Telangana Inter Supplementary Exams: తెలంగాణలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును ఇంటర్ బోర్డు ఏప్రిల్ 27న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 24 నుంచి జూన్ 3 వరకు ఇంటర్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు.
➥ విద్యార్థులకు జూన్ 4 నుంచి 8 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు.
➥ ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు జూన్ 10న ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి పరీక్ష నిర్వహిస్తారు.
➥ ఇక జూన్ 11న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్, జూన్ 12న ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యూస్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు జరుగనున్నాయి.
ఇంటర్ ప్రథమ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు ఇలా..
➥ 24 (శుక్రవారం): సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1.
➥ మే 25 (శనివారం): ఇంగ్లిష్ పేపర్-1.
➥ మే 28 (మంగళవారం): మ్యాథమెటిక్స్ పేపర్-1ఎ, బోటని పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1.
➥ మే 29 (బుధవారం): మ్యాథమెటిక్స్ పేపర్-1బి, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1.
➥ మే 30 (గురువారం): ఫిజిక్స్ పేపర్-1, ఎకానమిక్స్ పేపర్-1.
➥ మే 31 (శుక్రవారం): కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1.
➥ జూన్ 1 (శనివారం): పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్-1 (బైపీసీ విద్యార్థులకు).
➥ జూన్ 3 (సోమవారం): మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జియోగ్రఫీ పేపర్-1.
ఇంటర్ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు..
➥ మే 24 (శుక్రవారం): సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2.
➥ మే 25 (శనివారం): ఇంగ్లిష్ పేపర్-2.
➥ మే 28 (మంగళవారం): మ్యాథమెటిక్స్ పేపర్-2ఎ, బోటని పేపర్-2, పొలిటికల్ సైన్స్ పేపర్-2.
➥ మే 29 (బుధవారం): మ్యాథమెటిక్స్ పేపర్-2బి, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2.
➥ మే 30 (గురువారం): ఫిజిక్స్ పేపర్-2, ఎకానమిక్స్ పేపర్-2.
➥ మే 31 (శుక్రవారం): కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్-2.
➥ జూన్ 1 (శనివారం): పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్-2 (బైపీసీ విద్యార్థులకు).
➥ జూన్ 3 (సోమవారం): మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జియోగ్రఫీ పేపర్-2.
VOCATIONAL SECOND YEAR TIME TABLE IPASE MAY 2024
VOCATIONAL TIMETABLE FIRST YEAR IPASE MAY 2024
ALSO READ:
ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు విడుదల
ఏపీలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును ఇంటర్మీడియట్ బోర్డు ఏప్రిల్ 25న వెల్లడించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 24 నుంచి జూన్ 1 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఒకే రోజు రెండు విడతలుగా పరీక్షలు జరుగనున్నాయి.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..