తెలంగాణలో పీజీ ఇంజినీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పీజీఈసెట్)-2023 దరఖాస్తును అధికారులు మే 5 వరకు పొడిగించారు. వాస్తవానికి దరఖాస్తు గడువు ఏప్రిల్ 30తో ముగియడంతో జేఎన్‌టీయూ-హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు దరఖాస్తు చేసుకొనేందుకు గడువును పొడిగించింది. దీంతో మే 5వరకు ఎలాంటి ఆలస్య రుసుం చెల్లించకుండానే విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత మళ్లీ గడువు పొడిగించే అవకాశం ఉండదని..అందువల్ల ఆసక్తి కలిగిన విద్యార్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని టీఎస్‌పీజీఈసెట్ కన్వీనర్ డా.బి.రవీంద్ర రెడ్డి సూచించారు.


2023-24 విద్యా సంవత్సరంలో విశ్వవిద్యాలయాలు, అఫిలియేటెడ్ ఇంజినీరింగ్/ఫార్మసీ/ఆర్కిటెక్చర్ కళాశాలల్లో ఫుల్‌టైం ఎంఈ, ఎంటెక్, ఎం.ఫార్మసీ, ఎం.ఆర్క్ కోర్సుల్లో ప్రవేశాల కోసం పీజీఈసెట్‌ను జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అర్హులైన అభ్యర్థులకు తొలుత మార్చి 3 నుంచి ఏప్రిల్ 30 వరకు దరఖాస్తులు ఆహ్వానించారు.. తాజాగా ఆ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 29 నుంచి జూన్ 1 వరకు ప్రవేశ పరీక్ష సీబీటీ విధానంలో జరగనుంది.


జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ టెక్నాల‌జిక‌ల్ యూనివ‌ర్సిటీ-హైదరాబాద్ (జేఎన్‌టీయూహెచ్) 'టీఎస్ పీజీఈసెట్' నోటిఫికేషన్‌ ఫిబ్రవరి 28న విడుద‌ల చేసిన సంగతి తెలిసిందే.  ఈ నోటిఫికేష‌న్ ద్వారా 2023-24 విద్యా సంవ‌త్సరానికి ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలు క‌ల్పించ‌నున్నారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది.


పరీక్ష విధానం:
మొత్తం 120 మార్కులకు కంప్యూటర్ విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. పరీక్ష సమయం 2 గంటలు. పరీక్షలో ఎలాంటి నెగెటివ్ మార్కులు లేవు, పరీక్షలో కనీస అర్హత మార్కులను 25 శాతం (30 మార్కులు)గా నిర్నయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి అర్హత మార్కులు ఉండవు. ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.


నోటిఫికేషన్, ఆన్‌లైన్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..


Also Read:


ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, ముఖ్యమైన తేదీలివే!
ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుండి జూన్‌ 1 వరకు జరగనున్నాయి. ఈ మేరకు షెడ్యూలును ఇంటర్‌బోర్డు ఏప్రిల్ 27న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌లో తప్పిన వారితోపాటు ఇంప్రూమెంట్‌ కోసం రాసే వారు కూడా ఈ పరీక్షలు రాయవచ్చు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్‌ విద్యార్ధులకు, అదేరోజు మధ్యాహ్నం 2.30 నుండి 5.30 గంటల వరకు సెకండియర్‌ విద్యార్ధులకు పరీక్షలు నిర్వహిస్తారు.
పరీక్షల షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


టీఎస్ ఎంసెట్-2023 హాల్‌టికెట్లు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణ ఎంసెట్ హాల్‌టికెట్లను ఉన్నత విద్యామండలి ఏప్రిల్ 30న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, ఇంటర్ (క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్) హాల్‌టికెట్ నెంబరు వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 10, 11 తేదీల్లో అగ్రికల్చర్ & మెడికల్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇక మే 12-14 మధ్య ఇంజినీరింగ్ పరీక్షలు జరగనున్నాయి. 
ఎంసెట్ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


పాలిసెట్‌ దరఖాస్తు గడువు పెంపు, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలో పాలిసెట్ దరఖాస్తు గడువును పొడిగించారు. రూ.200 ఆలస్య రుసుంతో దరఖాస్తు చేసుకునేందుకు మే 14 వరకు గడువు పెంచినట్లు పాలిసెట్ కన్వీనర్ డాక్టర్ శ్రీనాథ్ ఏప్రిల్ 25న ఒక ప్రకటనలో తెలిపారు. రూ.100 ఆలస్య రుసుంతో దరఖాస్తు గడువు ఏప్రిల్ 25తో ముగియగా.. రూ.200 ఆలస్య రుసుముతో మే 14 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. పదోతరగతి పూర్తయిన, చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 17న పాలిసెట్ ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు.
పాలిసెట్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..