TS ECET 2022 Results Release: తెలంగాణ ఈసెట్-2022 ఫలితాలు (TS ECET 2022 Results Release) ఆగస్టు 12న విడుదలయ్యాయి. ఉదయం 11.15 గంటలకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఈసెట్-2022 ఫలితాలను విడుదల చేశారు. ఈసెట్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు. ఈసెట్ ఫలితాల్లో 90.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అభ్యర్థులు తమ ఈసెట్ హాల్‌టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేది వివరాలు సమర్పించి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
TS ECET - 2022 RANK CARD
టీఎస్‌ఈసెట్-2022 (TS ECET 2022 Results Release) ఆగస్టు 1న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్ష కోసం తెలంగాణ, ఏపీల్లో కలిపి 24,055 మంది దరఖాస్తు చేసుకోగా 22,001 (91.46శాతం)మంది విద్యార్థులు హాజరయ్యారు. టీఎస్‌ఈసెట్ ప్రాథమిక 'కీ'ని ఆగస్టు 2న సాయంత్రం 6 గంటలకు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి అభ్యంతరాల స్వీకరించారు. దీంతో ఆగస్టు 12న ఫలితాలను వెల్లడించనున్నారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచనున్నారు.
ఫలితాల విడుదల అనంతరం అభ్యర్థులు తమ ఫలితాలను ఇలా చెక్ చేసుకోవచ్చు..
Step 1: అభ్యర్థులు మొదటగా https://ecet.tsche.ac.in/ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
Step 2: అనంతరం హోం పేజీలో టీఎస్ ఈసెట్ రిజల్ట్స్ 2022 (TS ECET Results 2022) సంబంధించిన లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి.
Step 3: అనంతరం కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో అభ్యర్థులు హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేసి SUBMIT పై క్లిక్ చేయాలి.
Step 4: తర్వాత మీ రిజల్ట్ స్క్రీన్ పై కనిపిస్తుంది. ఆ కాపీని ప్రింట్ తీసుకుని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోవాలి.
Also Read: TS EAMCET Results 2022: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇక్కడ చూసుకోండి!
విద్యార్థులకు అలర్ట్, స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్లు అప్పటినుంచే!
తెలంగాణలో 2022-23 విద్యాసంవత్సరానికి పోస్టుమెట్రిక్ స్కా లర్‌షిప్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగుల ఈ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త స్కాలర్‌షిప్, రెన్యూవల్ కోసం కాలేజీలు, విద్యార్థులు వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు ఈ-పాస్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 15 నుండి అక్టోబర్ 15 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. SC, STకి చెందిన విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం సంవత్సరానికి రూ.2 లక్షలు లేదా అంతకంటే తక్కువగా ఉండాలి. BC, EBC లేదా వికలాంగ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలంటే వారి ఆదాయం సంవత్సరానికి రూ.1 లక్ష లేదా అంతకంటే తక్కువ ఉండాలి. దరఖాస్తు చేసుకునే విద్యార్థి హాజరు శాతం ప్రతి త్రైమాసికం చివరిలో 75 శాతంగా ఉండాలి.
ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..