తులు, వీరే అర్హులు
 ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్(ISRO) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పాఠశాల విద్యార్థుల కోసం నిర్వహించే ‘యువ విజ్ఞాని’ (Yuvika) కార్యక్రమానికి దరఖాస్తులు కోరుతోంది. ఫిబ్రవరి 20 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని ‘ఎక్స్‌’లో తెలిపింది. ‘క్యాచ్‌ దెమ్‌ యంగ్‌’ పేరిట రెండు వారాల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో అంతరిక్ష సాంకేతికత, విజ్ఞానం, అప్లికేషన్లపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. 2024 జనవరి 1 నాటికి 9వ తరగతి చదువుతున్నవారు అర్హులు. విద్యార్థి దశలోనే విజ్ఞానం, సాంకేతికత, ఇంజినీరింగ్‌, మ్యాథమేటిక్స్‌ (స్టెమ్‌) అంశాలపై అవగాహన కల్పించి, తద్వారా వారిని పరిశోధనల వైపు దృష్టి మళ్లించటమే లక్ష్యమని ఇస్రో వెల్లడించింది. అంతరిక్ష సాంకేతికత, అంతరిక్ష శాస్త్ర విజ్ఞానం, స్పేస్ అప్లికేషన్స్ లాంటి అంశాల్లో విజ్ఞానం పొందేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. అంతరిక్ష పరిశోధనలపై విద్యార్థినీవిద్యార్థుల్లో ఉన్న ఆసక్తిని గుర్తించి, వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు ఇస్రో ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఎంపికైనవారికి ఇస్రో గెస్ట్ హౌజ్ లేదా హాస్టళ్లలో వసతి సౌకర్యాలు ఉంటాయి. రవాణా ఖర్చులు, కోర్స్ మెటీరియల్, వసతి ఖర్చులన్నీ ఇస్రోనే భరిస్తుంది.
వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...