Jagan Siddham Meeting at Raptadu in Anantapur District: రాప్తాడు: రాయలసీమ పరిధిలోని 52 నియోజకవర్గాలకుగానూ అనంతపురం జిల్లాలోని రాప్తాడులో వైసీపీ సిద్ధం భారీ బహిరంగ సభ ఆదివారం నిర్వహించింది. వైసీపీ సిద్ధం సభ కవరేజ్ కోసం వెళ్లిన ప్రముఖ మీడియాకు చెందిన జిల్లా ఫోటో జర్నలిస్టు కృష్ణపై వైసీపీ అల్లరి మూకలు దాడి చేశాయి. ఫొటోలు తీస్తున్నాడంటూ కొందరు ఆకతాయిలు అతడిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. వైసీపీ కార్యకర్తలు, అభిమానుల దాడిలో జర్నలిస్టు కృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు. సీఎం జగన్ సభ అంటే భారీ సంఖ్యలో పోలీసులు సభ వద్ద ఉన్నారు. పోలీసుల సమక్షంలో ఇంత జరిగిన ఒక్కరు కూడా అడ్డుకోకపోవడం విమర్శలకు కారణమైంది. అల్లరి మూకల దాడిలో గాయపడిన కృష్ణను అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.




ఫొటో జర్నలిస్టుపై దాడిని ఖండించిన లోకేష్ 
అనంతపురం జిల్లా రాప్తాడు సిద్ధం సభలో  ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై జరిగిన దాడిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. సభలో ఫొటోలు తీస్తున్న అతడిపై వైసీపీ అల్లరి మూకల దాడి సరికాదన్నారు. జగన్ పాల్గొన్న సిద్ధం సభ ఫోటోలు తీయడం నిషిద్ధమా? నేరమా? అని లోకేష్ ప్రశ్నించారు. ఇది కచ్చితంగా మీడియాపై జగన్ చేసిన ఫ్యాక్షన్ దాడి అంటూ మండిపడ్డారు.. ఈరోజు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై దాడి చేయించారని... ఒక పత్రిక, ఛానెల్ యజమాని అయిన జగన్ ఇటువంటి దాడులు ప్రోత్సహించడం, నీ సంస్థల్లో పనిచేసే వారందరినీ రిస్క్ లో పెట్టడమే అని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు.