తెలంగాణలో ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను ఇంటర్ బోర్డు విడుదలచేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఇంటర్‌ జనరల్‌, ఒకేషనల్‌ విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. విద్యార్ధులు తమ పదోతరగతి హాల్‌టికెట్ నెంబర్ లేదా పాత హాల్‌టికెట్ నెంబర్ లేదా రూల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్ పొందవచ్చు.


తెలంగాణలో ఆగస్టు 1 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. మరోవైపు జులై 26న ప్రారంభమైన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జులై 30తో ముగియనున్నాయి.


Download Supplementary Hall Tickets 2022


ఈ సారి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9.28 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజ‌ర‌య్యారు.  ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలో మొత్తం 2,94,378 మంది ఉత్తీర్ణత సాధించగా.. సెకండ్ ఇయర్‌లో 4,63,370 మంది ఉత్తీర్ణులయ్యారు. పరీక్షల్లో ఫెయిలైన వారికి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.


ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ హాల్ టిక్కెట్లు వచ్చేశాయ్.. ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి!


ఇంట‌ర్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు ఇదే..:


ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి 10 వరకు ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు.


మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూల్:



  • ఆగస్టు 1 - సెకండ్‌ లాంగ్వేజ్‌

  • ఆగస్టు 2 - ఇంగ్లిష్‌

  • ఆగస్టు 3 - మ్యాథ్స్‌ పేపర్‌–1ఎ, బోటనీ, పొలిటికల్ సైన్స్

  • ఆగస్టు 4 - మ్యాథ్స్–1బి, హిస్టరీ, జువాలజీ

  • ఆగస్టు 5 - ఫిజిక్స్, ఎకనావిుక్స్‌

  • ఆగస్టు 6 - కెవిుస్ట్రీ, కామర్స్

  • ఆగస్టు 8 - పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్‌ (బైపీసీ విద్యార్థులకు)

  • ఆగస్టు 10 - మోడ్రన్ లాంగ్వేజ్, జియోగ్రఫీ.


సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ 2022.. దరఖాస్తుకు కొద్దిరోజులే!

సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్:



  • ఆగస్టు 1 - సెకండ్‌ లాంగ్వేజ్‌

  • ఆగస్టు 2 - ఇంగ్లిష్‌

  • ఆగస్టు 3 - మ్యాథ్స్‌ పేపర్‌–2ఎ, బోటనీ, పొలిటికల్ సైన్స్

  • ఆగస్టు 4 - మ్యాథ్స్–2బి, హిస్టరీ, జువాలజీ

  • ఆగస్టు 5 - ఫిజిక్స్, ఎకనావిుక్స్‌

  • ఆగస్టు 6 - కెవిుస్ట్రీ, కామర్స్

  • ఆగస్టు 8 - పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్‌ (బైపీసీ విద్యార్థులకు)

  • ఆగస్టు 10 - మోడ్రన్ లాంగ్వేజ్, జియోగ్రఫీ