ఎంటెక్, ఎంఫార్మసీ తదితర సీట్ల భర్తీకి నవంబరు 9 నుంచి స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. పీజీఈసెట్ మొదటి, రెండో విడతల కౌన్సెలింగ్‌లలో పాల్గొనని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు నవంబరు 9 నుంచి 11 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ పూర్తయినవారు నవంబరు 11, 12 తేదీల్లో వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. వీరికి నవంబరు 15న సీట్లను కేటాయిస్తారు. కాలేజీలవారీగా సీట్లు పొందిన అభ్యర్థుల వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది.  ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది. 


NOTIFICATION FOR SPECIAL ROUND OF WEB COUNSELLING 


Counselling Website


స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ షెడ్యూలు...

➛ నవంబరు 9 నుంచి 11 వరకు:  ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్, ఆన్‌లైన్ పేమెంట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం డాక్యుమెంట్స్ అప్‌లోడింగ్ 


➛ నవంబరు 11 నుంచి 12 వరకు: వెబ్ ఆప్షన్ల నమోదు.


➛ నవంబరు 15: కళాశాలలవారీగా సీట్లు పొందిన అభ్యర్థుల జాబితా ప్రకటన


➛ నవంబరు 15 నుంచి 19 వరకు: సంబంధిత కళాశాలలో రిపోర్ట్ చేయాలి. ఒరిజినల్ సర్టిఫికేట్లను పరిశీలిస్తారు. ట్యూషన్ ఫీజు చలానా సమర్పించాలి.




రెండో విడతలో ఇలా..


టీఎస్‌ పీజీఈసెట్‌ రెండో విడత సీట్లను అక్టోబరు 30 కేటాయించారు. ఎంఈ, ఎంటెక్‌, ఎంఫార్మ్‌, ఎంఆర్క్‌ కోర్సుల్లో కన్వీనర్‌ కోటా సీట్లు 6248 ఉండగా వీటిలో 2744 సీట్లను కేటాయించారు. మొత్తం 3270 మంది అభ్యర్థులు వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకున్నారు. వీరిలో 2744 మంది విద్యార్థులు మాత్రమే సీట్లు పొందారు. సీటు పొందిన విద్యార్థులు ఫీ చలాను తీసి అక్టోబరు 31 నుంచి నవంబర్‌ 3లోపు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరై కాలేజీలో రిపోర్టింగ్‌ చేశారు. మొదటి విడతలో 8815 కన్వీనర్‌ కోటా సీట్లలో 4731 మందికి కేటాయించగా అందులో ఇంతవరకు 2872 మంది విద్యార్థులు మాత్రమే కాలేజీల్లో చేరారు. మొదటి విడతలో మిగిలిన 6248 సీట్లకు రెండో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించగా 2744 సీట్లు భర్తీ అయ్యాయి.


రెండో విడతలో ఇలా..


తెలంగాణలో ఎంఈ, ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఫార్మ్‌-డి, ఎం-ఆర్కిటెక్చర్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన పీజీఈసెట్‌ కౌన్సెలింగ్‌ సెప్టెంబరు 19న ప్రారంభమైన సంగతి తెలిసిందే. పీజీఈసెట్ తొలి విడత సీట్లను అక్టోబరు 14న కేటాయించారు. ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో 8,815 కన్వీనర్ కోటా సీట్లున్నాయి. మొదటి విడతలో 5,494 మంది వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకోగా 4,731 మందికి సీట్లు దక్కాయి. ఎంటెక్‌‌లో 2,522 మందికి, ఎంఫార్మసీలో 2,163 మందికి సీట్లు కేటాయించారు. ఇక ఎంఆర్క్‌లో 46 మందికి సీట్లు పొందారు. సీట్లు సాధించిన విద్యార్థులు ఫీజు చెల్లించి అక్టోబరు 15 నుంచి 19 వరకు కళాశాలలో రిపోర్ట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 232 కాలేజీల్లో కన్వీనర్‌ కోటాలోని 9131 సీట్లు కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. తొలుత గేట్, జీప్యాట్ ర్యాంకర్లకు సీట్లు కేటాయించారు. పీజీఈసెట్‌ పరీక్షలో 11,520 మంది, గేట్‌/జీపీఏటీ పరీక్షలో 411 మంది మొత్తం 11931 మంది అర్హత సాధించారు. 


91.48 శాతం మంది అర్హత..


తెలంగాణలో ఎంటెక్‌, ఎం ఫార్మసీ, అర్కిటెక్చర్‌ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పీజీఈసెట్‌) ఆగ‌స్టు 2 నుంచి 5 వరకు నిర్వహించారు. మొత్తం 12 కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో ఉస్మానియా యూనివ‌ర్సిటీ ఈ ప‌రీక్షల‌ను నిర్వహించింది. పరీక్ష ఫలితాలను సెప్టెంబర్ 3న విడుద‌ల చేశారు. ఫలితాల్లో మొత్తం 91.48 శాతం మంది అర్హత సాధించారు. 19 విభాగాల్లో జరిగిన పరీక్షలకు మొత్తం 12,592 మంది హాజరుకాగా.. వారిలో 11,520 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణులైనవారిలో 6,440 మంది (55.90 శాతం) అమ్మాయిలు, 5,080 మంది అబ్బాయిలు ఉన్నారు. ఒక్క ఫార్మసీ విభాగంలోనే 5,186 మంది ఉత్తీర్ణులు కావడం విశేషం.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..