తెలంగాణ లాసెట్/ పీజీ ఎల్‌సెట్-2023 ప్రవేశ పరీక్ష ఫలితాలు జూన్ 15న విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండ‌లి చైర్మన్ ప్రొఫెస‌ర్ ఆర్ లింబాద్రి సాయంత్రం 4 గంటలకు లాసెట్ ఫలితాలను విడుద‌ల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లాసెట్‌ (మూడేళ్ల ఎల్ఎల్‌బీ)లో 78.59 శాతం, లాసెట్ (ఐదేండ్ల ఎల్ఎల్‌బీ)లో 80.21 శాతం, పీజీ ఎల్‌సెట్‌(ఎల్ఎల్ఎం)లో 94.36 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైంది.


ర్యాంక్ కార్డు ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి...


ర్యాంకు కార్డు కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి- lawcet.tsche.ac.in


➥ అక్కడ హోంపేజీలో కనిపించే 'Download Rank Card' అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.


అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి 'View Rank Card' బటన్ మీద క్లిక్ చేయాలి. 


➥ వివరాలు నమోదుచేసి సమర్పించగానే అభ్యర్థులకు సంబంధించిన ర్యాంక్ కార్డు కంప్యూటర్ తెర మీద డిస్ ప్లే అవుతుంది.


ర్యాంకు కార్డు డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకొని భవిష్యత్ అవసరాల కోసం భద్రపర్చుకోవాలి.


లాసెట్, పీజీఎల్‌సెట్ - 2023 ఫలితాల కోసం క్లిక్ చేయండి.. (లింక్-1)


లాసెట్, పీజీఎల్‌సెట్ ‌2023 ర్యాంకు కార్డుల కోసం క్లిక్ చేయండి.. (లింక్-2)


టీఎస్‌ లాసెట్‌, పీజీ లాసెట్‌ ప్రవేశ పరీక్ష మే 25న మూడు సెష‌న్లలో నిర్వహించిన సంగ‌తి తెలిసిందే. మొద‌టి సెష‌న్‌ను ఉద‌యం 9:30 గంట‌ల నుంచి 11 గంట‌ల వ‌ర‌కు, రెండో సెష‌న్‌ను మ‌ధ్యాహ్నం 12:30 నుంచి 2 గంట‌ల వ‌ర‌కు నిర్వహించారు. ఐదేండ్ల లా డిగ్రీ కోర్సు విద్యార్థుల‌కు మూడో సెష‌న్‌లో సాయంత్రం 4 నుంచి 5:30 గంట‌ల వ‌ర‌కు నిర్వహించారు. ఈ ఏడాది లాసెట్, పీజీఎల్‌సెట్ పరీక్షలకు దాదాపు 30 వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఫలితాల అనంతరం కౌన్సెలింగ్ తేదీలను ప్రకటించనున్నారు. పరీక్షల ఆన్సర్ కీని మే 29న ఆన్సర్ కీని విడుదల చేశారు. ఆన్సర్ కీపై మే 31 వరకు దరఖాస్తులు స్వీకరించారు. లాసెట్ ర్యాంకుల ఆధారంగా ఆయా కాలేజీల్లో సీట్లు కేటాయిస్తారు. మొద‌టి, రెండో సెష‌న్ల‌కు తెలంగాణ‌లో 60, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 4 ప‌రీక్షా కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. మూడో సెష‌న్‌కు తెలంగాణ‌లో 41, ఏపీలో 4 కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. లాసెట్, పీజీ ఎల్‌సెట్‌కు 43,692 మంది హాజ‌రు కానున్నారు. మూడేండ్ల లా డిగ్రీ కోర్సుకు 31,485 మంది, ఐదేండ్ల లా డిగ్రీ కోర్సుల‌కు 8,858 మంది, ఎల్ఎల్ఎంకు 3,349 మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.


Also Read:


ఏపీ ఐసెట్‌ ఫలితాలు విడుదల, టాపర్లు వీరే - రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే!
ఏపీ ఐసెట్ ఫలితాలు జూన్ 15న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు మే 24న ఈ పరీక్షను నిర్వహించారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ పరీక్ష జరిగింది. ఐసెట్‌లో విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా 2023 విద్యా సంవత్సరానికి ఫుల్‌టైం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఏపీలో 109, తెలంగాణలో 2 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షను 44 వేల మందికి పైగా విద్యార్థులు రాశారు. 
ఐసెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..


డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి జూన్ 18న నోటిఫికేషన్‌, ఇతర తేదీలు ఇలా!
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి జూన్ 18న నోటిఫికేషన్ వెలువడనుంది. ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో అన్‌లైన్‌ విధానంలో ప్రవేశ ప్రక్రియ కొనసాగనుంది. విద్యార్థులు ప్రవేశాల కోసం జూన్ 19 నుండి 24 వరకు వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇక జూన్ 21 నుండి 23 వరకు స్పెషల్‌ కేటగిరీ అభ్యర్థులకు సర్టిఫికేట్ల పరిశీలన చేపడతారు. తదనంతరం జూన్ 26 నుండి 30 వరకు వెబ్‌ అప్షన్లకు అవకాశం కల్పిస్తారు. వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకున్న అభ్యర్థులకు జులై 3న  సీట్లను కేటాయిస్తారు. డిగ్రీ కళాశాలల్లో జులై 4 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..