తెలంగాణలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పీజీఈసెట్) -2023 ఫలితాలు గురువారం (జూన్ 8న) విడుదల కానున్నాయి. జూన్ 8న మధ్యాహ్నం 3.30 గంటలకు ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
పీజీఈసెట్ ఫలితాల కోసం వెబ్‌సైట్
2023-24 విద్యా సంవత్సరంలో విశ్వవిద్యాలయాలు, అఫిలియేటెడ్ ఇంజినీరింగ్/ఫార్మసీ/ఆర్కిటెక్చర్ కళాశాలల్లో ఫుల్‌టైం ఎంఈ, ఎంటెక, ఎం.ఫార్మసీ, ఎం.ఆర్క్ కోర్సుల్లో ప్రవేశాల కోసం పీజీఈసెట్‌ను జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ నిర్వహించిన సంగతి తెలిసిందే.
మే 29 నుంచి జూన్ 1 వరకు సీబీటీ విధానంలో ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఆయాతేదీల్లో ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించారు. ఉదయం సెషన్‌కు 96.13 శాతం మంది విద్యార్థులు, మధ్యాహ్నం సెషన్‌కు 88.01 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.
పరీక్ష విధానం:
మొత్తం 120 మార్కులకు కంప్యూటర్ విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. పరీక్ష సమయం 2 గంటలు. పరీక్షలో ఎలాంటి నెగెటివ్ మార్కులు లేవు, పరీక్షలో కనీస అర్హత మార్కులను 25 శాతం (30 మార్కులు)గా నిర్నయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి అర్హత మార్కులు ఉండవు. ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
Also Read:
జూన్ 14న ఏపీ ఎడ్‌సెట్ పరీక్ష, వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో!
ఏపీలోని బీఈడీ, స్పెషల్ బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు 'ఏపీ ఎడ్‌సెట్-2023 పరీక్షను జూన్ 14న నిర్వహించనున్నట్లు ఏపీ ఎడ్‌సెట్ కన్వీనర్ ఆచార్య కె.రాజేంద్రప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 14న ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఎడ్‌సెట్ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
హాల్‌టికెట్లు, పరీక్ష విధానం కోసం క్లిక్ చేయండి..
తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్ క్యాలెండర్ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!
తెలంగాణలోని పాఠశాలలకు సంబంధించిన 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను ప్రభుత్వం జూన్ 6న విడుదల చేసింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతులకు కొత్త అకడమిక్ క్యాలెండర్ వర్తించనుంది. ఈ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం.. ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 229 రోజులు స్కూళ్లు పని చేయనున్నాయి. స్కూళ్లు జూన్ 12న ప్రారంభమై.. ఏప్రిల్ 23న ముగియనున్నాయి. అంటే ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 229 రోజులపాటు పాఠశాలలు పనిచేయనున్నాయి.ఈ ఏడాది జూన్ 12న పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. 2024 ఏప్రిల్ 23తో విద్యాసంవత్సరం ముగియనుంది. 2024 ఏప్రిల్ 24 నుంచి 2024 జూన్ 11 వరకు అంటే 49 రోజులు వేసవి సెలవులు ఉంటాయి. దసరా సెలవులు అక్టోబర్ 13 నుంచి 25వ తేదీ వరకు 13 రోజుల పాటు ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. ఇంకా సంక్రాంతి సెలవులు 2024 జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు మొత్తం 6 రోజులు ఉంటాయని వెల్లడించింది.
కొత్త విద్యాసంవత్సరం క్యాలెండర్ కోసం క్లిక్ చేయండి..