Telangana LAWCET/PGLCET 2023 Counseling: తెలంగాణ లాసెట్-2023 రెండో/తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ  డిసెంబరు 11న ప్రారంభమైంది. డిసెంబరు 13 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసినవారు డిసెంబరు 14 నుంచి 16 వరకు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్లు నమోదుచేసుకున్నవారికి డిసెంబరు 19న సీట్లను కేటాయించనున్నారు. సీటస్లు పొందిన అభ్యర్థులు డిసెంబరు 20 నుంచి 23లోపు నిర్ణీత ట్యూషన్ ఫీజు చెల్లించిపు రశీదు, విద్యార్హతల సర్టిఫికేట్లతో సంబంధింత కళాశాలలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.


రాష్ట్రంలోని లా కాలేజీల్లో మూడేళ్లు, అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్లు మొత్తం 6,894 అందుబాటులో ఉండగా 5,912 మందికి తొలి విడతలో సీట్లు దక్కాయి. వారిలో 65 శాతం మంది వరకు కళాశాలల్లో చేరారు. ఇక చివరి విడతకు దాదాపు 40 శాతం సీట్లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.


తుదివిడత కౌన్సెలింగ్‌ షెడ్యూలు ఇలా..


➥ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్: 11-12-2023 నుంచి 13-12-2023 వరకు.


➥ అర్హులైన అభ్యర్థుల జాబితా, ఈమెయిల్ ద్వారా అభ్యంతరాల స్వీకరణ: 14-12-2023.


➥ వెబ్‌ ఆప్షన్ల నమోదు: 14-12-2023 నుండి 16-12-2023 వరకు.


➥ వెబ్‌ ఆప్షన్ల సవరణ: 16-12-2023.


➥ సీట్ల కేటాయింపు: 19-12-2023.


➥  ఫీజు చెల్లించి, సంబంధిత కళాశాలల్లో రిపోర్టింగ్, ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలన: 20-12-2023 నుంచి 23-12-2023 వరకు.


Counselling Notification
Counselling Website


తొలి విడతలో 5912 మందికి ప్రవేశాలు..
తెలంగాణలోని లా కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తొలివిడత కౌన్సెలింగ్‌లో భాగంగా వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకున్న అభ్యర్థులకు అధికారులు నవంబరు 30న సీట్లను కేటాయించారు. మూడేళ్లు, అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ (LLB)తో పాటు ఎల్‌ఎల్‌ఎం (LLM) కోర్సుల్లో కన్వీనర్‌ కోటా సీట్లు మొత్తం 6,894 అందుబాటులో ఉన్నాయి. వాటి కోసం 12,835 మంది వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. అందులో 5,912 మందికి (85.75%) సీట్లు దక్కాయి. సీట్లు పొందిన వారు డిసెంబరు 6లోపు నిర్ణీత ఫీజు చెల్లించి, సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. డిసెంబరు 4 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. 


సీట్ల భర్తీ వివరాలు ఇలా..
➥ మూడేళ్ల ఎల్‌ఎల్‌బీలో మొత్తం 4,064 సీట్లు అందుబాటులో ఉండగా.. 3,589 సీట్లు భర్తీ అయ్యాయి.
➥ అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీలో మొత్తం 1,903 సీట్లు అందుబాటులో ఉండగా.. 1,579 సీట్లు భర్తీ అయ్యాయి.
➥ ఇక రెండేళ్ల పీజీ లాడిగ్రీలో మొత్తం 927 సీట్లు అందుబాటులో ఉండగా.. 744 సీట్లు భర్తీ అయ్యాయి.


సీట్ల వివరాలు ఇలా..
➥ మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు పరీక్షలో మొత్తం 20,234 మంది అభ్యర్థులు అర్హత సాధించగా.. రాష్ట్రంలోని 22 కళాశాలల్లో మొత్తం 4,790 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 
➥ అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు పరీక్షలో మొత్తం 6,039 మంది అభ్యర్థులు అర్హత సాధించగా.. రాష్ట్రంలోని 19 కళాశాలల్లో మొత్తం 2,280 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 
➥ ఇక రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం పరీక్షలో మొత్తం 2,776 మంది అభ్యర్థులు అర్హత సాధించగా.. రాష్ట్రంలోని 17 కళాశాలల్లో మొత్తం 930 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 


టీఎస్‌ లాసెట్‌, పీజీ లాసెట్‌ ప్రవేశ పరీక్ష మే 25న మూడు సెష‌న్లలో నిర్వహించిన సంగ‌తి తెలిసిందే. మొద‌టి సెష‌న్‌ను ఉద‌యం 9:30 గంట‌ల నుంచి 11 గంట‌ల వ‌ర‌కు, రెండో సెష‌న్‌ను మ‌ధ్యాహ్నం 12:30 నుంచి 2 గంట‌ల వ‌ర‌కు నిర్వహించారు. ఐదేండ్ల లా డిగ్రీ కోర్సు విద్యార్థుల‌కు మూడో సెష‌న్‌లో సాయంత్రం 4 నుంచి 5:30 గంట‌ల వ‌ర‌కు నిర్వహించారు. ఈ ఏడాది లాసెట్, పీజీఎల్‌సెట్ పరీక్షలకు దాదాపు 30 వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఫలితాల అనంతరం కౌన్సెలింగ్ తేదీలను ప్రకటించనున్నారు. పరీక్షల ఆన్సర్ కీని మే 29న ఆన్సర్ కీని విడుదల చేశారు. ఆన్సర్ కీపై మే 31 వరకు దరఖాస్తులు స్వీకరించారు. లాసెట్ ర్యాంకుల ఆధారంగా ఆయా కాలేజీల్లో సీట్లు కేటాయిస్తారు. మొద‌టి, రెండో సెష‌న్లకు తెలంగాణ‌లో 60, ఆంధ్రప్రదేశ్‌లో 4 ప‌రీక్షా కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. మూడో సెష‌న్‌కు తెలంగాణ‌లో 41, ఏపీలో 4 కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. మూడేండ్ల లా డిగ్రీ కోర్సుకు 31,485 మంది, ఐదేండ్ల లా డిగ్రీ కోర్సుల‌కు 8,858 మంది, ఎల్ఎల్ఎంకు 3,349 మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. లాసెట్, పీజీ ఎల్‌సెట్‌కు 43,692 మంది హాజ‌రయ్యారు కానున్నారు. పరీక్షకు హాజరైనవారిలో లాసెట్‌ (మూడేళ్ల ఎల్ఎల్‌బీ)లో 78.59 శాతం, లాసెట్ (ఐదేండ్ల ఎల్ఎల్‌బీ)లో 80.21 శాతం, పీజీ ఎల్‌సెట్‌(ఎల్ఎల్ఎం)లో 94.36 శాతం ఉత్తీర్ణత సాధించారు.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...