తెలంగాణలో మే 9న ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ ఫ‌లితాలు విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఈ ప‌రీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం జూన్ 12 నుంచి ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షల‌ు నిర్వహించ‌నున్నట్లు ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు బుధ‌వారం (మే 17) తెలిపింది. ఈ మేర‌కు ప‌రీక్షల టైం టేబుల్‌ను కూడా విడుద‌ల చేసింది. ప్రథ‌మ సంవ‌త్సరం విద్యార్థుల‌కు ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ద్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు, ద్వితీయ సంవ‌త్సరం విద్యార్థుల‌కు మ‌ధ్యాహ్నం 2:30 గంట‌ల నుంచి సాయంత్రం 5:30 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్షల‌ను నిర్వహించ‌నున్నారు.


ఫ‌స్టియ‌ర్ ప‌రీక్షలు..


➥ జూన్ 12 (సోమ‌వారం) – లాంగ్వేజ్ పేప‌ర్ -1


➥ జూన్ 13 (మంగ‌ళ‌వారం) – ఇంగ్లిష్‌


➥ జూన్ 14 (బుధ‌వారం) – మ్యాథ్స్-1(ఎ), బోట‌నీ, పొలిటిక‌ల్ సైన్స్


➥ జూన్ 15 (గురువారం) – మ్యాథ్స్-1(బి), జువాల‌జీ, హిస్టరీ


➥ జూన్ 16 (శుక్రవారం) – ఫిజిక్స్, ఎకాన‌మిక్స్


➥ జూన్ 17 (శ‌నివారం) – కెమిస్ట్రీ, కామ‌ర్స్


➥ జూన్ 19 (సోమ‌వారం) – ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్(బైపీసీ స్టూడెంట్స్ కోసం)


➥జూన్ 20 (మంగ‌ళ‌వారం) – మోడ్రన్ లాంగ్వేజ్, జియోగ్రఫ


సెకండియ‌ర్ ప‌రీక్షలు..


➥ జూన్ 12 (సోమ‌వారం) – లాంగ్వేజ్ పేప‌ర్ -2


➥ జూన్ 13 (మంగ‌ళ‌వారం) – ఇంగ్లీష్‌-2


➥ జూన్ 14 (బుధ‌వారం) – మ్యాథ్స్-2(ఎ), బోట‌నీ, పొలిటిక‌ల్ సైన్స్


➥ జూన్ 15 (గురువారం) – మ్యాథ్స్-2(బి), జువాల‌జీ, హిస్టరీ


➥ జూన్ 16 (శుక్రవారం) – ఫిజిక్స్, ఎకాన‌మిక్స్


➥ జూన్ 17 (శ‌నివారం) – కెమిస్ట్రీ, కామ‌ర్స్


➥ జూన్ 19 (సోమ‌వారం) – ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్(బైపీసీ స్టూడెంట్స్ కోసం)


➥ జూన్ 20 (మంగ‌ళ‌వారం) – మోడ్రన్ లాంగ్వేజ్, జియోగ్రఫీ



Also Read:


పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఏ పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలో పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు వెలువడింది. ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం జూన్ 14 నుంచి 22 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ప్రతిరోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. కాంపొజిట్ పేపర్లకు మాత్రం మధ్యాహ్నం 12.50 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఏడాది తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి 13 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్షలకు 4,94,620 మంది విద్యార్ధులు హాజరయ్యారు. పదోతరగతిలో మొత్తం 86.6 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. టెన్త్ ఫలితాల్లో బాలికలదే పైచేయి. 88.53 శాతం బాలికలు పాస్ అయ్యారు. ఇక 99 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా టాప్‌లో నిలవడం విశేషం. 59.46 శాతంతో వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో ఉంది. 2793 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం. 25 పాఠశాలల్లో 0 శాతం ఫలితాలు వచ్చాయి. పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 14 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.
పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు - రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ గడువు కూడా!
తెలంగాణలో ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ ఫ‌లితాలు మే 9న విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌రీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం జూన్ 4 నుంచి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షలు నిర్వహించాల‌ని ఇంట‌ర్ బోర్డు నిర్ణయించిన విష‌యం విదిత‌మే. ఫెయిలైన విద్యార్థులు మే 16 వ‌ర‌కు సంబంధిత కాలేజీల్లో ప‌రీక్ష ఫీజు చెల్లించాల‌ని అధికారులు ఆదేశించారు. అయితే ఆయా కాలేజీల యాజ‌మాన్యాలు, విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రుల విజ్ఞప్తుల మేర‌కు ప‌రీక్ష ఫీజు చెల్లింపు గ‌డువును మే 19 వ‌ర‌కు పొడిగిస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ ఒక ప్రకటనలో తెలిపారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..