తెలంగాణలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది. రాష్ట్రంలోని అన్ని రకాల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశానికి తుది గడువును జూన్ 25 వరకు పొడిగించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ జులై 1న ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ బోర్డు నుంచి అనుబంధ గుర్తింపు పొందిన కళాశాలల్లోనే ప్రవేశాలు తీసుకోవాలని,  ఆయా కాలేజీల జాబితా బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని విద్యార్థులు, తల్లిదండ్రులకు మిత్తల్ సూచించారు. ఇప్పటివరకు ప్రవేశాలు పొందని వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా.. ఈ ఏడాది ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్ల సంఖ్యను పెంచేందుకు నవీన్‌మిట్టల్‌ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.


సప్లిమెంటరీ ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణలో ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు మరికొన్ని రోజుల్లో వెలువడనున్నాయి. అంతా సజావుగా జరిగితే వారంరోజుల్లోపు ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. మరో రెండ్రోజులు పట్టే అవకాశం ఉండడంతో అవి పూర్తి చేసిన తర్వాత రెండు మూడు రోజుల్లో ఫలితాలను వెలువరించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీంతో జులై 7లోపు ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.


తెలంగాణ ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 12 నుంచి 20 వ‌ర‌కు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉదయం ఫస్టియర్‌ విద్యార్థులకు, మధ్యాహ్నం సెకండియర్‌ వారికి పరీక్షలు జ‌రిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 933 పరీక్షాకేంద్రాల్లో ఈ ప‌రీక్షల‌ను నిర్వహించారు. ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌కి క‌లిపి మొత్తం 4,12,325 మంది విద్యార్థులు ఈ పరీక్షలను రాశారు. ఇందులో ఫస్టియర్‌కి 2,70,583 మంది, సెకండియ‌ర్‌కి 1,41,742 మంది విద్యార్థులు ఈ ప‌రీక్షల‌కు హాజ‌ర‌య్యారు.


ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫ‌లితాల‌ను వీలైనంత త్వర‌గా విడుద‌ల‌ చేసేందుకు ఇంట‌ర్ బోర్డ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే దోస్త్‌, ఇంజ‌నీరింగ్, ఇత‌ర‌ ప్రవేశాల ప్రక్రియ జ‌రుగుతున్న నేప‌థ్యంలో.. ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫ‌లితాల‌ను త్వర‌గా విడుద‌ల చేసేందుకు ఇంట‌ర్ బోర్డ్ అధికారుల క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫ‌లితాల‌ు విడుదలైన తర్వాత https://tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.


తెలంగాణ ఇంటర్ అకడమిక్​ ఇయర్ (​2023-24) క్యాలెండర్..


తెలంగాణలో జూనియర్ కళాశాలల అకడమిక్ ​క్యాలెండర్​ని ఇంటర్మీడియట్ బోర్డు ఏప్రిల్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిప్రకారం రాష్ట్రంలోని అన్ని జూనియర్​ కళాశాలలు జూన్​ 1న ప్రారంభమయ్యాయి.  ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం.. జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 19 నుంచి 25 వరకు దసరా సెలవులు, 2024, జనవరి 13 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. కాగా, ఇంటర్మీడియట్ విద్య కోసం ఈ ఏడాది మొత్తం 227 పని దినాలు ఉంటాయని బోర్డు తెలిపింది.  ఇక ఫిబ్రవరి రెండో వారం నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. థియరీ పరీక్షలను మార్చి మొదటివారం నుంచి నిర్వహిస్తారు. ఏప్రిల్ 1 నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు.


➥ జూనియర్ కాలేజీల పునఃప్రారంభం: 01.06.2023. 


➥ మొదటి, ద్వితీయ సంవత్సరాల ఇంటర్మీడియట్ తరగతులు: 01.06.2023.


➥ దసరా సెలవులు: 19.10.2023 - 25.10.2023.


➥ దసరా సెలవుల తర్వాత పునఃప్రారంభం: 26.10.2023.


➥ అర్ధ సంవత్సర పరీక్షలు: 20.11.2023 - 25.11.2023.


➥ సంక్రాంతి సెలవులు: 13.01.2024 - 16.01.2024.


➥ సంక్రాంతి సెలవుల తర్వాత పునఃప్రారంభం: 17.01.2024.


➥ ప్రీ-ఫైనల్ పరీక్షలు: 22.01.2024 - 29.01.2024.


➥ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు: 2024 ఫిబ్రవరి రెండవ వారం నుండి.


➥  ఇంటర్ థియరీ పరీక్షలు: 2024 మార్చి మొదటి వారం నుండి.


➥ వేసవి సెలవులు: 01.04.2024 - 31.05.2024.


➥ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు:  2024 మే చివరి వారంలో


➥ 2024-25 విద్యా సంవత్సరానికి జూనియర్ కళాశాలల పునఃప్రారంభ తేదీ: 01.06.2024.



ALSO READ:


ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ సీట్ల భర్తీకి ఎన్‌సెట్‌ నోటిఫికేషన్ వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!
ఇంటర్‌ విద్యార్హతతో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సులో ప్రవేశాలకు 2023-24 విద్యా సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(NCET) పేరిట జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆసక్తి ఉన్నవారు జూన్ 27 నుంచి జులై 19 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. పరీక్షల తేదీలను ఎన్టీఏ తర్వాత ప్రకటించనుంది.
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


ఇక తెలుగులోనూ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష! ఐఐటీ కౌన్సిల్‌లో నిర్ణయం!
జాయింట్‌ ఎంట్రన్స్ ఎగ్జామ్‌(జేఈఈ) అడ్వాన్స్‌డ్‌‌కు హాజరయ్యే తెలుగు విద్యార్థులకు కేంద్రప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. నీట్‌, జేఈఈ మెయిన్‌ తరహాలోనే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షనూ తెలుగు సహా 11 ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఐఐటీ కౌన్సిల్‌, ఐఐటీ ఢిల్లీని ఆదేశించింది. ప్రధానంగా ఐఐటీల్లో డ్రాపౌట్ల నివారణకు తీసుకోవల్సిన చర్యలపై ఐఐటీ కౌన్సిల్‌ దృష్టి పెట్టింది. డ్రాపౌట్స్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసి  నివేదికను ఇవ్వాలని ఐఐటీ ఖరగ్‌పూర్‌ను కౌన్సిల్‌ ఆదేశించింది. గత ఏప్రిల్‌లో జరిగిన ఐఐటీ కౌన్సిల్‌ మీటింగ్‌కు సంబంధించిన  తీర్మానాలను కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial